జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌ | Jawaharlal Nehru Memorial Fund Scholarship 2021: Full Details in Telugu | Sakshi
Sakshi News home page

జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌

Published Tue, Mar 30 2021 2:39 PM | Last Updated on Tue, Mar 30 2021 2:42 PM

Jawaharlal Nehru Memorial Fund Scholarship 2021: Full Details in Telugu - Sakshi

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్‌ (జేఎన్‌ఎంఎఫ్‌).. డాక్టోరల్‌ స్టడీస్‌ చదివే దేశానికి చెందిన వారితోపాటు, ఇతర ఆసియా దేశాల విద్యార్థులకు జవహర్‌లాల్‌ నెహ్రూ ఉపకార వేతనాలు అందించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

► పీహెచ్‌డీ చదివే విద్యార్థులకు జవహర్‌లాల్‌ నెహ్రూ స్కాలర్‌షిప్స్‌:
► స్కాలర్‌షిప్‌ అందించే సమయం: రెండేళ్లు.

పీహెచ్‌డీ విభాగాలు: ఇండియన్‌ హిస్టరీ అండ్‌ సివిలైజేషన్, సోషియాలజీ, కంపెరేటివ్‌ స్టడీస్‌ ఇన్‌ రిలీజియన్‌ అండ్‌ కల్చర్, ఎకనామిక్స్, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఎకాలజీ–ఇన్విరాన్‌మెంట్‌. వీటిలో ఏదో ఒక స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు ఉపకార వేతనం లభిస్తోంది.

అర్హత: కనీసం 60శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఫుల్‌టైం పీహెచ్‌డీ స్కాలర్‌ అయి ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ, జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్, తీన్‌మూర్తీ హౌస్, న్యూఢిల్లీ–110011 చిరునామాకు పంపించాలి.

► దరఖాస్తులకు చివరి తేది: 31.05.2021
► వెబ్‌సైట్‌: jnmf.in

చదవండి: 
JEE Advanced 2021: అడ్వాన్స్‌డ్‌లో విజయం ఇలా..!

సీఏ, సీఎస్, సీఎంఏలకు పీజీ హోదాతో ప్రయోజనాలెన్నో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement