చెన్నై, టీ.నగర్: బాలల దినోత్సవం నవంబరు 14వ తేదీన సెల్‌ఫోన్లు స్విచాఫ్ చేసి పిల్లలతో ఆనందంగా గడపాల్సిందిగా తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అన్ని పాఠశాలలకు ఒక సర్క్యులర్ పంపింది. పాఠశాలల్లో నవంబరు 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ తరçఫున ఆరోజున సెల్‌ఫోన్లను లేకుండా గడపాల్సిందిగా పిలుపునిచ్చింది. ఉదయం 7.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు తల్లిదండ్రులు తమ సెల్‌ఫోన్లను స్విచాఫ్ చేసి పిల్లలతో గడపాలని, దీన్ని వారానికి ఒకసారి లేదా రోజూ కూడా అమలులోకి తీసుకురావచ్చని తెలిపింది. విద్యార్థులు కూడా తమ తల్లిదండ్రుల వద్ద ఈ విషయంపై ఒత్తిడి తేవాలని కోరింది. పిల్లలు, ఉపాధ్యాయులు దీన్ని ఆచరణలో పెట్టాలని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment