
నేతాజీ బంగారు పన్ను ఎక్కడ?
లండన్: సుభాష్ చంద్రబోస్ చివరి రోజుల్లో జరిగిన ఘటనలను క్రోడీకరిస్తున్న యూకే వెబ్‌సైట్ బోస్‌ఫైల్స్.ఇన్ఫో మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేతాజీకి బంగారు పూత పన్ను ఉండేదని.. టోక్యోలోని రెంకోజీ టెంపుల్‌లో నేతాజీ అస్థికలతోపాటుగా ఉండాలని తెలిపింది. విమాన ప్రమాదం జరిగినపుడు నేతాజీతోపాటుగా ఉన్న కల్నల్ రెహ్మాన్.. నేతాజీ చితాభస్మం, అస్థికలతోపాటు ఈ పన్నునూ కుండలో వేసినట్లు తన కొడుక్కి చెప్పారని పేర్కొంది.