రాజ్‌భవన్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు | Children's Day Celebrated At Raj Bhavan In Vijayawada | Sakshi
Sakshi News home page

పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌

Published Thu, Nov 14 2019 10:02 AM | Last Updated on Thu, Nov 14 2019 10:24 AM

Children's Day Celebrated At Raj Bhavan In Vijayawada - Sakshi

(ఫైల్‌ ఫోటో)

సాక్షి, విజయవాడ : రాజ్‌భవన్‌లో బాలల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ సందర్భంగా పిల్లలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు మంచి లక్ష్యాలతో ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను పిల్లలకు వివరించారు. ప్రపంచంలోనే ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందని అన్నారు. మహనీయుల ఆశయాలు, ఆలోచనలను విద్యార్థులు అలవరుచుకోవాలని సూచించారు. అన్నిరంగాల్లో దేశ పురోగాభివృద్ధిలో బాలలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పిల్లలందరికీ బాలాజీ, దుర్గమాత ఆశీస్సులు ఉండాలని దీవించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement