కార్యక్రమంలో మాట్లాడుతున్న గవర్నర్
నాంపల్లి: యువతరానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిప్రదాత అని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ అన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన యువతకు ఇచ్చిన సందేశాలను గుర్తుచేస్తూ గురువారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో నిర్వహించిన ‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్’ముగింపు వేడుకలు, యువజన అవార్డుల ప్రదానోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాట్లాడుతూ...నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకాలు యువతకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయన్నారు.
ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 4వ స్థానంలో నిలిచినప్పటికీ స్వాతంత్య్రోద్యమంలో పనిచేయడమే లక్ష్యంగా ఉద్యోగాన్ని కూడా వదులుకున్న గొప్ప మహనీయుడు నేతాజీ అని కీర్తించారు. యువజన అవార్డులు గెలుపొందిన వారికి ఈ సందర్భంగా ఆమె అభినందనలు తెలియజేశా రు. అంతకుముందు సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నల్లగొండ జిల్లా ఫ్రెండ్స్ యూత్ క్లబ్‌కు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రూ.1లక్ష చెక్కుతో పాటుగా రాష్ట్రస్థాయి యువజన పురస్కారాన్ని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment