కెప్టెన్‌గా తొలి మహిళ | first woman captain | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌గా తొలి మహిళ

Published Wed, Mar 8 2017 2:42 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌

కెప్టెన్‌ లక్ష్మీ సెహగల్‌

స్ఫూర్తి   లక్ష్మీ సెహగల్‌

కెప్టెన్‌ లక్ష్మి... లక్ష్మీ సెహగల్‌... పేర్లు వినే ఉంటాం. ఆమె భారత స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ధీరవనితల్లో ఒకరు. ఆమె పుట్టింది కేరళలోని మలబార్‌లో. తండ్రి స్వామినాథన్, తల్లి అమ్ముకుట్టి. ఆమె డాక్టర్‌ కావాలనే కోరికతో ఎంబిబిఎస్‌ చదివారు. చెన్నైలోని ట్రిప్లికేన్‌లో కస్తూర్బా గాంధీ ఆసుపత్రిలో డాక్టర్‌గా సేవలందించారు. సింగపూర్‌ వెళ్లడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడ ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ సభ్యుల పరిచయడం, సుభాష్‌ చంద్రబోస్‌ ప్రసంగాలు వినడంతో ఆమె జాతీయో ద్యమం పట్ల ప్రభావిత మయ్యారు. సింగ పూర్‌లో ఆమె ఆసుపత్రి స్థాపించి భారతదేశం నుంచి సింగపూర్‌కి వలస వెళ్లి కూలి పనులు చేసుకుం టున్న కుటుంబాలకు వైద్యం చేశారు.

సుభాష్‌ చంద్రబోస్‌ సైన్యంలోకి మహిళలను ఆహ్వానిం చినప్పుడు లక్ష్మి ముందుకొచ్చారు. అలా భారతీయ ఆర్మీలో పేరు నమోదు చేసుకున్న తొలి మహిళ ఆమె. లక్ష్మి స్వామినాథన్‌ ఆధ్వర్యంలో ఉమెన్స్‌ రెజిమెంట్‌ ఏర్పాటైంది. ఝాన్సి రెజిమెంట్‌కు రాణి అని, కెప్టెన్‌ లక్ష్మి అని ఆమె గుర్తింపు పొందారు. ప్రేమ్‌ కుమార్‌ సెహగల్‌ను వివాహం చేసుకోవడంతో కెప్టెన్‌ లక్ష్మి సెహగల్‌ అయ్యారు. కాన్పూర్‌లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. స్వాతంత్య్ర వచ్చిన తర్వాత ఆమె రాజ్యసభకు ఎన్నికయ్యారు. తర్వాత ఆమె రాష్ట్రపతి పదవికి పోటీ చేశారు. ఆ పదవికి పోటీ చేసిన తొలి మహిళ లక్ష్మీసెహగల్‌. 2012లో వార్ధక్యం కారణంగా అనారోగ్యంతో మరణించారు. మరణానంతర క్రతువుల మీద ఆమెకు నమ్మకం లేదు. అందుకే తన దేహాన్ని కాన్పూర్‌లోని మెడికల్‌ కాలేజీకి పరిశోధనల కోసం ఇవ్వవలసిందిగా ముందుగానే సూచించారామె. కెప్టెన్‌ లక్ష్మి గౌరవార్థం కాన్పూర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆమె పేరుపెట్టారు.

సుభాష్‌ చంద్రబోస్‌తో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement