
లక్నో: రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా ఆగ్రాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందిబెన్ పటేల్ అగ్రరాజ్య అధ్యక్షుడికి సాదర స్వాగతం పలికారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా, అల్లుడు జరేద్ కుష్నర్‌తో కలిసి ఆగ్రాకు విచ్చేసిన ట్రంప్‌నకు సాంప్రదాయ నృత్యాలతో వెల్‌కం చెప్పారు. అనంతరం భార్య మెలానియాతో కలిసి ట్రంప్... ‘ప్రేమచిహ్నం’ తాజ్‌మహల్‌ను సందర్శించారు.
ఈ నేపథ్యంలో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ట్రంప్ తాజ్‌మహల్ వద్ద సమయం గడపనున్నట్లు సమాచారం. కాగా అంతకు ముందు అహ్మదాబాద్‌లోని మోతేరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమానికి హాజరైన ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. భారత పర్యటన తమ హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుందని.. భారత్- అమెరికాలు 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందంపై సంతకాలు చేస్తాయంటూ కీలక ప్రకటన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment