‘వారిది అద్భుత అనుబంధం’ | Nehru, mom loved each other, did not have time for physical affair: Edwina Mountbatten's daughter | Sakshi
Sakshi News home page

‘వారిది అద్భుత అనుబంధం’

Published Mon, Jul 31 2017 12:49 AM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

‘వారిది అద్భుత అనుబంధం’

‘వారిది అద్భుత అనుబంధం’

న్యూఢిల్లీ: భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, చివరి వైస్రాయ్‌ మౌంట్‌ బాటన్‌ భార్య ఎడ్వీనాల మధ్య నెలకొన్న సంబంధంపై సరికొత్త విషయాలు వెలుగు చూశాయి. తాను రాసిన ‘డాటర్‌ ఆఫ్‌ యాన్‌ ఎంపైర్‌: లైఫ్‌ యాజ్‌ ఎ మౌంట్‌బాటన్‌’ అనే పుస్తకంలో వీరి అనుబంధంపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు మౌంట్‌బాటన్‌ కూతురు పమేలా హిక్స్‌నీ మౌంట్‌ బాటన్‌ ప్రయత్నించారు. మౌంట్‌బాటన్‌తో పాటు 17 ఏళ్ల వయసులో పమేలా భారత్‌కు వచ్చారు. ‘నెహ్రూ, ఎడ్వీనాల మధ్య అద్భుత అనుబంధం, పరస్పర గౌరవాభిమానాలు ఉండేవి కానీ.. అందరూ అనుకున్నట్లు వారిద్దరి మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు.

నిజానికి అందుకు అవసరమైన ఏకాంతమూ వారికి లభించే పరిస్థితి లేదు. వారి చుట్టూ ఎప్పుడూ సిబ్బంది, పోలీసుల ఎవరో ఒకరు ఉండేవారు’ అని పమేలా  పుస్తకంలో వివరించారు. నెహ్రూ, అమ్మ(ఎడ్వీనా)ల మధ్య ఉన్న వాస్తవ సంబంధమేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి నాకూ ఉండేది. అయితే, నెహ్రూ రాసిన లేఖల్లో అమ్మ గురించి ఆయన భావనలు చదివాక  వారిమధ్య ఉన్న ప్రేమానుబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నా. తాను కోరుకున్న వ్యక్తిత్వం, మేధస్సును అమ్మ పండిట్‌జీలో చూసింది’ అని పేర్కొన్నారు.  భారత్‌ నుంచి వెళ్లిపోయేముందు తనకిష్టమైన ఎమరాల్డ్‌ ఉంగరాన్ని నెహ్రూకివ్వాలని ఎడ్వీనా అనుకుందని, నెహ్రూ అందుకు అంగీకరించరని తెలిసి, ఆ ఉంగరాన్ని ఆయన కూతురు ఇందిరకు ఇచ్చిందని పమేలా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement