నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు | PM Narendra Modi Sensational comments on Nehru in Lok Sabha | Sakshi
Sakshi News home page

నెహ్రూపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Feb 6 2020 3:51 PM | Last Updated on Fri, Mar 22 2024 11:10 AM

 భారత ప్రధాని నరేంద్ర మోదీ భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై పార్లమెంట్‌లో మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉందని నెహ్రూ ఒక లేఖలో పేర్కొన్న విషయాన్ని గురువారం మోడీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని  నెహ్రూ అప్పటి అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బర్దోలీకి రాసిన లేఖలో  హిందూ శరణార్థులు, ముస్లిం వలసదారులకు అర్థం ఏంటనేది స్పష్టంగా వివరించారని తెలిపారు. దేశంలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సమయంలో నరేంద్ర మోదీ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement