subrahmanya swami
-
విశాఖ శారదాపీఠంలో సుబ్రమణ్య షష్టి వేడుకలు
-
సీఎం కేసీఆర్‌తో ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి భేటీ
-
‘పీఎంఓతో ఉపయోగం ఉండదు.. గడ్కరీకి ఇవ్వండి’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్య సభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ యుద్దాన్ని కట్టడి చేసే బాధ్యత రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో కేవలం పీఎంఓపై మాత్రమే ఆధారపడితే ఉపయోగం ఉండదు. అది కేవలం ఓ విభాగం మాత్రమే.. ప్రధానమంత్రి కాదు. పైగా పీఎంఓలో చాలా కేంద్రీకరణ ఉంది. ఇస్లామిక్ ఆక్రమణదారులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల నుంచి భారతదేశం ఎలా విముక్తి పొందిందో అదే మాదిరిగానే కరోనావైరస్ నుంచి బయటపడుతుంది అని ఆయన ట్వీట్ చేశారు. India will survive Coronavirus Pandemic as it did Islamic invaders and British Imperialists. We could face one more wave that targets children unless strict precautions now are taken. Modi should therefore delegate the conduct of this war to Gadkari. Relying on PMO is useless — Subramanian Swamy (@Swamy39) May 5, 2021 విదేశాల సాయంతో మెడికల్ ఆక్సిజన్, టీకాలు, రెమ్‌డెసివిర్ సహా కీలకమైన కోవిడ్ నిత్యావసరాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే విషయంలో భారతదేశం కష్టపడుతుంది. ఇలాంటి తరుణంలో నితిన్ గడ్కరీ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. Because dealing with COVID 19 needs an infrastructure framework in which aspect Gadkari has proved his ability — Subramanian Swamy (@Swamy39) May 5, 2021 చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు -
‘ఎయిర్ ఇండియా విక్రయంపై కోర్టుకెళ్తా’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియా విక్రయంపై విపక్షాలకు తోడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి పూనుకుంటే తాను న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియపై స్వామి స్పందిస్తూ ఇది జాతి వ్యతిరేక నిర్ణయమని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ నిర్ణయంపై విపక్ష కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. (ఎయిర్ ఇండియా దక్కేది వీరికే..?) ‘ప్రభుత్వం వద్ద డబ్బు లేకుంటేనే ఇలాంటివి చేస్తుంటారు..భారత ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్..వృద్ధి 5 శాతానికి దిగజారింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద రూ కోట్లు బకాయిలు పేరుకుపోయాయి..ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టా’రని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. కాగా నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియా అమ్మకానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం ప్రిలిమనరీ బిడ్లను ఆహ్వానించింది. మార్చి 17లోగా ఆసక్తి వ్యక్తీకరణను తెలపాలని ఈ ప్రకటనలో ప్రభుత్వం బిడ్డర్లను కోరింది. చదవండి : 'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు' -
‘నవంబర్ నుంచి మందిర్ నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణం నవంబర్ నుంచి ప్రారంభమవుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో సాగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో రామాలయానికి అనుగుణంగా సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రార్ధించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కన్న స్వామి దీన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదన్నారు. రామజన్మభూమిలో రామ మందిరాన్ని ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి తన జన్మదినం సందర్భంగా శనివారం అయోధ్యకు చేరుకున్నారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కోరిన నేపథ్యంలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంగమనార్హం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం రామ మందిర నిర్మాణానికి సమయం ఆసన్నమైందని, ఉమ్మడి పౌరస్మృతిపైనా ఓ నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ థాకరే కేంద్రాన్ని కోరారు. -
‘పళని’ పంచామృతానికి జీఐ గుర్తింపు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పళని పంచామృతానికి జీఐ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని జియోగ్రాఫిక్ ఇండెక్షన్ డిప్యూటీ రిజిస్ట్రార్ చిన్న రాజ్ చెప్పారు. దిండుగల్ జిల్లా పళనిలో దండాయుధపాణి స్వామిగా వెలసిన సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. పళని అంటే పంచామృతం. సహజ సిద్ధంగా ఐదు రకాల వస్తువులతో ఈ ప్రసాదం తయారు చేస్తారు. అరటి, బెల్లం, ఆవు నెయ్యి, స్వచ్ఛమైన తేనె, కర్జూరం వంటి వాటితో సిద్ధం చేస్తున్న ఈ పంచామృతం కొనుగోలుకు భక్తులు బారులు తీరుతుంటారు. దీని విక్రయాలు, అన్ని రకాల హక్కులు పళని ఆలయ పాలక మండలికే అప్పగించారు. ఈ నేపథ్యంలో ప్రసిద్ధి చెందిన ఈ పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పించేందుకు తగ్గ చర్యలు చేపట్టి, సెంటర్ ఫుడ్ టెక్నాలజీ పరిశోధన కేంద్రంలో అన్ని రకాల పరిశోధనలు చేశారు. ప్రక్రియలన్నీ ముగియడంతో పళని పంచామృతానికి జీఐ గుర్తింపు కల్పిస్తూ బుధవారం సంబంధిత వర్గాలు ప్రకటించాయి. -
ఆదాయ పన్ను రద్దు సాధ్యమా?
రెండంకెల వృద్ధి సాధించాలంటే పొదుపును పెంచాలి. ఆదాయ పన్ను రద్దు చేయాలి అన్నారు డాక్టర్ సుబ్రమణ్య స్వామి గతంలో ఓసారి. కొంతమంది రాజకీయవేత్తలు, ఆదాయ పన్ను నిపుణులు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. దీన్ని తెలివైన చర్యగా భావించవచ్చా? నిపుణులు ఏముంటున్నారో పరిశీలిద్దాం. ఆదాయ పన్ను ప్రభుత్వ రాబడికి ప్రధాన వనరు. భారత్ లాంటి దేశాల్లో పన్ను ఆదాయం సుస్థిర ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడుతుంది. పన్ను నిపుణుల ప్రకారం.. 2016 –17లో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 7.41 కోట్ల మంది. వీరి ద్వారా ప్రభుత్వానికి రూ. 8.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. మన జనాభాలో పన్ను చెల్లింపుదారులు కేవలం 2 శాతం మందే. జీడీపీలో ప్రత్యక్ష పన్నుల వాటా 5.98 శాతం మాత్రమే. ఈ వాటాను పెంచడానికి బదులు, అసలు ఆదాయ పన్నునే రద్దు చేయాలన్న ఆలోచనను పలువురు ముందుకు తెస్తున్నారు. జనం చేతుల్లో మరింత డబ్బు ఉండేలా చేయడమనేది దీని వెనక ఉన్న ఉద్దేశం. ‘పర్యవసానంగా డిమాండ్ పెరుగుతుంది. వ్యవస్థలోకి పెట్టుబడులు ప్రవహిస్తాయి. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది’ అంటున్నారు కేపీఎంజీ (ఇండియా)లో కార్పొరేట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ విభాగాధిపతి హిమాన్షు పరేఖ్. అయితే, ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు, ఆర్థిక వ్యవస్థ అవసరాల కోసం భారీగా నిధులు కావాలి. 2030 నాటికి లక్ష గ్రామాల డిజిటలీకరణ, గ్రామాల పారిశ్రామికీకరణ, నదుల శుద్ధీకరణ, తీర ప్రాంత విస్తరణ, ఆహార రంగంలో స్వయం సమృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సౌకర్యాల కల్పన తదితర లక్ష్యాలు సాధించాల్సివుంది. ఈ నేపథ్యంలో పన్ను రద్దు ప్రతిపాదన అసంబద్ధమైనదే అవుతుందంటున్నారు పరేఖ్. పైగా ప్రత్యక్ష పన్నుల విధానం న్యాయబద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలని ఆయన చెబుతున్నారు. పన్నుల మొత్తాలతోనే ప్రభుత్వాలు సమాజంలోని దిగువ తరగతి వర్గాలకు సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అమలు చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష పన్నులను రద్దు చేయాలంటే ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించాల్సి ఉందంటున్నారు డెలాయిట్ ఇండియా భాగస్వామి సరస్వతి కస్తూరి రంగన్. ప్రత్యక్ష పన్నుల రద్దు ద్వారా కోల్పోయే ఆదాయాన్ని – పరోక్ష పన్నులు పెంచడం వంటి ఇతరత్రా చర్యల ద్వారా సమకూర్చుకోవాలని ఆయన సలహా ఇస్తున్నారు. ఆదాయ పన్ను రద్దు వల్ల పన్ను చెల్లింపుదారులు తమ డబ్బును పొదుపు మార్గాల్లోకి, పెట్టుబడుల్లోకి మళ్లిస్తారని, ప్రత్యక్ష పన్ను వ్యవస్థ నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేసే ఖర్చు కూడా తగ్గుతుందని పలువురు పన్ను నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ఇప్పటికే 3.4 శాతం ద్రవ్య లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థపై ఈ చర్య వ్యతిరేక ప్రభావం చూపుతుందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ‘ప్రస్తుతం యూఏఈ, కేమన్ ఐలాండ్స్, బహమాస్, బెర్ముడా తదితర కొన్ని దేశాలు ఆదాయ పన్ను విధించడం లేదు. పెద్ద దేశాలు మాత్రం పన్ను వసూలు చేస్తూనే ఉన్నాయి. నిజానికి, ప్రతి దేశమూ కనీసపాటి పన్ను విధించాలంటున్న ఓఈసీడీ – ఇందుకు శ్రీకారం కూడా చుట్టింది. ఆదాయ పన్నును రద్దు చేయడం వల్ల కొన్ని అనుకూలతలు దరి చేరవచ్చునేమో గానీ, భారత్‌లోని స్థూల ఆర్థిక దృశ్యాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాన్ని రద్దు చేయకపోవడమే ఉత్తమం. ఇందుకు బదులుగా పన్ను రేట్లను తగ్గించడం, పన్ను విధానాన్ని మెరుగ్గా అమలు పరచడం అవసరం’ అంటున్నారు పరేఖ్. అమెరికా, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆదాయ పన్ను వసూలు చేస్తుండటం, దానిపై ఆధారపడి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటూ ఉండటం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన విషయం. ప్రత్యక్ష పన్ను చట్టాల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఈ నెల 31న తన నివేదిక సమర్పించనుంది. -
