‘ఆర్‌ఎస్‌ఎస్‌ వారసులు మాట్లాడటం విడ్డూరం' | TPCC chief Uttam Kumar Reddy pays tributes to martyrs of Quit India Movement | Sakshi
Sakshi News home page

‘ఆర్‌ఎస్‌ఎస్‌ వారసులు మాట్లాడటం విడ్డూరం'

Published Wed, Aug 9 2017 2:14 PM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

‘ఆర్‌ఎస్‌ఎస్‌ వారసులు మాట్లాడటం విడ్డూరం' - Sakshi

‘ఆర్‌ఎస్‌ఎస్‌ వారసులు మాట్లాడటం విడ్డూరం'

హైదరాబాద్‌: ఆర్‌ఎస్‌ఎస్‌ వారసులు క్విట్ ఇండియా ఉద్యమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ..దేశంలో భయానక వాతావరణం నడుస్తోందని.. దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగాయన్నారు.  మానవ హక్కుల ఉల్లంఘన చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అందరికి అండగా , మద్దతుగా ఉంటుందన్నారు.
 
తెలంగాణలో కూడా పూర్తిగా మానవ హక్కులు కాలరాస్తున్నారు.. వారికి మేము అండగా ఉంటామని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా  గాంధీభవనలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎగురవేశారు. గుజరాత్ నుంచి రాజ్యసభకు అహ్మద్ పటేల్ విజయం సాధించినందుకు గాంధీభవన్లో సంబరాలు చేసుకున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement