ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం! | terrorists plan to attack on red fort! | Sakshi
Sakshi News home page

ఎర్రకోటపై దాడికి తీవ్ర వాదుల పన్నాగం!

Published Fri, Mar 28 2014 9:54 PM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

terrorists plan to attack on red fort!

న్యూఢిల్లీ: ఎర్రకోటపై మరోమారు దాడి చేసేందుకు తీవ్రవాదులు కుట్రపన్నారు. ఇప్పటికే భారతదేశంలో పలుచోట్ల విధ్వంసం సృష్టించని ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తాజాగా ఎర్రకోటపై దాడి చేసేందుకు పన్నిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. వఖాస్ అనే తీవ్రవాదిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆ తీవ్రవాది నుంచి ఎర్రకోట ఫోటోగ్రాఫ్ లు, అందుకు సిద్ధం చేసిన ప్రణాళికను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ క్రమంలోనే ఇద్దరు ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాదులు ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించినట్లు వఖాస్ వెల్లడించాడు.


ఇదిలా ఉండగా జమ్మూలో కతువా ప్రాంతంలో శక్రవారం తీవ్రవాదుల దాడికి పూనుకున్నారు. రెండు చోట్ల చేసిన దాడుల్లో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో సైనికుడు సహా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం ఆర్మీ బలగాలు ఎదురుదాడి చేసి ముగ్గురు తీవ్రవాదుల్ని హతమార్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement