
తాజ్‌మహల్
సాక్షి, న్యూఢిల్లీ : తాజ్‌మహల్ సంరక్షణపై సుప్రీం కోర్టు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు తాజ్ మహల్ బాగోగులను పట్టించుకుంటాయన్న ఆశ లేదని వ్యాఖ్యానించింది. ఇప్పటికైనా తాజ్ మహల్ వంటి ప్రపంచ అద్భుతాన్ని పట్టించుకోకపోతే దాన్ని మూసివేస్తామని హెచ్చరించింది.
‘మీరు ఇప్పటికైనా పద్దతి మార్చుకుని తాజ్‌మహల్ వద్ద నిర్వహణా లోపాలను సరిదిద్దండి. లేకపోతే దాన్ని కూల్చేయండి. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా మన తాజ్‌మహల్ ఎంతో అందమైనది. సుందరమైనది. తాజ్ మహల్‌ను సరిగ్గా మెయింటైన్ చేయడం ద్వారా భారతదేశానికి ఉన్న విదేశీ కరెన్సీ లోటును భర్తీ చేయొచ్చు.
దేశ సమస్యను పరిష్కరించగలిగే సత్తా ఉన్న ఏకైక కట్టడం తాజ్. అలాంటి తాజ్‌ను మీరు పట్టించుకోవడం లేదు.’ అని తాజ్‌పై పిటిషన్‌ను విచారించిన జడ్జిల బెంచ్ వ్యాఖ్యానించింది. అంతేగాక తాజ్ ట్రాపెజియమ్ జోన్(టీటీజెడ్) పరిధిలో నిబంధనలను ఉల్లంఘిస్తూ చేపట్టిన పారిశ్రామిక వాడల నిర్మాణంపై టీటీజెడ్ చైర్మన్‌ను ప్రశ్నించింది.
కాగా, ఈ ఏడాది ప్రారంభంలో తాజ్ పరిరక్షణ చర్యలను సరిగా చేపట్టలేకపోతోందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment