సాక్షి, న్యూఢిల్లీ: మరో రెండు రోజుల్లో జరగనున్న 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సిద్ధం అవుతోంది. పంద్రాగస్టు నాడు చేసే సైనిక విన్యాసాలు, పరేడ్ కోసం అక్కడ త్రివిధ దళాలకు శిక్షణ జరుగుతోంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈ వేడుకలను ఎలా నిర్వహిస్తారన్న సందేహాలను పటాపంచలు చేస్తూ ఓ వీడియో రిలీజ్ అయింది. ఇందులో ఎర్రకోటలో సైనిక దళాలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఫుల్ డ్రస్‌లో మార్చ్ చేస్తున్నారు. ఢిల్లీలో వర్షం పడుతున్నప్పటికీ ఈ రిహార్సల్స్ జరుగుతుండటం విశేషం. (ఆగస్టు 15కు ఖైదీల విడుదల లేనట్లే! )
మిగతా రాష్ట్రాల్లోని స్టేడియాల్లోనూ ఇలాంటి ఘటనలే సాక్షాత్కరిస్తున్నాయి. జమ్ము కశ్మీర్‌లోని మినీ స్టేడియం పరేడ్ గ్రౌండ్‌లోనూ సాయుధ దళాలు మాస్కులు ధరించి ఫుల్ డ్రెస్‌లో రిహార్సల్స్ చేస్తున్నారు. అన్ని చోట్లా కరోనా సోకకుండా ఇలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాగా ఆగస్టు 15న ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటకు చేరుకుని జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించించి త్రివర్ణ రంగులున్న బెలూన్లను గాల్లోకి వదిలేస్తారు. ఆ వెంటనే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారు. (మరింత క్షీణించిన ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం)
#WATCH Full dress rehearsal at Red Fort today for 74th Independence Day celebrations pic.twitter.com/dNEXobRsue
— ANI (@ANI) August 13, 2020
Comments
Please login to add a commentAdd a comment