నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 1945లో ఒక విమాన ప్రమాదం సందర్భంగా తైపీలోని ఒక సైనిక ఆస్పత్రిలో చనిపోయారని..
లండన్: నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 1945లో ఒక విమాన ప్రమాదం సందర్భంగా తైపీలోని ఒక సైనిక ఆస్పత్రిలో చనిపోయారని.. ఆ సమయంలో బోస్ దుబాసీగా పనిచేసిన జపాన్ దుబాసీ ఒకరు నిర్ధారించారని.. ఆ దుబాసీ ఇంకా జీవించే ఉన్నారని బోస్‌ఫైల్స్.ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది. ఆ వెబ్‌సైట్ తాజాగా విడుదల చేసిన పత్రాల ప్రకారం.. 1943 నుంచి 1945 వరకూ బోస్ వద్ద దుబాసీగా పనిచేసిన కజునొరి కనుజుకా(98) ఇంకా జీవించే ఉన్నారు. బోస్ చివరి రోజులను, విమానం కూలిన ఫలితంగా సంభవించిన బోస్ మరణాన్ని తన డైరీలో నమోదు చేశారు.