
సాక్షి, గుంటూరు: గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పడం లేదని.. ఒక వేళ అరెస్ట్ చేస్తే 24 గంటల్లోపు కోర్టులో హాజరుపర్చాలని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గురువారం రాత్రి.. గోరంట్ల మాధవ్‌తో మాట్లాడేందుకు నగరపాలెం పీఎస్‌కు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి వెళ్లారు. కానీ గోరంట్ల మాధవ్‌ను ఎక్కడ ఉంచారో పోలీసులు చెప్పకపోవడంతో అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ను లోకేష్ పెంచి పోషించారని.. వైఎస్సార్‌సీపీ నేతలపై కిరణ్‌తో అనుచిత వ్యాఖ్యలు చేయించారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చేబ్రోలు కిరణ్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోందని.. దీంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం కిరణ్‌ను అరెస్ట్ చేయించి.. చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు.
