
న్యూఢిల్లీ: ఎర్రకోట మైదానం ఆదివారం యాగశాలగా మారింది. వారం రోజులపాటు సాగే ‘రాష్ట్రీయ రక్షా మహాయజ్ఞం’ను బీజేపీ ఎంపీ మహేశ్ గిరి నిర్వహిస్తున్నారు. ఇందుకోసం దేశ సరిహద్దుల్లోని డోక్లాం, వాగా, పూంఛ్, సియాచిన్‌లతోపాటు, నాలుగు పుణ్య క్షేత్రాల నుంచి సేకరించిన మట్టితో 108 హోమ గుండాలను నిర్మించారు. యజ్ఞం నిర్వహించే 1,100 మంది రుత్విక్కుల కోసం ఎర్రకోటలో తాత్కాలికంగా ‘వేదిక్ విలేజ్’ నిర్మించారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడరాదనీ, దేశాభివృద్ధి, రక్షణ, భద్రతలను ఆకాంక్షించి నిర్వహిస్తున్న పూర్తి మతపరమైన కార్యక్రమమని ఎంపీ గిరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment