
రాచనగరిలో కీచకులు
బాలికపై సామూహిక అత్యాచారం
బాలల దినోత్సవం రోజున ఘటన
ఆలస్యంగా వెలుగులోకి నిందితుల కోసం ముమ్మర గాలింపు
మైసూరు : సభ్య సమాజం తలదించుకునే సంఘటన రాచనగరిలో చోటుచేసుకుంది. బాలల దినోత్సవం రోజునే ఓ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన మైసూరును ఓ అపాయకర నగరంగా మార్చివేసింది. ఉదయ గిరి పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసిన సంఘటన వివరాలు ... ఈనెల 14న బాలల దినోత్సవం రోజున నగరానికి చెందిన 13 ఏళ్ల బాలికను నదీంపాష అనే యువకుడు శాంతినగర పార్కుకు తీసుకువచ్చాడు. తన స్నేహితుడి ఇంటి వద్ద చిన్న కార్యక్రమం ఉందని సదరు బాలికకు మాయమాటలు చెప్పి శ్రీరంగపట్టణంలోని డాబాలోని ఓ గదికి తీసుకెళ్లాడు.
అప్పటికే ఆ గదిలో తన స్నేహితులు తన్వీర్, సద్దాం షరీఫ్‌లు ఉన్నారు. ముగ్గురు కలిసి బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఈ విషయం బయటపెడితే చంపేస్తామని బాలికను బెదిరించి ఇంటికి పంపివేశారు. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయాన్ని ఇంటిలో ఎవరికి చెప్పలేదు. రెండు రోజుల క్రితం తీవ్ర కడుపునొప్పి రావడంతో భయపడిపోరుున బాలిక అసలు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.