సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియా విక్రయంపై విపక్షాలకు తోడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి పూనుకుంటే తాను న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియపై స్వామి స్పందిస్తూ ఇది జాతి వ్యతిరేక నిర్ణయమని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ నిర్ణయంపై విపక్ష కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. (ఎయిర్ ఇండియా దక్కేది వీరికే..?)
‘ప్రభుత్వం వద్ద డబ్బు లేకుంటేనే ఇలాంటివి చేస్తుంటారు..భారత ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్..వృద్ధి 5 శాతానికి దిగజారింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద రూ కోట్లు బకాయిలు పేరుకుపోయాయి..ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టా’రని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. కాగా నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్‌ఇండియా అమ్మకానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం ప్రిలిమనరీ బిడ్లను ఆహ్వానించింది. మార్చి 17లోగా ఆసక్తి వ్యక్తీకరణను తెలపాలని ఈ ప్రకటనలో ప్రభుత్వం బిడ్డర్లను కోరింది.
చదవండి : 'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు'
Comments
Please login to add a commentAdd a comment