అమరావతి: రాష్ట్రంలో 25 లక్షల మంది పేదలకు వచ్చే ఉగాదికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపులు శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాల పంపణీపై గురువారం మంత్రులు సుభాష్ చంద్రబోస్, శ్రీరంగనాధ రాజు సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. జిల్లాల వారిగా స్థల సేకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ సుమారు 26 లక్షల 75 వేల 284 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇప్పటివరకు 11వేల 140 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు గుర్తించారని తెలిపారు. త్వరలో జిల్లాల వారిగా పర్యటించి ఇళ్లు నిర్మించడానికి అనుకూలమైన భూమిని గుర్తిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment