న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రోజు లక్షల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్య సభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ యుద్దాన్ని కట్టడి చేసే బాధ్యత రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కోవిడ్‌కు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో కేవలం పీఎంఓపై మాత్రమే ఆధారపడితే ఉపయోగం ఉండదు. అది కేవలం ఓ విభాగం మాత్రమే.. ప్రధానమంత్రి కాదు. పైగా పీఎంఓలో చాలా కేంద్రీకరణ ఉంది. ఇస్లామిక్ ఆక్రమణదారులు, బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతుల నుంచి భారతదేశం ఎలా విముక్తి పొందిందో అదే మాదిరిగానే కరోనావైరస్ నుంచి బయటపడుతుంది అని ఆయన ట్వీట్ చేశారు.
India will survive Coronavirus Pandemic as it did Islamic invaders and British Imperialists. We could face one more wave that targets children unless strict precautions now are taken. Modi should therefore delegate the conduct of this war to Gadkari. Relying on PMO is useless
— Subramanian Swamy (@Swamy39) May 5, 2021
విదేశాల సాయంతో మెడికల్ ఆక్సిజన్, టీకాలు, రెమ్‌డెసివిర్ సహా కీలకమైన కోవిడ్ నిత్యావసరాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే విషయంలో భారతదేశం కష్టపడుతుంది. ఇలాంటి తరుణంలో నితిన్ గడ్కరీ నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సుబ్రహ్మణ్య స్వామి సూచించారు.
Because dealing with COVID 19 needs an infrastructure framework in which aspect Gadkari has proved his ability
— Subramanian Swamy (@Swamy39) May 5, 2021
చదవండి: కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment