
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట ముస్తాబైనది. రేపు(ఆదివారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ ప్రత్యేక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా హాజరుకానున్నారు.
ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రకోట ముఖ ద్వారం వద్ద.. షిప్పింగ్ కంటైనర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. 350 కెమెరాలతో పాటు రెండు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ సరిహద్దుల వెంబడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment