కేంద్రం చరిత్రను వక్రీకరిస్తోంది
♦ క్విట్ ఇండియా ప్రసంగంలో నెహ్రూను విస్మరిస్తారా?
♦ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా పోరాడుతాం
♦ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేసి 14ఏళ్లపాటు జైలులో ఉన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేరును ప్రధాని తన ప్రసంగంలో కావాలనే విస్మరించారని, ఇది బీజేపీ చిన్న మనస్థత్వానికి నిదర్శనమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. 75వ క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా పార్లమెంటులో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో నెహ్రూ పేరును విస్మరించడమే మిటన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమంలో, స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ పాత్ర మరువ లేనిదని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేసిన వారిని బీజేపీ, జాతీ య నేతలుగా పొగుడుతూ, నిజంగా దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన వారిని విస్మరిస్తోం దని, చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పు దోవ పట్టిస్తోందని ఉత్తమ్ అన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభు త్వాలు ప్రజలకు కనీస మానవ హక్కులు లేకుండా చేస్తున్నాయని, దళితులు, గిరిజ నులు, మైనారిటీలు, మహిళలకు ఎలాంటి హక్కులు లేకుండా అణచివేస్తున్నారని మండి పడ్డారు. అణగారిన వర్గాలకు అండగా ఉంటా మని, వారికి న్యాయం జరిగే వరకు వారి పక్షాన పోరాడుతామని తెలిపారు.
గాంధీభవన్‌లో ఉత్సవాలు...
గాంధీ భవన్‌లో క్విట్ ఇండియా వేడుకల సందర్భంగా మండలి విపక్ష నేత షబ్బీర్ అలీతో కలసి ఉత్తమ్ పార్టీ జెండాను ఎగురవేసి మాట్లాడారు. దేశంలో మతతత్వం, నిరంకు శత్వం పెరిగిపోయిందని, ప్రజల హక్కులు కాలరాస్తున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్ అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్య క్షుడు మల్లురవి, కిసాన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ కోదండరెడ్డి, సేవాదళ్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
అహ్మద్ పటేల్ విజయంపై హర్షం
గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం సాధించడంపై ఉత్తమ్, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. పార్టీ నేతలు స్వీట్లు పంచుకుని సంబరాలు చేశారు. అహ్మద్ పటేల్ ఎన్నిక విషయంలో బీజేపీ అవాంతరాలు సృష్టిం చినా ప్రజాస్వామ్యం విజయం సాధించిం దని, ఇది బీజేపీకి చెంపపెట్టు వంటిదని టీసీపీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. ఇకనైనా బీజేపీ రాజ్యం గేతర పనులు చేయకుండా ప్రజోపయోగ పనులపై దృష్టిసారించాలని హితవు పలికారు.