ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నెహ్రూను కించపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు.
హైదరాబాద్: ఉద్దేశ పూర్వకంగానే ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నెహ్రూను కించపరుస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు అన్నారు. నెహ్రూ 127వ జయంతి సందర్భంగా అబిడ్స్ లోని నెహ్రూ విగ్రహానికి నివాళులర్పించిన ఆయన అనంతరం నిరసన దీక్షకు దిగారు. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను, దేశానికి నెహ్రూ అందించిన సేవలను మోదీ ప్రభుత్వం మర్చిపోయిందని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఆయనకు నిమ్మరసం ఇచ్చి మరో కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క దీక్షను విరమింపజేశారు. అనంతరం భట్టి మాట్లాడుతూ నెహ్రూ ఇమేజ్ ను తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. బాలల దినోత్సవానికి ఇచ్చిన ప్రకటనల్లో నెహ్రూ ఫొటో లేకపోవడం చూస్తుంటే ఆయనను తక్కువ చేయాలనే కుట్ర మోదీ ప్రభుత్వం చేస్తుందని తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.