బ్రిటిష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి భరతజాతి విముక్తి కోసం నేతాజీ సుభాష్ చం ద్రబోస్ రాజీలేని పోరాటం సాగించారని, ఆ మహానీయుడిని మనందరం ఎల్లప్పుడు స్మరిం చుకోవాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు.
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జయంతి సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం తెల్లవారితో సుభాష్ చంద్రబోస్ రాజీలేని పోరాటం చేశారని వక్తలు కొనియాడారు.
- న్యూస్‌లైన్, నల్లగొండ టుటౌన్
నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్: బ్రిటిష్ పాలకుల బానిస సంకెళ్ల నుంచి భరతజాతి విముక్తి కోసం నేతాజీ సుభాష్ చం ద్రబోస్ రాజీలేని పోరాటం సాగించారని, ఆ మహానీయుడిని మనందరం ఎల్లప్పుడు స్మరిం చుకోవాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. గురువారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ ప్రసంగించారు. సంపూర్ణ స్వాతంత్య్రం సాధించడానికి సభాష్ చంద్రబోస్ చేసిన పో రాటం మరువలేనిదన్నారు. అతని రక్తంలోనే తిరుగుబాటు తనం ఉందని, ఏ పని చేసినా ఎక్కడా రాజీ పడలేదన్నారు. సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేశారని కొనియాడారు. ఇప్పటి రాజకీయ నాయకులు కూడా నేతాజీని స్ఫూర్తిగా తీసుకొని సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసి ప్రజల్లో మార్పు తేవాలని కోరారు. దేశంకోసం పని చేసిన జాతీయ నాయకులను స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. ప్రస్తుత సమాజంలో విలువలు క్షీణిస్తున్నాయని, వాటిని కాపాడుకోవడానికి మరో సామాజిక విప్లవం రావాలన్నారు.
ఆర్‌ఓ అంజయ్య మాట్లాడుతూ యు వత సుభాష్ చంద్రబోస్‌ను స్ఫూర్తిగా తీసుకొని చెడును పారదోలేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. అదే విధంగా పలువురు అనాథాశ్రమ నిర్వాహకులను మొమోంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి కార్యదర్శి కర్నాటి విజయ్‌కుమార్, 12వ బెటాలియన్ కమాండెంట్ బాపూజీరావు, డీఎస్పీ రామ్మోహన్‌రావు, జి. మోహన్‌రావు, వక్త రాాజారెడ్డి, యువజన సంఘాల సమితి జిల్లా అధ్యక్షుడు రావుల శ్రీనివాస్‌రెడ్డి, కూతురు లక్ష్మారెడ్డి, జానీ తదితరులు పాల్గొన్నారు.