‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం’ | Subrahmanya Swamy Made Sensational Remarks On Nehru | Sakshi
Sakshi News home page

‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్‌ఫోర్స్‌ విమానం’

Published Thu, May 9 2019 9:29 AM | Last Updated on Thu, May 9 2019 2:04 PM

Subrahmanya Swamy Made Sensational Remarks On Nehru - Sakshi

నెహ్రూపై స్వామి సంచలన ఆరోపణలు

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్‌ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యం‍లో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్‌ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తన యూరప్‌ భార్య కోసం ఎయిర్‌ఫోర్స్‌ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్‌ చేశారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement