ఢిల్లీ: దేశ రాజధానిని ఇంకా వరద ముప్పు వీడలేదు. ఆగ్రాలో కురుస్తున్న భారీ వర్షంతో.. యమునా నది మళ్లీ ఉప్పొంగి డేంజర్ మార్క్‌ను చేరుకుంది. నది నీటి మట్టం 495.8 అడుగులకు చేరింది. దీంతో.. ప్రపంచ వింత ‘తాజ్‌మహల్’ ను యమునా వరద తాకగా.. ఓ గార్డెన్ నీట మునిగింది కూడా. సరిగ్గా 45 కిందట.. ఇలాంటి పరిస్థితులు కనిపించాయి.
1978లో తాజ్‌మహల్‌ను యమునా వరద ముంచెత్తింది. అయితే ప్రస్తుత వరదతో ఈ చారిత్రక స్మారకానికి వచ్చిన నష్టమేమీ లేదని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా చెబుతోంది. ఇక ఈ దృశ్యాన్ని చూసేందుకు సాహసం చేయొద్దని స్థానికులను అధికారులు హెచ్చరిస్తున్నారు.
#WATCH | Uttar Pradesh: The water level of the Yamuna River continues to increase in Agra. pic.twitter.com/pRRFoUirUU
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 19, 2023
వరద వల్ల తాజ్ కు ప్రమాదం లేకపోయినప్పటికీ... చుట్టు పక్కల ప్రాంతాలు మాత్రం ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆగ్రాలోని తనిష్క్, లోహియా నగర్, దయాల్బాగ్, రాజశ్రీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆగ్రాలోని కైలాస మహాదేవ్ ఆలయ గర్భగుడిలోకి కూడా నీరు చేరింది. మరోవైపు యమున ఉగ్రరూపం దాల్చడంతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలు నీట మునిగాయి.
Comments
Please login to add a commentAdd a comment