అంతమాత్రాన బ్రిటిష్ పౌరుడౌతారా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పౌరసత్వం అంశం తేలేదాకా ఆయన్ను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీ 2005–06లో వెలువరించిన తన వార్షిక నివేదికలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొందంటూ దాఖలైన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం విచారించింది. బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అందజేసిన సమాచారంపై కేంద్రం, ఈసీ స్పందించిన తీరు తమకు అసంతృప్తి కలిగించిందని పిటిషనర్లు జై భగవాన్ గోయెల్, సీపీ త్యాగి పేర్కొన్నారు. రాహుల్ బ్రిటిష్ జాతీయుడనేందుకు ప్రాథమిక ఆధారాలున్నందున ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఆయన్ను యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్‌ల నుంచి పోటీ చేయకుండా చూడాలని కోరారు. బ్రిటిష్ పౌరుడైన రాహుల్ పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా ఈసీకి సూచించాలని కోరారు. ద్వంద్వ పౌరసత్వం కలిగినట్లు ఆరోపణలున్న రాహుల్ ప్రధాని కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. స్పందించిన ధర్మాసనం..‘ఓ కంపెనీ తన పత్రాల్లో రాహుల్ జాతీయతను బ్రిటిష్ అని పేర్కొన్నంత మాత్రాన ఆయన బ్రిటిష్ పౌరుడైపోతారా? ఒకవేళ 123 కోట్ల మంది ప్రజలు ఆ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకుంటే మీరేం చేస్తారు?’ అని ప్రశ్నించింది. ‘అసలు మీరెవరు? మీరేం చేస్తుంటారు?’అని ధర్మాసనం ప్రశ్నించగా..‘ప్రజా సంబంధ అంశాలపై స్పందిస్తుంటాం, సంఘ సేవకులం, రాజకీయాల్లో కూడా ఉన్నాం’ అని పిటిషనర్లు బదులిచ్చారు. అందుకు ధర్మాసనం.. ‘అయితే, మీరు రాజకీయ సామాజిక సేవలో ఉన్నారన్నమాట’ అని వ్యాఖ్యానించింది. 2005–2006 సంవత్సరాల్లో ఈ ఘటన జరగ్గా ఇప్పటిదాకా కోర్టుకు ఎందుకు రాలేదు? మీరు ఈ విషయం ఎప్పుడు తెలుసుకున్నారు? అని ధర్మాసనం అడగ్గా.. ఈ అంశం 2015లో మాత్రమే వెలుగులోకి వచ్చిందని పిటిషనర్ల లాయర్ బదులిచ్చారు. ‘అయినప్పటికీ, న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు మీరు నాలుగేళ్లు తీసుకున్నారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఎస్ఎఫ్ జవాన్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీం న్యూఢిల్లీ: వారణాసి లోక్‌సభ స్థానంనుంచి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా వేసిన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ, మాజీ బీఎస్ఎఫ్ జవాన్ తేజ్‌బహదూర్ యాదవ్ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ‘పిటిషన్‌ను విచారించడానికి సహేతుకమైన కారణాలు కనిపించడం లేదు’ అంటూ సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడంపై ఎన్నికల సంఘం మోదీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆరోపిస్తూ బహదూర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్‌ఫోర్స్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూరప్ భార్య కోసం ఎయిర్‌ఫోర్స్ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. The Namo citing Virat misuse recalls for me the case of my father in law J.D. Kapadia ICS who as Defence Secy in the 1950s refused to give Airforce plane to ferry one of Nehru’s European mistresses. Of course he was transferred and next Secy okayed. Thus the decline be began — Subramanian Swamy (@Swamy39) May 9, 2019 -
రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
శ్రీశ్రీ రవిశంకర్‌కి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీరామ్ పంచుకి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లాకు ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు! ఫోన్లు పక్కన పడేసి వీళ్ల ముగ్గురూ ఏం చేస్తున్నట్లు! అప్పుడే అయోధ్య పనిలో మునిగి పోయారా?! బహుశా మీడియేషన్కి ముందు వామప్ మెడిటేషనేదో చేయిస్తూ ఉండి వుంటాడు రవిశంకర్. మెడిటేషన్లో ఉన్నప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోమని కూడా చెప్పి ఉంటాడు. రంజన్ గొగోయ్‌కి ఫోన్ చేశాను. ఎత్తారు!! ఎత్తడమే కాదు, ‘‘చెప్పండి సుబ్రహ్మ ణ్యస్వామిగళ్’ అన్నారు. సంతోషం వేసింది. నన్నే కాదు, నా ప్రాంతాన్నీ గుర్తించారు! ‘‘దేశం సేఫ్ హ్యాండ్స్‌లో ఉందన్న భావన తొలిసారిగా కలుగుతోంది గొగోయ్‌జీ. మోదీజీ ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నాలో ఇలాంటి భావన కలగలేదు’’ అన్నాను. ‘‘అదేంటీ..’’ అని పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘మీరు పెట్టిన మధ్యవర్తులు ముగ్గురికీ ఫోన్ లిఫ్ట్ చేసే తీరిక లేదు. ముగ్గురు మధ్యవర్తుల్ని పెట్టిన మీరు మాత్రం ఒక్క రింగ్‌కే లిఫ్ట్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సాధారణ పౌరుడి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం అంటే దేశం సురక్షిత హస్తాల్లో ఉన్నట్లే కదా’’ అన్నాను. ‘‘మీరు సాధారణ పౌరులు ఎలా అవు తారు స్వామిగళ్’’ అని నవ్వారు గొగోయ్. ‘‘అదే అంటున్నా గొగోయ్‌జీ, ఒక అసాధా రణ పౌరుడి ఫోన్‌కి కూడా సాధారణ పౌరుడికి ఇచ్చేంత విలువే ఇచ్చి, ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు. గ్రేట్ థింగ్’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘నా అదృష్టం ఏమిటంటే గొగోయ్‌జీ.. మీరు ఫోన్ ఎత్తడం వల్ల ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈ దేశమే కాదు, అయోధ్య కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. అయోధ్య మాత్రమే కాదు, శ్రీరాముడు కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడు’’ అన్నాను. ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘గొగోయ్‌జీ వింటున్నారా?’’ అన్నాను. ‘‘వింటున్నాను స్వామిగళ్. అయితే మీరనుకుంటున్నట్లు శ్రీరాముడిని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం ఆ ముగ్గుర్నీ మీడియేటర్లుగా పెట్టలేదు. దేశాన్ని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం పెట్టాం. దేశాన్ని పక్కనపెట్టి, ఒక్క శ్రీరాముడినే సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టాలనుకుంటే, నాలుగో మీడియేటర్‌గా మిమ్మల్ని పెట్టి ఉండేవాళ్లం కదా’’ అన్నారు! నాకు సంతోషం వేసింది. ‘‘ధన్యవాదాలు గొగోయ్‌జీ. ఆ ముగ్గురికీ అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశాను. మీకు చేసింది కూడా అందుకే.. అభినందలు తెలియజేయడం కోసం. అభినందనలతో పాటు, ధన్యవాదాలు తెలుపుకునే భాగ్యం కూడా నాకు కలిగించారు’’ అన్నాను. గొగోయ్‌తో మాట్లాడుతుంటే రవిశంకర్, శ్రీరామ్ పంచు, ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లా ఫోన్లో నాకోసం ట్రయ్ చేస్తున్నారు. గొగోయ్ ఫోన్ పెట్టేసి, ఆ ముగ్గుర్నీ కాన్ఫరెన్స్ కాల్లోకి రమ్మన్నాను. వచ్చారు. ‘‘డెబ్భై ఏళ్ల కేసు మీద ముగ్గురు మధ్యవర్తులు ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇవ్వడం అయ్యే పనేనా?’’ అన్నాను. ‘‘అదే ఆలోచిస్తున్నాం స్వామీజీ’’ అన్నారు. ‘‘అవసరమైతే బయటినుంచి హ్యాండ్స్ తీసుకోవచ్చని కోర్టు మీకు చెప్పింది కదా. ఆ విషయం కూడా ఆలోచించండి’’ అన్నాను. ‘‘ఆలోచిస్తాం స్వామీజీ’’ అన్నారు. అన్నారు కానీ, హార్ట్లీగా అనలేదు! బయటి నుంచి లోపలికి తీసుకోవడం కాదు, లోపల్నుంచి బయటికి వెళ్లే ఆలోచనేదో చేస్తున్నట్లనిపించింది.. వాళ్లు.. ఊ, ఆ.. అనడం వింటుంటే. -మాధవ్ శింగరాజు -
టీటీడీ ఆలయాల ఆడిట్ వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆస్తులు, ఆదాయ, వ్యయాలు, కానుకలు, విరాళాలు, ఖర్చులపై నిర్వహించే ఆడిట్ వివరాలు అందజేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు టీటీడీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఆడిటర్ నియామకానికి సంబంధించి స్పష్టత లేదని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. తిరుమల దేవస్థానం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతోపాటు ఆదాయాలున్న మరో 11 ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ లేకుండా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థిస్తూ బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు డాక్టర్ సుబ్రమణ్యస్వామి, డిల్లీకి చెందిన లా విద్యార్థి సత్యపాల్ సభర్వాల్ వ్యక్తిగత హోదాలో (పార్టీ ఇన్ పర్సన్) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఆదాయం ఉన్న ఆలయాలపై ప్రభుత్వానికి అజమాయిషీ కల్పిస్తూ దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టంలోని సెక్షన్లు 15, 29, 96, 97–ఎ/బి, 106, 108, 109, 110, 115లను వారు పిల్లో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు 2014లో వెలువరించిన తీర్పులోని మార్గదర్శకాల ప్రకారం ఆలయాల నిర్వహణలో ప్రభుత్వ పాత్ర నామమాత్రమని సుబ్రమణ్యస్వామి వాదించారు. ధార్మిక సంస్థల పర్యవేక్షణలో ఆలయాలను నిర్వహించాలని చెప్పారు. ఆలయాలపై ప్రభుత్వ నియంత్రణ చెల్లదని, కేవలం దేవుడి ఆస్తుల రక్షణకు ప్రభుత్వం ధర్మకర్త పాత్ర పోషించాలన్నారు. టీటీడీ ఆలయాలపై ప్రభుత్వపాలన 85 ఏళ్లకుపైగా కొనసాగుతోందని, ఇది సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమన్నారు. నిధుల వినియోగంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఆడిట్ పారదర్శకంగా లేదని, కాగ్ కూడా తప్పుపట్టినా పట్టించుకోవడంలేదని సుబ్రమణ్యస్వామి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ వాదిస్తూ ఏపీ ప్రభుత్వ చట్టానికి అనుగుణంగా టీటీడీ నిర్వహణ జరుగుతోందని చెప్పారు. టీటీడీ నిర్వహించే ధార్మిక కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టానికి లోబడి టీటీడీ ఆడిట్ జరుగుతోందని ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా టీటీడీ తరఫు న్యాయవాది లలిత బదులిచ్చారు. వాదనల అనంతరం విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. -
తిరుమలాధీశుడు విష్ణువే!
రామానుజ మార్గంలో మరో చరిత్రాత్మక ఘట్టం.. తిరుమలాధీశుడు శివుడు కాడని, మహావిష్ణువని నిర్ధారించిన ప్రక్రియ. పండిత వాదనా పటిమ. తిరుమల తిరుపతి తమిళ పేర్లు. తిరుపతి అంటే శ్రీపతి, తిరుమల అంటే శ్రీకొండ లేదా శ్రీశైలం. శ్రీ వేంకటాచలానికి తమిళ పేరు తిరువేంగడం. అక్కడ వైఖానసులు ఆలయ నిర్వహణ విధుల్లో విఫలమైనారని ఆనాటి నారాయణవనం రాజు యాదవుడు వారికి శిక్ష విధించగా వారు ఆలయం వదలి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో కొందరు శైవులు ఆ మూలమూర్తి శివుడనీ, విష్ణువు కాదని, శైవ ఆగమ విధానాల ప్రకారం పూజలు జరగకపోతే రాజ్యానికి అరిష్టమని రాజు చెవిని ఇల్లుకట్టుకుని పోరు పెట్టారు. యాదవరాజు ఈ అంశాన్ని పరిశీలించాలని అనుకున్నారు. అందుకొక విస్తారమైన చర్చావేదికను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే తిరుమలేశుడు శివుడో కేశవుడో ప్రమాణాలతో నిరూపించాలని చాటింపు వేయించాడు. తమ మాటను నమ్మి శైవక్షేత్రంగా మార్చుతాడేమో అనుకుంటే రాజు చర్చాగోష్టి పెడతాడని శైవపండితులు ఊహించలేదు. శైవ క్షేత్రమని రుజువు చేయడానికి పురాణాల్లో ప్రమాణాలు వెతకనారంభించారు. రామానుజులకు ఈ విషయం తెలిసి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. తమ వాదాన్ని కూడా వినాలని యాదవరాజును కోరారు. ఆయన సరేనన్నారు. మరునాడు శైవులు వాదన ప్రారంభించారు. ఇక్కడ పుష్కరిణి పేరు స్వామి పుష్కరిణి, కనుక దానికి దక్షిణాన నెలకొన్న స్వామి సుబ్రహ్మణ్యస్వామి అని వాదించారు. స్వామి అనే పేరు కుమారస్వామికి గాక మరెవరికీ లేదన్నారు. వామన పురాణంలో వేంకటాచలం విశేషాలను వివరించారని ప్రమాణం చూపారు. స్కందుడు తారకాసురుడిని చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి తపస్సు చేయడానికి ఏది అనువైన ప్రదేశమని అడిగితే విష్ణు క్షేత్రాలలోకెల్లా పవిత్రమైన తిరుమలకు వెళ్లమని సూచించాడు. స్కందుడు అక్కడికి వెళ్లే సమయానికే వాయుదేవుడు తపస్సు చేస్తున్నాడు. తపోభంగిమ కనుక స్కందుని చేతులలో యుద్ధకాలపు వీరుడికి ఉండే ఆయుధాలేవీలేవు. ఆయన కురులు జడలుకట్టి ఉన్నాయి. విష్ణువే అయితే ఆయన చేతిలో శంఖ చక్రాలు మొదలైన విష్ణు లక్షణాలైన ఆయుధాలు ఉండాలి అవేవీ లేవు. రెండు భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. విష్ణువుకు నాగాభరణాలు ఎప్పుడూ లేవు. బిల్వదళాలతో పూజలు అందుకుంటున్నాడు. విష్ణువుకు తులసీ దళాలే కాని బిల్వదళాలు శివుడికీ శివపరివారానికనీ, కనుక తిరుమలలో విష్ణువు కాదని, స్కందుడని వాదించారు. విష్ణువు కోసమే స్కందుడు తపస్సు రామానుజుడి వాదన: శైవ పండితులు ప్రస్తావించిన వామన పురాణాన్నే రామానుజుడు ఉటంకిస్తూ అందులోని 14వ అధ్యాయం ప్రకారం వేంకటాచలం విష్ణుక్షేత్రాల్లోకెల్లా పవిత్ర క్షేత్రమని ఉంది. స్వామి పుష్కరిణికి దక్షిణాన ఉన్నది వరాహ రూపంలో ఉన్న విష్ణుదేవాలయమే. వరాహపురాణంలోనే వేంకటాచలం వరాహ వాసుదేవ దివ్యధామమని కూడా ఉంది. వేంకటాచల మహత్మ్యంలో ధరణి వరాహస్వామి మధ్య సంభాషణ రూపంలో ఈ ప్రస్తావన ఉంది. పద్మపురాణంలో 24.1వ అధ్యాయంలో కూడా ఈ విషయమే వివరించారు. గరుడపురాణంలో 63వ అధ్యాయంలో అరుంధతీ వశిష్టుల సంభాషణలో, బ్రహ్మాండపురాణంలోని భృగు నారదుల మధ్య సంభాషణలో విష్ణు క్షేత్రమని స్పష్టంగా ఉంది. ఇన్ని పురాణాలు ధ్రువీకరించిన సత్యం ఇది. శ్రీనివాసునికి, వరాహమూర్తికి మధ్య జరిగిన సంభాషణ భవిష్యోత్తరపురాణంలో ఉంది. ఈ కల్పాంతం వరకు హరి శ్రీనివాసుని రూపంలో ఈ వేంకటాచలంపైన ఉంటారని, కుమారస్వామి చేత పూజలను అందుకుంటారని, శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు పద్మావతిని వివాహం చేసుకున్నారని, ఆ వివాహమహోత్సవానికి వరాహ స్వామిని, భూదేవిని ఆహ్వానించారని కూడా ఉంది. స్కందుడికి ముందుగా ఒక ముఖమే ఉందని తరువాత కృత్తికల పోషణలో ఆయన షణ్ముఖుడై పన్నెండు భుజాలను సంపాదించాడని ఉంది. ఇక్కడ ఒకే ముఖం నాలుగు భుజాలు ఉన్న మూర్తి స్కందుడని ఎలా చెప్పగలరని రామానుజుడు ప్రశ్నించాడు. తపస్సు కోసం వెళ్లినాడు కనుక స్కందుడు ఆయుధాలు వదిలేశారని శైవ పండితులవాదం కాని వనవాసానికి వెళ్లిన రామలక్ష్మణులు గానీ, పాండవులు గానీ ఆయుధాలు వదిలినట్టు ఎక్కడా లేదు కదా. అదీగాక వామన పురాణం 22, 23వ అధ్యాయాలలో స్కందుడు తపస్సు చేయడానికి వెళ్తూ వెంట తన అన్ని ఆయుధాలు తీసుకువెళ్లినట్టు స్పష్టంగా ఉంది. బిల్వదళాలతో పూజించడం వల్ల స్కందుడనే వాదం కూడా చెల్లదు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించే స్తుతి కూడా ఉంది, తులసి వలె బిల్వం కూడా విష్ణు ఆలయాలలో పూజలకు వినియోగిస్తారని రామానుజులు వివరించారు. వరాహ పురాణం మొదటి భాగం, అధ్యాయం 45, విభాగం 13లో వేంకటాచలానికి దశరథుడు వచ్చి శ్రీనివాసుని దర్శించారని, ఆ సమయానికి రుషులెందరో విష్ణువు గురించి తపస్సు చేస్తూ బిల్వదళాలతో అర్చించినట్టు పేర్కొన్నారు. ఇక జడలు కట్టిన కేశాలు శివుడికి మాత్రమే పరిమితమైన లక్షణం కాదు. విష్ణువుకు అనేక అవతారాల్లో జడలు కట్టిన విస్తారమైన శిరోజాలు ఉన్నాయని చెప్పారు. వేంకటాచలానికి వచ్చేనాటికి విష్ణువుకు కురులు జడలు కట్టాయని ఆ పురాణంలో ఉంది. పద్మపురాణం అధ్యాయం 26 మూడో భాగంలో నాగాభరణాలు చిత్రించిన వస్త్రాలను ధరించినట్టు ఉంది. అందులోనే అధ్యాయం 27 నాలుగో భాగంలో జడలు కట్టినకేశాలతో ఆయన ఉన్నట్టు, తరువాత 33వ అధ్యాయం 10వ భాగంలో అవన్నీ త్యజించి సౌమ్యరూపానికి మారినట్టు కూడా ఉంది. భవిష్యోత్తరపురాణంలో శ్రీనివాసుని వివాహ సందర్భంలో ఆకాశరాజు అల్లుడికి నాగాభరణాలను బహూకరించినట్టు ఉంది. బ్రహ్మాండపురాణం రెండో అధ్యాయంలో ఆదిశేషుడు సందర్భాన్ని బట్టి పడకగా, ఛత్రంగా, ఆసనంగా, ఆభరణంగా మారతాడని ఉంది. భవిష్యోత్తర పురాణంలో అనేక శ్లోకాలు శ్రీనివాసుడు నాగాభరణాలు ధరించిన సందర్భాలను వివరించాయి. స్వామి వక్షస్థలం మీద శ్రీవత్సం ఉంది. హృదయంపై లక్ష్మీదేవి ఉంది. కనుక నారాయణుడు కాక మరెవరూ కాదని రామానుజులు వివరించారు. ప్రస్తుత శ్రీనివాసుని భంగిమలోనే నారాయణుడి రూపం ఉండేదని వామనపురాణంలోని 24వ అధ్యాయం పేర్కొన్నది. ఈ వేంకటాచలం ఒకనాడు వైకుంఠంలోని క్రీడాపర్వతం. గరుడుడే దీన్ని మోసుకుని వచ్చాడు. కనుక ఇది గరుడాచలమనీ వైకుంఠ గిరీ అని అన్నారు. శృతి స్మృతులలో కూడా విష్ణుక్షేత్రమనే నిర్ధారించారు. రుగ్వేదం ఎనిమిదో అష్టకం ఎనిమిదో అధ్యాయం 13వ విభాగంలో కూడా ఈ విషయమే స్పష్టంగా ఉంది. ఇన్ని ప్రమాణాలతో రామానుజుడు నారాయణతత్వాన్ని నిర్ధారించిన తరువాత యాదవరాజుకు ఇంకేం మిగలలేదు. ‘‘యాదవరాజా మరొక అంశం. ఇది శైవక్షేత్రమని వాదించడానికి శైవపండితులు పుష్కరిణి పేరును ప్రస్తావించారు. అది స్వామిపుష్కరిణి కనుక అది కుమారస్వామిదే అన్నారు. పుష్కరిణికి స్వామి అని పేరు రావడానికి దాని పక్కన కుమార స్వామి తపస్సు చేసినందుకే అయి ఉండవచ్చు. స్వామి అంటే యజమాని, పెద్దవాడు అని కూడా అర్థం, పుష్కరిణులలో కెల్లా గొప్పది అయినందున స్వామి పుష్కరిణి అని కూడా అని ఉండవచ్చు. స్వామి అన్న పదానికి సంస్కృతంలో ఉన్న అర్థాలు సరిపోయేది శ్రీమన్నారాయణుడికే. ఎందుకంటే ఈ సకల విశ్వాన్ని సృష్టించి, పోషించే స్వామిత్వం ఆయనకే ఉంది కనుక. పుష్కరిణి తీరాన బ్రహ్మరుద్ర ఇంద్రాది దేవతలు తపస్సు చేశారని వామనపురాణంలో ఉందని చెప్పారు. కుమారస్వామి కూడా అక్కడే తారకాసుర సంహారం వల్ల కలిగిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి తండ్రి శివుడి సూచన మేరకు తపస్సు చేసారనీ శైవ పండితులే చెప్పారు. తిరుమల క్షేత్రంలో ఉన్నది స్కందుడైతే కుమారస్వామి తన గురించి తనే తపస్సు చేశాడనా? కుమారస్వామి విష్ణువు గురించి తపస్సు చేశారనడం అన్ని విధాలా సమంజసం కదా’’ అని రామానుజుడు వివరించారు. ఇంక వాదించడానికి ఏమీ లేదని యాదవరాజుకు అర్థమైపోయింది. ‘‘రామానుజముని లేవనెత్తిన ఈ అంశాలకు మీ దగ్గర ఏదయినా ప్రతివాదన ఉందా’’ అని యాదవరాజు అడిగారు. దానికి శైవులు.. ‘‘రామానుజాచార్యులవారు తిరుమలలో నెలకొన్నది స్కందుడు కాదని శివుడు కాదని చెప్పారు. కాని విష్ణువనడానికి రుజువులేమిటి? ఈ భంగిమలో ఎక్కడైనా విష్ణువు నిలబడినట్టు ఉందా? చేతిలో ఆయుధాలు లేవు. భుజాలమీద నాగాభరణాలు ఉన్నాయి. చతుర్భుజుడే. పైనున్న రెండు హస్తాలు ఖాళీగా ఉన్నాయి. ఒక హస్తం పాదాలను చూపిస్తూ ఉంటే మరొక హస్తం నడుము మీద వేసి ఉంది. ఇది విష్ణు లక్షణమని ఏ విధంగా చెప్పగలరు? స్కందుడు, శివుడు కాకపోతే హరిహరుడవుతాడేమో గాని విష్ణువు కాడు. ఎందుకంటే ఇద్దరి లక్షణాలు పాక్షికంగా ఉన్నాయి కనుక..’’ అని కొత్త వాదాన్ని ఆవిష్కరించారు. ‘హరిహరుడో కాదో తేల్చవలసింది రామానుజులవారే’ అని యాదవరాజు అన్నారు.‘ప్రపంచంలోని ప్రతి అంశంలోనూ విష్ణు అంశం కొంత ఉంటుందని భగవద్గీత పదో అధ్యాయంలో ఉందని, కనుక స్కందునిలో మహదేవునిలో కూడా విష్ణు అంశ ఉంటుంది. స్కందుడు రోజూ మూడు సార్లు పుష్కరిణిలో స్నానం చేసి, వాయు సమక్షంలో నారాయణుని గూర్చి తపస్సు చేసేవాడని స్పష్టంగా వామనపురాణం 21వ అధ్యాయం రెండో భాగంలో ఉంది. శ్రీనివాసుని ఆరాధించడానికి కుమార ధారిక నుంచి స్కందుడు (సుబ్రహ్మణ్యస్వామి) వచ్చేవాడని నిర్ధారించిన పురాణాల్లోనే తొండమాన్ చక్రవర్తి తిరుమలలో విష్ణుమూర్తికి ఆలయం నిర్మించాడని కూడా ప్రస్తావించారు. బ్రహ్మ, ఇంద్రాది దేవతలు రుషులు పుష్కరిణి దక్షిణాన యజ్ఞాలు, తపస్సులు చేశారని, వారిని కరుణించి విష్ణువు ప్రత్యక్షమైనాడని శృతులలో ఉంది. స్కందుడు రాకముందే శివుడు తిరుమలకు దిగువన కొలువైనాడని, నారాయణుని గూర్చి కొండపైన తపస్సు చేయాలని స్కందుడికి శివుడే చెప్పినట్టు శైవ పండితులే పురాణాలను ఉటంకించారని, వరాహ పురాణం 29వ అధ్యాయంలో శ్రీనివాస అష్టోత్తర శతనామ స్తోత్రంలో ‘తిరుమల కొండ దిగువన శివుడు తలపులలో తపస్సులో ఉన్న నారాయణా’ అని కూడా ఉందని, కనుక తిరుమలేశుడు శ్రీనివాసుడైన నారాయణుడు కాక హరుడు కాని హరిహరుడు కాని మరోదైవం కానీ అయ్యే అవకాశమే లేదన్నారు. ‘శైవపండితులు ఇంకేమయినా వాదించదలచుకున్నారా’ అని యాదవరాజు అడిగారు.సాధికారికంగా ఇన్ని పురాణాలను ఉటంకిస్తూ రామానుజముని వాదించిన తరువాత, తర్కబద్ధంగా లక్షణాలను వివరించిన పిదప ఇంక మేమేం చెప్పగలం. అయితే రామానుజుని వాదాన్ని మేము అంగీకరించినా ఆ తిరుమలదైవం అంగీకరించాడని చెప్పగలిగితే మేం పూర్తిగా సంతుష్టులమవుతాం అని మరో ముడి వేశారు. వాదోపవాదాలలో పూర్తిగా పరాజయం పొందిన తరువాత ఇంకా తగాదా కొనసాగించాలని చూడటం సమంజసం కాదని యాదవరాజు కొంత కోపాన్ని ప్రదర్శించారు. రామానుజుడు మాత్రం ఈ శైవుల వాదాన్ని మరింత ఖండితంగా తొలగించి శాశ్వతంగా ఈ వివాదాన్ని నివారించాలని అనుకున్నారు. ‘సరే మనం శ్రీవారి ఆలయంలో శివ విష్ణుమూర్తులకు సంబంధించిన ఆయుధాలను ఉంచి తలుపులు వేద్దాం. మరునాడు స్వామి ఏ ఆయుధాలను స్వీకరిస్తారో చూద్దాం’ అన్నారు. యాదవరాజు శైవ వైష్ణవ పండితుల సమక్షంలో విష్ణ్వాయుధాలయిన శంఖ చక్రాలను, శంకరుడి హస్తభూషణాలైన త్రిశూల డమరుకాలను ఆనందనిలయంలో ఉంచారు. మరునాడు వారందరూ రాజుతో కలిసి వచ్చి ద్వారాలు తెరవగానే శ్రీనివాసుడు శంఖ చక్రాలు ధరించి దర్శనమిచ్చారు. రాజు ప్రణమిల్లినాడు. రామానుజుని శిష్యుడైనాడు. యాదవరాజు తీర్పును శాసనంగా ప్రచురించమని కోరారు. గర్భాలయ విమానమైన ఆనందనిలయాన్ని పునరుద్ధరించి, వైఖానస ఆగమ విధానాల ప్రకారం వైష్ణవారాధనా విధాన క్రమాలను స్థిరీకరించారు. (రామానుజుని శిష్యుడు ఈ వాదోపవాదాల సమయంలో ప్రత్యక్ష సాక్షి అయిన అనంతాళ్వాన్ రచించిన శ్రీవేంకటాచల ఇతిహాసమాల ఆధారంగా) - రామానుజ మార్గం -
తీర్పు తారుమారవుతుందన్న సుబ్రహ్మణ్య స్వామి
సాక్షి,న్యూఢిల్లీ: 2జీ కేసు తీర్పుపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎగువ కోర్టుకు వెళితే తీర్పు తారుమారవుతుందంటూ తమిళనాడు మాజీ సీఎం జయలలిత అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు.ఏ రాజా, కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. రూ 30,000 కోట్ల 2జీ స్కామ్ కేసులో 19 మంది నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్ట్ నిర్ధోషులుగా పేర్కొంటూ తీర్పు వెలువరించిన అనంతరం తీర్పుపై తన అభిప్రాయాలను ట్విట్టర్లో పంచుకున్నారు.అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ సీఎం జయలలితను కర్నాటక హైకోర్టు నిర్ధోషిగా ప్రకటించిన అనంతరం సుప్రీం కోర్టులో భిన్నమైన తీర్పు వచ్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా స్వామి ప్రస్తావించారు. తీర్పు నేపథ్యంలో సంబరాలు చేసుకోవద్దని డీఎంకే నేతలకు ఆయన చురకలంటించారు.కాంగ్రెస్, మిత్రపక్షాలకు జయ అక్రమాస్తుల కేసులో ఎదురైన భంగపాటు 2జీ కేసుకూ తప్పదని మరో ట్వీట్లో వ్యాఖ్యానించారు. -
కమనీయం సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం
చిట్టమూరు:మల్లాంలోని శ్రీ వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవం మంగళవారం కమనీయంగా సాగింది. సోమవారం రాత్రి దేవేంద్రుడు, ఈశ్వరుడి మధ్య కల్యాణ రాయబారం జరగడం, సుబ్రహ్మణ్యేశ్వరుడికి దేవసేను ఇచ్చి వివాహం జరిపించేందుకు దేవేంద్రుడు ఒప్పుకున్న ఘట్టాల తర్వాత ఉదయం కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నూరు కాళ్ల కల్యాణ మండపంలో దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి సర్వాంగసుందరంగా అలంకరించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా సాగింది. మయూర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ ప్రధాన అర్చకులు మూలం భానుప్రకాష్‌శర్మ, యాజ్ఞికులు ఆంజనేయశర్మ పర్యవేక్షణలో కల్యాణోత్సవ పూజలు జరిగాయి. మొదట శతస్తంభ కల్యాణ మండపాన్ని విశేష పుష్పాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. పెద్దసంఖ్యలో భక్తులు తలరివచ్చి దేవుడి పెళ్లిని తిలకించారు. జిల్లా నలుమూలల నుంచే కాక తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మల్లాం జనసంద్రంగా మారిం ది. కల్యాణ వేదిక పుష్పాలంకరణకు కత్తి మోహన్‌రావు, మాంగళ్య సామగ్రి సమర్పణకు చుట్టి రవి ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ చైర్మన్ పాపారెడ్డి వెంకటసుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతి, ఈఓ రమణారెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు అన్నదానం కల్యాణోత్సవానికి హాజరైన వేలాది మంది భక్తులకు మల్లాం మాజీ సర్పంచ్ దువ్వూరు శేషురెడ్డి, రామరాఘవరెడ్డి, రామలింగారెడ్డి ఆధ్వర్యం లో అన్నదానం జరిగింది. -
తెలుగు స్వతంత్ర భాష
బెజవాడలో మారిన బండి తెల్లవారుతోందనగా కొండపల్లి దాటింది, అది మొదలు ‘‘పరాయిదేశం వెడుతున్నా’’ మన్నట్టుంది నాకు. ఇప్పటికన్నీ, తూర్పుగోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన వాడికి, మొదటిమాటు, తునిదాటితే మరో ప్రపంచమూ, ఒంగోలు దాటితే మరో ప్రపంచమూ, నరసరావుపేట దాటితే మరో ప్రపంచమూ, కొండపల్లి దాటితే మరో ప్రపంచమున్నూ. అసలు, ఏలూరు దాటితేనే భేదం కనపడుతుంది, అది అవగాహన కానిది కాదు. అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ, అక్కడిదీ కూడా కండగల తెనుగే; కాని, కాదేమో అనిపిస్తుందెక్కడికక్కడే. అందుకు బెదరక, మళ్లీ మళ్లీ వెళ్లాడా, తెనుగుభాష తన విశ్వరూపం కనపరుస్తుంది, ఆంధ్రత్వమున్నూ సమగ్రం అవుతుంది, వెళ్లిన వాడికి. ఒక్కొక్క సీమలోనొక్కొక్క జీవకణం వుంది తెనుగు రక్తంలో, అన్నీ వొకచోటికి చేర్చగల-అన్నీ వొక్క తెనుగువాడి రక్తంలో నిక్షేపించగల మొనగాడు పుట్టుకు రావాలి, అంతే. మొదటిమాటు విశాఖపట్నం వెళ్లాన్నేను. అప్పటి నాకున్నది వొక్కటే ప్రాణం. వారం రోజులున్నా నా మొదటి మాటక్కడ. రెండో ప్రాణం సంక్రమించినట్టనిపించింది, దాంతో నాకు. తరవాత నెల్లూరు వెళ్లాను, మూడో ప్రాణం సంక్రమించినట్టనిపించిందక్కడ. అదయిన తరవాత కడపా, అనంతపురమూ, నంద్యాలా వెళ్లాను. నాలుగో ప్రాణం సంక్రమించినట్టనిపించింది. చివరికి హనుమకొండ వెళ్లాను, అయిదో ప్రాణం కూడా నాకు సంక్రమించినట్టు-నా ఆంధ్ర రక్తం పరిపూర్ణం అయి నట్టనుభూతం అయింది నాకు. ఇవాళ చూసుకుంటే, అయిదు ప్రాణాల నిండు జీవితమే నాది, అందుకు తగ్గ దార్డ్యం మాత్రం కూడలేదనే చెప్పాలింకా. అందుకోసం నేను చేసుకున్న దోహదం బహు తక్కువ, మరి. ఆంధ్ర హృదయం-ఆంధ్రభాషపరంగా వ్యక్తం అవుతున్న జీవనసరళి నాకింకా బాగా అవగాహన కాలేదు. నా స్వప్రాంతపు పలుకుబడిలో యెంత జీవశక్తి వుందో, అక్కడక్కడి పలుకుబళ్లలోనూ అంతంత జీవశక్తి వుంది, వారాల్లోనూ మాసాల్లోనూ పట్టు బడేది కాదది. ఒక్కొక్క చోట ప్రచలితం అయే కాకువూ, వొక్కొక్క చోట ప్రయుక్తం అయే యాసా పుస్తకాలు చదివితే అందవు, వొకచోట కూచున్నా దొరకవు- పల్లెలూ పట్నాలూ తిరగాలి, అష్టాదశవర్ణాల వారిలోనూ పరభాషా వ్యామోహం లేనివారిని కలుసుకోవాలి, ఆ పలుకుబళ్లు చెవులారా వినాలి, ఆ ప్రయోగ వైచిత్రి సవిమర్శంగా పట్టుకోవాలి, ఆ నాదం-చిక్కని ఆ మధుర గంభీరనాదం అవగాహన చేసుకోవాలి, అన్నిటికీ ప్రధానంగా ‘‘ఇది నా సొంతభాష-మొదటిమాటు, నా తల్లి, నా జీవశక్తికి జతచేసిన-నాకు వాగ్ధార ఆవిర్భవింపచేసిన సంజీవిని అన్న ఆత్మీయతా, మమతా ఉద్బుద్ధాలు చేసుకోవాలి, ముందు. అప్పుడు గాని యే తెనుగువాడికీ నిండు ప్రాణం వుందని చెప్పడానికి వీల్లేదు. దానికోసం నా పరితాపం యిప్పటికీ. నిజం చెప్పవలసి వస్తే యే వొక్క శాస్త్రంలో సమగ్ర పరిజ్ఞానంలేని షట్‌శాస్త్ర పండితుని స్థితి నాదివాళ. అయినా, నా తెనుగుభాష శాస్త్రీయం-తాటాబూటం కాదు. నా తెనుగుభాష యుగయుగాలుగా ప్రవాహిని అయివుండినదిగాని, యివాళ, ఆ భాషలో నుంచి వొక మాటా, యీ భాషలోనుంచి వొకమాటా యెరువు తెచ్చుకుని భరతవిద్య ప్రదర్శిస్తున్నది కాదు. నా తెనుగుభాష ఎక్కడ పుట్టినా చక్రవర్తుల రాజ్యాంగాలు నడిపిందిగాని, పరాన్నభుక్కు కాదు. నా తెనుగుభాష స్వతంత్రంగా బతగ్గలదిగాని కృత్రిమ సాధనాలతో ప్రాణవాయువు కూర్చుకోవలసిందీకాదు, అక్రమ దోహదాలతో పోషించబడవలసిందీ కాదు. యావద్భారతదేశంలోనూ, యీ విశాల విశ్వంలో కూడా తెనుగువాణ్ణిగా, నేనే నిర్వహించవలసిన కార్యక్రమం కొంత వుంది, నా దృఢవిశ్వాసం యిది. అందుకోసం, అన్ని సీమల పలుకుబళ్లూ బోధపరుచుకుని, అన్ని సీమల జీవశక్తీ కూర్చుకుని స్వస్వరూప జ్ఞానంతో దృఢంగా నిలవగలగాలి నేను. నాకు మాత్రం యీ ఆకాంక్ష కూడా వుంది, పూర్తిగా. (ఏప్రిల్ 23 శ్రీపాద 125వ జయంతి సందర్భంగా-సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ‘అనుభవాలు-జ్ఞాపకాలూను’ నుంచి)