హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
18న జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపికలు
Published Fri, Sep 16 2016 1:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
వరంగల్ స్పోర్ట్స్ : హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి సీనియర్స్ ఖోఖో ఎంపిక పోటీలను నిర్వహిస్తున్నట్లు వరంగల్ ఖోఖో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆసక్తి కలిగిన క్రీడాకారులు 18న ఉదయం 9గంటలకు జేఎన్‌ఎస్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్ 98492 10746 నెంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.
Advertisement
Advertisement