
సాక్షి, అమరావతి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతి రూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. (సంఘీభావ పాదయాత్రలకు నీరాజనం )
చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి. తల్లిదండ్రుల ఆశలకు ప్రతిరూపాలు వారు. ఆ చిన్నారులకు మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి చదువొక్కటే. అందుకే చిన్నారుల భవిష్యత్తుని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. రేపటి నవ సమాజ నిర్ణేతలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. #ChildrensDay2020
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 14, 2020
కాగా, అంతకు క్రితం రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని, ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతున్ని కోరుకుంటున్నానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment