airforce flight
-
‘నెహ్రూ భార్య విహారానికి ఎయిర్‌ఫోర్స్ విమానం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగింపు దశకు చేరుకోవడంతో వ్యక్తిగత విమర్శలు తారాస్థాయి చేరాయి. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఐఎన్ఎస్ విరాట్‌ను గాంధీ కుటుంబం వ్యక్తిగత ట్యాక్సీలా వాడుకుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో తాజాగా బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ స్వామి నెహ్రూపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. నెహ్రూ తన యూరప్ భార్యల్లో ఒకరికి వైమానిక దళ విమానం కావాలని కోరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన యూరప్ భార్య కోసం ఎయిర్‌ఫోర్స్ విమానం సమకూర్చాలని 1950ల్లో రక్షణ కార్యదర్శిగా ఉన్న తన మామ జేడీ కపాడియాను నెహ్రూ కోరగా అందుకు ఆయన నిరాకరించారని గుర్తుచేశారు. దీంతో ఆయనను బదిలీ చేసి తదుపరి కార్యదర్శితో తన పని చక్కబెట్టుకున్నారని నెహ్రూను ఉద్దేశిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. The Namo citing Virat misuse recalls for me the case of my father in law J.D. Kapadia ICS who as Defence Secy in the 1950s refused to give Airforce plane to ferry one of Nehru’s European mistresses. Of course he was transferred and next Secy okayed. Thus the decline be began — Subramanian Swamy (@Swamy39) May 9, 2019 -
రోడ్లపై యుద్ధ విమానాలు.. గ్రాండ్ సక్సెస్
సాక్షి, న్యూఢిల్లీ : లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వేపై మంగళవారం ఉదయం అరుదైన దృశ్యాలు దర్శనమిచ్చాయి. జాతీయ రహదారిపై యుద్ధ విమానాలు సందడి చేశాయి. బోయింగ్, ఎయిర్ బస్, జెట్ ఫైటర్, కార్గో ఇలా వివిధ రకాల విమానాలు నడిరోడ్డుపై ల్యాండ్ అవ్వడంతో స్థానికులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. యుద్ధ పరిస్థితుల్లో అత్యవసర సేవల సమయంలో విమానాలు రోడ్డుపై కిందికి దిగేందుకు వీలుగా జాతీయరహదారులను తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో సైన్యం తొలిసారిగా నడిరోడ్డుపై యుద్ధ విమానాలను ల్యాండ్ చేయించింది. ఈ సందర్భంగా అక్కడ నెలకొన్ని సందడిని వీక్షించేందుకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చి రోడ్డుకిరువైపులా నిల్చున్నారు. విమానాలు ల్యాండ్ అయిన సమయంలో అవాంఛనీయ ఘటనలు జరిగినా.. ప్రమాదాలు ఏం వాటిల్లకుండా పూర్తి భద్రతా చర్యలతోనే వీటిని నిర్వహించారు. భారీ భద్రతా విమానం సీ-30తోపాటు ఏన్-32, మిరాగే 2000, సుఖోయి ఎంకేఐ ఇలా మొత్తం 20 యుద్ధ విమానాలు ఈ ప్రయోగంలో పాల్గొన్నాయి. ఈ పరీక్షలు విజయవంతం అయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎయిర్ మార్షల్ వైస్ చీఫ్ ఎస్బీ డియో ప్రకటించారు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే స్పూర్తితో దేశంలోని వివిధ జాతీయ రహదారులను విమాన రన్ వేలుగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. -
హైవేలపై యుద్ధ విమానాల ల్యాండింగ్
-
ఈ విమానం.. బహు ప్రత్యేకం!!
ఈ విమానం చూశారా? సర్వసాధారణ శిక్షణ విమానంలాగే కనపడుతోందా.. కానీ దీనికో ప్రత్యేకత ఉంది. ఏమిటనుకుంటున్నారా.. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వాడిన విమానమిది. డెహవిల్లాండ్ 104 దెవన్ రకానికి చెందిన ఈ విమానం ప్రస్తుతం వాడకంలో లేదు. బెంగళూరు సమీపంలోని యలహంకలో ఉన్న వీఎస్ఎం ఏరోస్పేస్ ఏఎంఈ శిక్షణ కేంద్రంలో సేద తీరుతోంది. అప్పట్లో భారత వైమానిక దళానికి చెందిన ఈ ప్రత్యేక విమానాన్ని మాజీ ఉప ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రక్షణ శాఖ మాజీమంత్రి వీకే కృష్ణమీనన్ దీన్ని ఉపయోగించారు.