ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసా..? | - | Sakshi
Sakshi News home page

ఫ్లాగ్‌ కోడ్‌ తెలుసా..?

Published Mon, Aug 14 2023 12:32 AM | Last Updated on Mon, Aug 14 2023 1:00 PM

- - Sakshi

శ్రీకాకుళం: పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వాడవాడలా మువ్వన్నెల జెండాను ఎగురవేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ముఖ్యంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు దేశ ప్రజలంతా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే జాతీయ జెండాను ఎగురవేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ ఫ్లాగ్‌ కోడ్‌ ఏమిటో తెలుసుకుందాం.

ఫ్లాగ్‌ కోడ్‌ అంటే ఏమిటి ?
► జాతీయజెండాను ఎగురవేయడానికి ప్రతి ఒక్క రూ ఫ్లాగ్‌ కోడ్‌ 2002ను అనుసరించాల్సి ఉంది.

► అలాగే యాంటీ డిఫమేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ సింబల్స్‌ యాక్ట్‌–1971 నిబంధనలను కూడా పాటించాల్సి ఉంటుంది.

► ఈ కోడ్‌లోని నిబంధన 2.1 ప్రకారం, జాతీయ జెండాపై పూర్తి గౌరవంతో సాధారణ పౌరులు ఏ ప్రదేశంలోనైనా జెండాను ఎగురవేయవచ్చు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు.

► అయితే జాతీయ జెండాను అవమానిస్తే మొదటి తప్పునకు మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించే నిబంధన ఉంది.

► 2002 జనవరి 26న కొత్త కోడ్‌ అమల్లోకి వచ్చింది. అంతకు ముందు నేషనల్‌ సింబల్స్‌ అండ్‌ నే మ్స్‌ యాక్ట్‌–1950, యాంటీ డిఫమేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ సింబల్స్‌ యాక్ట్‌–1971 ఉండేవి. ఇటీవల ఈ కోడ్‌లో రెండు ప్రధాన మార్పులు చేశారు.

► 2022 జూలై 20న చేసిన సవరణ ప్రకారం, ఇప్పుడు జాతీయ జెండాను పగలు, రాత్రి కూడా ఎగురవేయవచ్చు. అది బహిరంగ ప్రదేశమైనా, ఇంటి మీదైనా ఎగరేయడానికి అనుమతి ఉంది.

► అంతకు ముందు జాతీయ జెండాను సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఎగురవేయడానికి అనుమతి ఉండేది.

► జాతీయ జెండాను పాలిస్టర్‌ ఫాబ్రిక్‌తో తయా రు చేయడానికి 2021 డిసెంబర్‌ 30 నుంచి అనుమతించారు. గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే జాతీయ జెండా తయారీకి అనుమతి ఉండేది.

ఇవి గుర్తుంచుకోండి

► ప్రభుత్వ ఫ్లాగ్‌ కోడ్‌ గతంలో చాలా కఠినంగా ఉండేది. ఇప్పుడు దానిని సరళీకృతం చేశారు. అయినా సరే, జాతీయ జెండాను ఎగురవేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు, పద్ధతులు గుర్తుంచుకోవాలి.

► జెండాను ఎగరేసేటప్పుడు అది చిరిగిపోయి ఉండకూడదు. నలిగిపోయిన, తిరగబడిన జెండా ను ఎగరవేయరాదు. సరైన స్థలంలోనే జెండాను ఎగరేయాలి.

► జాతీయ జెండాను ఎగరేసే ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండా ఎగురవేయకూడదు.

► జెండాను ఎలాంటి అలంకరణలకు ఉపయోగించకూడదు.

► జెండాను ఎగుర వేసేటప్పుడు, కాషాయ రంగు పైకి ఉండేలా జాగ్రత్త వహించాలి.

► జెండాపై ఏమీ రాయకూడదు. ఏ వస్తువు మీద కప్పడానికి జెండాను ఉపయోగించకూడదు.

► జెండాను ఎగురవేయడానికి సిద్ధం చేస్తున్నప్పుడు, అవసరమైతే కొన్ని పువ్వులు అందులో ఉంచవచ్చు.

► జాతీయ జెండా నేల మీద పడేయకూడదు, నీటిపై తేలనీయకూడదు.

► జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు. నడుము కింది భాగంలో చుట్టుకోకూడదు. రుమాలుగా, సోఫా కవర్‌గా, న్యాప్‌కిన్‌గా, లోదుస్తుల తయారీకి ఉపయోగించకూడదు.

► జెండాను ఎగురవేసేటప్పుడు, అది ధ్వజస్తంభా నికి కుడి వైపున ఉండాలి.

► ధ్వజస్తంభం మీద లేదా జెండాపైన పూలు, ఆకులు, దండలు పెట్టకూడదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement