బ్యాక్‌లాగ్స్ బెడద తప్పాలంటే.. | Jawaharlal Nehru Technological University | Sakshi
Sakshi News home page

బ్యాక్‌లాగ్స్ బెడద తప్పాలంటే..

Published Tue, Sep 13 2016 2:23 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

బ్యాక్‌లాగ్స్ బెడద తప్పాలంటే..

బ్యాక్‌లాగ్స్ బెడద తప్పాలంటే..

ఇంజనీరింగ్‌లో ఫెయిలయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం-

 ఇంజనీరింగ్‌లో ఫెయిలయ్యే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజాగా జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం- హైదరాబాద్ పరిధిలో వెలువడిన ఇంజనీరింగ్ ఫస్టియర్ ఫలితాల్లో కేవలం 27.86 శాతం విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తొలి అడుగులోనే ఇలాంటి తడబాటు కనిపిస్తుంటే.. ఇక మిగిలిన విద్యా సంవత్సరాల గురించి చెప్పనక్కర్లేదు. విద్యార్థులకు ఈ బ్యాక్‌లాగ్స్ గుదిబండలా తయారవుతున్నాయని, వీలైనంత త్వరగా సబ్జెక్టులను క్లియర్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
 
 పదో తరగతి, ఇంటర్‌లో టాప్ మార్కులు పొందినవారు సైతం ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతున్నారు. ఇంజనీరింగ్‌లో బట్టీ విధానం కంటే అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. స్పూన్ ఫీడింగ్‌కు అవకాశం లేదు కాబట్టి.. సెల్ఫ్ లెర్నింగ్‌ను అలవర్చుకోవడం తప్పనిసరి. కైైఇట, ూ్కఖీఉఔ తదితర మార్గాల ద్వారా సబ్జెక్టులపై సొంతంగా అవగాహన పెంచుకోవాలి.
 
 సందేహాలను నివృత్తి చేసుకోవాలి
 సబ్జెక్టుకు సంబంధించిన సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవాలి. నిజానికి మీకున్న అనుమానాలే క్లాసులో చాలామందికి ఉంటాయి. మీరు చొరవ చూపడం వల్ల భవిష్యత్తు కెరీర్‌కు అవసరమైన నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయి. క్లాసులో కుదరదనుకుంటే లెక్చరర్‌ను స్టాఫ్‌రూంలో కలిసి, సందేహాలు తీర్చుకోవాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు ఆ సమస్య పరిష్కారానికి ఎంత శ్రమపడ్డారో తెలియజేసే రఫ్‌వర్క్, నోట్స్ వంటి ఆధారాలను చూపాలి. అప్పుడే మీ ప్రశ్నకు విలువ పెరుగుతుంది.
 
 అంకితభావం, నిబద్ధత
 పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ పుస్తకాలు చదవడం వల్ల సందేహాలను తీర్చే వివరణలు, ఆయా సిద్ధాంతాలపై ఎక్కువ ఉదాహరణలు లభిస్తాయి. ఇవి కాన్సెప్ట్‌లను బాగా తెలుసుకోవడానికి, పరీక్షల్లో వివరణాత్మకంగా సమాధానాలు రాయడానికి ఉపయోగపడతాయి. ఒక సమస్యను సొంతంగా సాధించేందుకు మరీ ఎక్కువసార్లు ప్రయత్నించకూడదు. అలాంటి సమయంలో స్నేహితుల సహాయం తీసుకోవాలి. గ్రూప్ స్టడీ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. సందేహాల నివృత్తికి, సబ్జెక్టుపై పట్టు సాధించేందుకు దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి.
 
 ఏ రోజు పాఠాలు ఆ రోజే
 ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుకుంటూ ఏరోజు పాఠాలను ఆ రోజే పూర్తిచేసుకోవాలి. క్లాస్‌కు వెళ్లేముందు ఆ రోజు బోధించే అంశానికి సంబంధించి కొంత సమాచారం తెలుసుకొని వెళ్లాలి. లెక్చరర్ నోట్స్‌తోపాటు రిఫరెన్‌‌స పుస్తకాల సహాయంతో నోట్స్ సిద్ధం చేసుకోవాలి. రోజూ ఆ నోట్స్‌ను చదువుకుంటూ.. పరీక్షల సమయంలో ప్రీవియస్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే బ్యాక్‌లాగ్స్ సమస్య ఎదురుకాకుండా చూసుకోవచ్చు.
 
  నాలుగు పద్ధతులు..
 విద్యార్థులు ఏ విషయాన్నైనా నాలుగు పద్ధతుల్లో నేర్చుకుంటారని పరిశోధనల్లో తేలింది. వాటిలో మీకు ఏ పద్ధతి అనుసరణీయమో గుర్తించాలి. అవి..
 
  నేను ఆచరణాత్మక, నిజ జీవిత సంఘటనలను చూసి ప్రభావితమవుతాను.
  నేను ఉదాహరణలతో వివరించినప్పుడు బాగా అర్థం చేసుకుంటాను.
  నేను ఫార్ములాలు, సిద్ధాంతాలు కాకుండా ఒక యంత్రం పనిచేసే విధానం తెలుసుకోవడం వల్ల నేర్చుకుంటాను.
 
  నాకు బొమ్మలు, ఫ్లో ఛార్టులు, ఇతర వివరణాత్మక అంశాలపై ఆసక్తి ఉంది. వాటి సహాయంతో పుస్తకాలను చదివిన దానికంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాను.
 
 ఇంజనీరింగ్‌లో చేరినప్పటి నుంచి సబ్జెక్టులను, పాఠాలను నిర్లక్ష్యం చేయకుండా మొదటి నుంచి చదువుపై శ్రద్ధ పెట్టాలి. అన్ని సబ్జెక్టుల్లో మొదటి ప్రయత్నంలోనే పాస్ అయ్యే విధంగా జాగ్రత్తపడాలి. సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంటే విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు హాజరయ్యే అవకాశం కోల్పోతారు. పేరున్న కంపెనీలు బ్యాక్‌లాగ్స్ లేని విద్యార్థులనే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ డ్రైవ్స్‌కు అనుమతినిస్తున్నాయి. అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునేవారు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో వీసాలను తిరస్కరిస్తున్నారు. డిగ్రీ పట్టా.. సమయానికి చేతికి రాకుంటే ఉద్యోగ సాధన కూడా కష్టమవుతుంది.
 - ప్రొఫెసర్ జె.ప్రసన్నకుమార్,
 ప్లేస్‌మెంట్ ఆఫీసర్, ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement