indian independence day
-
డాలస్‌లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్‌లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు. -
Har Ghar tiranga : ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ (ఫొటోలు)
-
ఫ్లాగ్ కోడ్ తెలుసా..?
శ్రీకాకుళం: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ ఫ్లాగ్ కోడ్ ఏమిటో తెలుసుకుందాం. ఫ్లాగ్ కోడ్ అంటే ఏమిటి ? ► జాతీయజెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్క రూ ఫ్లాగ్ కోడ్ 2002ను అనుసరించాల్సి ఉంది. ► అలాగే యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్–1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది. ► ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండాపై పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. ► అయితే జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది. ► 2002 జనవరి 26న కొత్త కోడ్ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నేషనల్ సింబల్స్ అండ్ నే మ్స్ యాక్ట్–1950, యాంటీ డిఫమేషన్ ఆఫ్ నేషనల్ సింబల్స్ యాక్ట్–1971 ఉండేవి. ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు. ► 2022 జూలై 20న చేసిన సవరణ ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా, ఇంటి మీదైనా ఎగరేయడానికి అనుమతి ఉంది. ► అంతకు ముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది. ► జాతీయ జెండాను పాలిస్టర్ ఫాబ్రిక్‌తో తయా రు చేయడానికి 2021 డిసెంబర్ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది. ఇవి గుర్తుంచుకోండి ► ప్రభుత్వ ఫ్లాగ్ కోడ్ గతంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు దానిని సరళీకృతం చేశారు. అయినా సరే, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు, పద్ధతులు గుర్తుంచుకోవాలి. ► జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. నలిగిపోయిన, తిరగబడిన జెండా ను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి. ► జాతీయ జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగురవేయకూడదు. ► జెండాను ఎలాంటి అలంకరణలకు ఉపయోగించకూడదు. ► జెండాను ఎగుర వేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి. ► జెండాపై ఏమీ రాయకూడదు. ఏ వస్తువు మీద కప్పడానికి జెండాను ఉపయోగించకూడదు. ► జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అవసరమైతే కొన్ని పువ్వులు అందులో ఉంచవచ్చు. ► జాతీయ జెండా నేల మీద పడేయకూడదు, నీటిపై తేలనీయకూడదు. ► జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. రుమాలుగా, సోఫా కవర్‌గా, న్యాప్‌కిన్‌గా, లోదుస్తుల తయారీకి ఉపయోగించకూడదు. ► జెండాను ఎగురవేసేటప్పుడు, అది ధ్వజస్తంభా నికి కుడి వైపున ఉండాలి. ► ధ్వజస్తంభం మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టకూడదు. -
AP: స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధం
విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరుగనున్న స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం జగన్ ప్రసంగించనున్నారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ శాఖలకు చెందిన శకటాలు ప్రదర్శిస్తారు. రేపు సాయంత్రం 5:30నిమిషాలకు రాజ్‌భవన్‌లో ఎట్‌హోమ్ కార్యక్రమం జరుగనుంది.ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బస్‌భవన్‌లో స్వతంత్ర వజ్రోత్సవాలకు నరసింహ.. సత్తయ్య..
సాక్షి, హైదరాబాద్: 1947 పంద్రాగస్టు.. తొలిసారి జాతీయ పతాకం ఎగిరినప్పుడు ఆ ఇద్దరూ మువ్వన్నెల జెండా రెపరెపలను తిలకించారు. మళ్లీ ఇప్పుడు స్వతంత్ర వజ్రోత్సవాల వేళ అదే జాతీయ పతాకాన్ని వారు ఎగురవేయనున్నారు. మొదటి పంద్రాగస్టు వేడుకల కాలంలో వారు నిజాం రోడ్డు రవాణా విభాగం ఉద్యోగులుకాగా.. 75 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆర్టీసీ మాజీ ఉద్యోగులుగా.. ఆర్టీసీ ప్రధాన కేంద్రంలో జెండా పండుగకు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. వారే నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్ (ఎన్ఎస్ఆర్–ఆర్టీడీ)లో చేరి ఏపీఎస్ఆర్టీసీ (ఉమ్మడి రాష్ట్రం)లో రిటైరైన ‘ఆర్టీసీ కురువృద్ధులు’ 97 ఏళ్ల టి.ఎల్.నరసింహ, 92 ఏళ్ల ఎం.సత్తయ్య. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్టీసీ బస్‌భవన్‌లో జెండా పండగకు ఈ ఇద్దరినీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారే జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఇది ఆర్టీసీ సగర్వంగా భావిస్తోందని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సత్కరించడంతోపాటు ఆర్టీసీ పక్షాన కొన్ని వరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం బస్‌పాస్, మందులు తప్ప.. 1925లో జన్మించిన బొల్లారం వాసి టి.ఎల్.నరసింహ 1944లో తాత్కాలిక గుమాస్తాగా నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరి 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా రిటైరయ్యారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో మొదలుపెట్టి రూ. 1,740 అందుకొని పదవీవిరమణ పొందారు. మరోవైపు ప్రస్తుతం యానాంలో ఉంటున్న ఎం.సత్తయ్య మార్చి 1930లో జన్మించారు. ఆయన 1946లో ఆఫీస్ బాయ్‌గా ఉస్మానియా సిక్కా రూ. 8 జీతంతో ఉద్యోగంలో చేరి ముషీరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన స్టోర్స్‌లో అసిస్టెంట్ స్టోర్ కీపర్‌గా 1988లో రిటైరయ్యారు. ఆయన చివరి జీతం రూ.855. ఆర్టీసీలో పెన్షన్ వసతి లేనందున ప్రస్తుతం వారు సంస్థ నుంచి బస్‌పాస్‌తోపాటు ఆర్టీసీ తార్నాక ఆసుపత్రి నుంచి మందులు తీసుకుంటున్నారు. బస్‌పాస్ రికార్డుల ఆధారంగానే వారిని ఆర్టీసీ అధికారులు గుర్తించి పంద్రాగస్టు కార్యక్రమాలకు ఆహ్వానించారు. ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన నిజాం కాలం బస్సు కవాడిగూడ: దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ శనివారం వినూత్న ర్యాలీ నిర్వహించింది. నిజాం కాలంలో 1932లో ప్రారంభించిన మొట్టమొదటి బస్సు నుంచి ప్రస్తుతం సంస్థ నడుపుతున్న అత్యాధునిక బస్సుల వరకు ఉన్న వాటితో పరేడ్ చేపట్టింది. ఈ ర్యాలీ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రారంభించిన ఈ ర్యాలీలో 1932 నాటి నాందేడ్ బస్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా బ్యాండ్ మేళా, బైక్ ర్యాలీ సైతం నిర్వహించారు. నిజాంపేట ఆర్టీసీలో 1944లో చేరి 1983లో రిటైరైన టి.ఎల్. నరసింహను సజ్జనార్ పూలబొకే, శాలువాతో సత్కరించారు. -
19 మందికి ఉరిశిక్ష.. 110 మందికి యావజ్జీవ కారాగారం
‘స్వరాజ్య’ నినాదం, ఏడాదిలో స్వాతంత్య్రమే లక్ష్యం. 1920–22 మధ్య జరిగిన సహాయ నిరాకరణోద్యమ వ్యూహం ఇదే. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గాంధీజీ మొదలు పెట్టిన తొలి విస్తృత సత్యాగ్రహమిది. రౌలట్ చట్టం (ఎలాంటి విచారణ లేకుండా భారతీయులను శిక్షించే, ప్రవాసానికి పంపే చట్టం), జలియన్‌వాలా బాగ్ దురంతం, దానికి కారకులైన వారిని శిక్షించకుండా వదిలిపెట్టడం వంటి పరిణామాలు తమకు కావలసింది స్వరాజ్యమేనన్న భావనను భారతీయులలో బలపరచాయి. తమ దేశంలో తాము నిస్సందేహంగా ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతుకుతున్నామన్న వాస్తవం మరింతగా అనుభవానికి వచ్చింది. అదే గాంధీ ఉద్యమానికి ఊతమిచ్చింది. 1920 నాటి కలకత్తా కాంగ్రెస్‌లో గాంధీ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనిలో ముస్లింలను మమేకం చేసేందుకు ఖిలాఫత్ ఉద్యమాన్ని గాంధీజీ జత చేశారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమ ఛాయలు 1920 నాటి సహాయ నిరాకరణోద్యమంలోనూ కనిపిస్తాయి. సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన బిరుదులను త్యజించాలి. ప్రభుత్వ విద్యా సంస్థలను, కోర్టులను, ఎన్నికలను బహిష్కరించాలి. ఉద్యోగాలు వదిలిపెట్టాలి. పన్నులు చెల్లించరాదు. అలాగే స్వదేశీ. ఇవే ఈ ఉద్యమంలో అనుసరించాల్సిన పద్ధతులు. వీటి ప్రచారానికి గాంధీజీ దేశంలో పర్యటించారు. సహాయ నిరాకరణోద్యమ ప్రభావం భారతదేశమంతటా కనిపించింది. మధ్య పరగణాలలోని అయోధ్యలో ఈ ఉద్యమం పేరుతో రైతాంగ పోరాటం బలపడింది. సహాయ నిరాకరణ సమావేశం, రైతు ఉద్యమ సభ ఒకటే అనిపించాయి. రాజస్థాన్ ప్రాంతంలో రైతులు, గిరిజనులు తమ జీవితాలు బాగు చేసుకున్నారు. అవినీతిపరులైన పూజారుల నుంచి గురుద్వారాలను విముక్తం చేయడానికి పంజాబ్‌లో అకాలీ ఉద్యమం దీనిని ఉపయోగించుకుంది. జాతీయ విద్య, జాతీయ పరిశ్రమలు కొత్త అడుగులు నేర్చాయి. ఇందులో అన్నిటి కంటే విజయవంతమైనది విదేశీ వస్త్ర బహిష్కరణ. 1920–21 ఆర్థిక సంవత్సరంలో రూ.102 కోట్లు ఉన్న విదేశీ వస్త్రాల దిగుమతులు 1921–22 ఆర్థిక సంవత్సరానికి రూ.57 కోట్లకు పడిపోయాయి. నిజంగానే ఒక్క ఏడాదిలో బ్రిటిష్ పాలన నుంచి భారత్ విముక్తమవుతుందన్న ఆశ అక్షరాలా వెల్లువెత్తింది. కానీ మోతీలాల్ నెహ్రూ, చిత్తరంజన్‌దాస్ వంటి పెద్దలు వారిస్తున్నా వినకుండా, పెల్లుబికిన జాతీయతా భావాన్ని గుర్తించకుండా గాంధీజీ ఈ ఉద్యమాన్ని హఠాత్తుగా రద్దు చేశారు. కారణం చౌరీచౌరా దురంతం. మధ్య పరగణాలలోని గోరఖ్‌పూర్ జిల్లాలో ఉంది చౌరీచౌరా గ్రామం. బ్రిటిష్ ఇండియా సైన్యంలో పదవీ విరమణ చేసిన భగవాన్ అహిర్ ఆ ప్రాంతంలో సహాయ నిరాకరణోద్యమానికి నాయకత్వం వహించారు. గాంధీ పిలుపు మేరకు ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వానికి, పెద్ద రైతులకు వ్యతిరేకంగా ఎన్నో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నాజర్ అలీ, లాల్ మహమ్మద్, అబ్దుల్లా, కాళీచరణ్, లౌతీ కుమార్, మహాదేవ్సింగ్, మెఘు అలీ, రావ్‌ు లఖన్, సీతారాం, మోహన్, శ్యామ్‌సుందర్ వంటి వారు ఆయన సహచరులు. సహాయ నిరాకరణోద్యమ ఆశయాల మేరకు అహిర్ నాయకత్వంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు, మద్యం అమ్మకాలకు వ్యతిరేకంగా ప్రజలు గౌరీ బజార్ అనే చోట 1922 ఫిబ్రవరి 2న నిరసన ప్రదర్శన చేశారు. చౌరీచౌరా పోలీసులు చెదరగొట్టే పేరుతో వారిని చావగొట్టారు. కొందరు నాయకులను అరెస్టు చేసి అదే స్టేషన్లో బంధించారు. ఇందుకు నిరసనగానే ఫిబ్రవరి 4న చౌరీచౌరాతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు రెండున్నరవేల మంది పోగై ఆందోళనకు దిగారు. ‘గాంధీ వర్ధిల్లాలి’ అంటూ నినదిస్తూ, అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని కోరారు. ఈ క్రమంలోనే ఒక మద్యం దుకాణం ముందు పికెటింగ్ చేశారు. పోలీసులు మళ్లీ జులుం ప్రదర్శించడంతో ప్రదర్శనకారులు విశ్వరూపం చూపారు. పరిస్థితిని అదుపు చేయడానికి సబ్ఇన్స్పెక్టర్ గుప్తేశ్వర్సింగ్ కాల్పులకు ఆదేశించాడు. ఆ కాల్పులలో ముగ్గురు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. కోపోద్రిక్తులైన ప్రజలు తరమడంతో పోలీసులు స్టేషన్ భవనంలోకి పారిపోయారు. ప్రజలు దానికి నిప్పు పెట్టారు. 23 మంది పోలీసులు సజీవ దహనమయ్యారు. ప్రభుత్వం వెంటనే చౌరీచౌరాలో, చుట్టుపక్కల సైనిక శాసనం విధించింది. చౌరీచౌరా ఘటనకు బాధ్యత వహిస్తున్నానంటూ, పరిహారమంటూ, మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ గాంధీజీ ఐదు రోజుల నిరశన వ్రతం చేశారు. ఆ దుర్ఘటన ద్వారా భగవంతుడే తన కళ్లు తెరిపించాడనీ, అహింస అనే గొప్ప తాత్త్వికతతో ఉద్యమించే స్థాయి తన సోదర భారతీయులకు రాలేదన్న సంగతి తాను గుర్తించలేకపోయానని ఆయన ప్రకటించారు. ఫిబ్రవరి 12న ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ప్రభుత్వం గాంధీని అరెస్టు చేసి, ఆరేళ్లు శిక్ష విధించింది. అయితే ఆయనను 1924లోనే అనారోగ్యం వల్ల విడుదల చేశారు. ఇక్కడితో సహాయ నిరాకరణోద్యమం ఆగిపోయింది. కానీ చౌరీచౌరాలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ ఇండియాలో న్యాయ శాసనాలు ఎంత వివక్షతో కూడి ఉన్నాయో తరువాతి పరిణామాలు రుజువు చేశాయి. సజీవ దహనమైన పోలీసులు 23 మంది (కొందరు 21 మంది అని, ఇంకొందరు 22 మంది అని కూడా నమోదు చేశారు). మొత్తం 228 మంది మీద కేసులు నమోదు చేశారు. ఎనిమిది మాసాలు విచారణ జరిగింది. అరెస్టయిన వారిలో ఆరుగురు పోలీసు నిర్బంధంలోనే చనిపోయారు. కేసు విచారించిన గోరఖ్‌పూర్ సెషన్స్ న్యాయస్థానం 172 మందికి ఉరిశిక్ష విధించింది. ఇంతమందికి న్యాయస్థానం మరణదండన విధించిన ఘటన ప్రపంచంలో ఉన్నదా అనేది అనుమానమే. దీని మీద దేశంలో ఆందోళన మొదలయింది. ‘బిహార్ బంధు’ పత్రిక నిర్బంధం మధ్యనే ఈ విచారణ గురించి, ఆ ఘోరమైన శిక్ష గురించి వ్యాసాలు ప్రచురించింది. కవితాత్మకంగా రాసిన ఒక వ్యాసంలో ‘ఉరికంబం ఎక్కబోతున్న ఆ 170 మందిని పరామర్శించగలవా భారతీయుడా’ అంటూ ఆవేదనతో ప్రశ్నించింది. అలహాబాద్ నుంచి వెలువడే ‘అభ్యుదయ’ పత్రిక చౌరీచౌరాయే ఘోరమైన ఘటన అనుకుంటే, ఆ కేసులో తీర్పు మరింత ఘోరమైనదని వ్యాఖ్యానించింది. ఇది న్యాయం చేయడం కాదు, న్యాయాన్ని హత్య చేయడమేనని కాన్పూర్ నుంచి వెలువడే ‘ప్రతాప్’ పత్రిక వ్యాఖ్యానించింది. ఆ తీర్పును ఎంఎన్ రాయ్ చట్టబద్ధ హత్యగా వర్ణించారు. తీర్పును వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ కేసును అలహాబాద్ హైకోర్టులో అప్పీలు చేశారు. 1923 ఏప్రిల్ 20న హైకోర్టు కేసును పునఃపరిశీలించింది. అక్కడ మదన్మోహన్ మాలవీయ కేసు వాదించారు. చివరికి కోర్టు 19 మందికి మరణ దండన ఖరారు చేసింది. 110 మందికి యావజ్జీవ కారాగారం విధించింది. మిగిలిన వారికి కూడా కొద్దిపాటి శిక్షలు వేశారు. అలా మాలవీయ ప్రమేయంతో 151 మంది మరణదండన నుంచి బయటపడ్డారు. ఇందులో చాలామంది స్వాతంత్య్రం వచ్చాకే విడుదలయ్యారు. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం స్వరాజ్యోద్యమంలో కొత్త గొంతులకు ఆస్కారమిచ్చింది. అందుకు ఉదాహరణ అల్లూరి శ్రీరామరాజు, చంద్రశేఖర్ ఆజాద్. -డా. గోపరాజు నారాయణరావు -
చైతన్య భారతి
ఈ రోజుకో ప్రత్యేక ఉంది. ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దయిన రోజు. 421 ఏళ్ల క్రితం డిసెంబర్ 31 న ఇంగ్లిష్ జాయింట్–స్టాక్ బిజినెస్ కంపెనీగా అవతరించి, తర్వాత బ్రిటిష్ కంపెనీగా రూపాంతరం చెంది, ప్రపంచంలోని అనేక దేశాలతో పాటు భారతదేశానికి కూడా విస్తరించి.. సరిగ్గా నేటికి 148 ఏళ్ల క్రితం 1874లో ఈస్ట్ ఇండియా కంపెనీ బిచాణా ఎత్తేసిన రోజు ఇది. అసలు ఆ కంపెనీ మనవైపు రాకుంటే రెండొందలేళ్లకు పైగా మనం దాస్యంలో, దారిద్య్రంలో ఉండిపోయేవాళ్లం కాదు. ఈస్ట్ ఇండియా కంపెనీ మన దగ్గర దోచుకున్నంతా దోచుకుని వెళ్లిపోవడానికి 16 ఏళ్ల ముందరే.. పొయ్యిలోంచి పెనంలోకి అన్న చందంగా.. దేశం బ్రిటన్ హస్తగతమైంది. అప్పటి వరకు ఈస్టిండియా కింద ఉన్న ఇండియా ‘బ్రిటిష్ ఇండియా’ అయిపోయింది. అది జరిగిన ఏడాది 1858. ఆ ముందటి ఏడాదే స్వాతంత్య్రం కోసం మన దేశంలో తొలిసారి తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటు యోధుడు మంగళ్‌పాండేను ఈస్టిండియా కంపెనీ అదే యేడాది ఉరితీసింది. తిరుగుబాటులో అతడితో పాటు శిక్షకు గురై మరణించిన వారి ఊపిర్లు.. భారతదేశంలో సమరస్ఫూర్తిని నింపాయి. స్వేచ్ఛా కాంక్షను రగిల్చాయి. నాటి నుంచి దాదాపు తొంభై ఏళ్ల పాటు బ్రిటిష్ వారిపై పోరాడి 1947లో స్వాతంత్య్రాన్ని సంపాదించుకున్నాం. ఆ స్వాతంత్య్రానికి ఇది 75వ ఏడాది. అమృతోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 15 కు మన సమరఫలానికి డెబ్బై ఐదేళ్లు పూర్తవుతాయి. డెబ్బై ఐదేళ్లను ఒక సంకేతంగా డెబ్బై ఐదు వారాల ప్రణాళికతో ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం దండి యాత్ర ప్రారంభమైన మార్చి 12న నిరుడు ఉత్సవాలను ప్రారంభించింది. ఈ బృహత్‌జ్వాలా స్ఫూర్తి దీపానికి జత దీపంలా సాక్షి మీడియా గ్రూపు.. ఇవాళ్టి నుంచి వరుసగా 75 రోజుల పాటు ‘జైహింద్’ పేరుతో రోజుకో డిజిటల్ పేజీని ఇలా మీకు అందిస్తోంది. స్వాతంత్య్ర మహోద్యమంలో జీవితాలను అంకితం చేసిన మహనీయుల ధైర్య, శౌర్య, పరాక్రమ స్మృతులను; అపురూప ఘట్టాలను, ఘటనలను జ్ఞాపకం చేసుకోవడం, నివాళులు అర్పించడం, నవతరానికి స్ఫూర్తిని కలిగించడం ఈ పేజీ ముఖ్యోద్దేశం. 1947 ముందు వరకు జరిగిందేమిటి, మరో 25 ఏళ్లలో 2047 వరకు దేశంలో జరగబోతున్న అభివృద్ధి ఏమిటి అనే ఏకసూత్రత ఆధారంగా ఒక మహోత్సవంగా ఇస్తున్న ఈ స్పెషల్ పేజీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. జైహింద్. – ఎడిటర్ -
75వ స్వాతంత్ర్య వేడుకలకు ముస్తాబైన ఎర్రకోట
సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట ముస్తాబైనది. రేపు(ఆదివారం) ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోదీ ప్రత్యేక పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒలింపిక్స్ క్రీడాకారులు కూడా హాజరుకానున్నారు. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఎర్రకోట ముఖ ద్వారం వద్ద.. షిప్పింగ్ కంటైనర్‌ను పోలీసులు ఏర్పాటు చేశారు. 350 కెమెరాలతో పాటు రెండు ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట వద్ద 5 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు వద్ద భద్రతను పెంచారు. ఢిల్లీ సరిహద్దుల వెంబడి చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. -
బెజవాడలో జెండా పండుగకు ఏర్పాట్లు
-
సివిల్స్ ప్రిలిమ్స్‌లో హిస్టరీకి ఎలా సిద్ధమవ్వాలి?
- అలేఖ్య, అమీర్‌పేట కాంపిటీటివ్ కౌన్సెలింగ్ : సివిల్స్ ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ హిస్టరీ సిలబస్‌లో భారతదేశ చరిత్ర, భారతదేశ స్వాతంత్య్రోద్యమం అని పేర్కొన్నారు. చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర విభాగాలుంటాయి. హిస్టరీ నుంచి 15-20 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది. అభ్యర్థులు భారత స్వాతంత్య్రోద్యమం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి అడుగుతున్న కొన్ని ప్రశ్నలు పూర్తిగా ఫిలాసఫీకి సంబంధించినవి ఉంటున్నాయి. ఉదాహరణకు మతాలు, మత సిద్ధాంతాలపై అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మత గ్రంథాల్లో మాత్రమే ఉంటున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ నుంచి రాజకీయ కోణం నుంచి కాకుండా సామాజిక, సాంస్కృతిక అంశాలపై ప్రశ్నలు వస్తున్నాయి. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించి సంఘ సంస్కరణ ఉద్యమాలు, జాతీయ ఉద్యమం - ముఖ్య ఘట్టాలు, చట్టాలు - ఫలితాలు వంటివాటిపై దృష్టి సారించాలి. రీజనల్ హిస్టరీ నుంచి కూడా ప్రశ్నలు వస్తున్నాయి. అవి కూడా చాలా లోతుగా ఉంటున్నాయి. ఇవి ముఖ్యమైనవి అనుకున్న అంశాల నుంచి కాకుండా.. మారు మూల అంశాల నుంచి కూడా ఇస్తున్నారు. అందువల్ల అభ్యర్థులు పూర్తిస్థాయిలో విశ్లేషణాత్మక ప్రిపరేషన్ కొనసాగించాలి. చదవాల్సిన పుస్తకాలు: ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకాలు ఇండియన్ హిస్టరీ -వి.కె.అగ్నిహోత్రి ప్రాచీన చరిత్ర - ఆర్. శర్మ, రొమిల్లా థాపర్ మధ్యయుగ చరిత్ర - సతీశ్ చంద్ర మోడ్రన్ ఇండియా - బిపిన్ చంద్ర ఇన్పుట్స్: కరీం, సీనియర్ ఫ్యాకల్టీ ఎస్బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌కు ఎలా సిద్ధమవాలి? - హిమబిందు, హిమాయత్‌నగర్ బ్యాంక్ పరీక్షలో చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులువుగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబులరీపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దిన పత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్స్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తం మీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే. జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిణామాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలను చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డెయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం - వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు - కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు - విజేతలు, అవార్డులు - విజేతలు, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన రోజులు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఇన్పుట్స్: కె.వి. జ్ఞానకుమార్ డెరైక్టర్, డీబీఎస్, దిల్సుఖ్నగర్. సివిల్స్-ప్రిలిమ్స్: బయాలజీ బ్యాంక్ ఎగ్జామ్స్: రీజనింగ్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.