
ఢిల్లీలో ఎర్రకోట వద్ద కలకలం
సోమవారం ఉదయం ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రక కట్టడం ఎర్రకోట వద్ద కలకలం రేగింది. సోమవారం ఉదయం ఎర్రకోట సమీపంలో పేలుడు పదార్ధాలు ఉన్న బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ఎన్ఎస్జీ బాంబ్ స్క్వాడ్ వెంటనే రంగంలో దిగి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీలు చేస్తోంది.
ఎర్రకోటకు నిత్యం వేలాదిమంది పర్యాటకులు వస్తుంటారు. రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రాంతాన్ని ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారా అనే కోణంలో జాతీయ భద్రత సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. ఇక్కడ ఈ పేలుడు పదార్థాలను ఎవరు ఉంచారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం అక్కడ భారీగా భద్రత బలగాలను మోహరించారు. అణువణువూ క్షుణ్నంగా తనికీ చేస్తున్నారు.