నేతాజీ జయంతి.. స్వాతంత్ర్య సమరయోధుడికి సీఎం జగన్‌ నివాళులు | CM Jagan Pays Tribute To Subhash Chandra Bose On His 127 Birth Anniversary | Sakshi
Sakshi News home page

నేతాజీ జయంతి.. స్వాతంత్ర్య సమరయోధుడికి సీఎం జగన్‌ నివాళులు

Published Tue, Jan 23 2024 11:51 AM | Last Updated on Tue, Jan 23 2024 12:20 PM

Cm Jagan Pays Tribute To Subhash Chandra Bose On His 127 Birth Anniversary - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, తాడేపల్లి: స్వాతంత్ర్య సమరయోధులు, ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ వ్యవస్థాపకులు నేతాజీ శుభాష్ చంద్రబోస్‌ 127వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఘన నివాళులు ఆర్పించారు. నేతాజీ దేశ సేవను, ధైర్య సాహసాలను సీఎం జగన్‌ ప్రశంసించారు.

స్వతంత్ర భారతావనే లక్ష్యంగా పోరాడి, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్‌ అని కొనియాడారు. యువతలో స్ఫూర్తిని నింపి వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని అన్నారు. .నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌ ద్వారా స్పందించారు. 
చదవండి: CM Jagan: వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం ప్రారంభం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement