​క్రికెటర్‌ బిడ్డకు తాజ్‌ మహల్‌ పేరు? | AB de Villiers to name his third child Taj Mahal | Sakshi
Sakshi News home page

Published Fri, May 18 2018 1:30 PM | Last Updated on Fri, May 18 2018 1:33 PM

AB de Villiers to name his third child Taj Mahal - Sakshi

భార్య డెనియల్‌తో డివిలియర్స్‌

బెంగళూరు : దక్షిణాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్‌కి భారత్‌లో పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలొయింగ్ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో ఏబీ తన బ్యాటింగ్‌తో భారత్‌లో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. క్రీజులో అటు ఇటు జరుగుతూ ఏబీ కొట్టె షాట్స్‌కు భారత అభిమానులు ముగ్ధులయ్యారు. మరోవైపు ఏబీకి కూడా భారత్ అంటే ఎంతో ఇష్టం. తాజాగా ఆర్సీబీ తరుపున ఐపీఎల్ 11వ సీజన్ ఆడుతున్న ఏబీడీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 

దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్‌తో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏబీ తన వైవాహిక జీవితాన్ని కూడా భారత్‌ నుంచే ప్రారంభించానని చెప్పుకొచ్చాడు. ప్రేమకి చిహ్నమైన తాజ్‌మహల్ ఎదుట తన భార్య డెనియల్ డివిలియర్స్‌కి ‘‘నీతో నా జీవితాంతం జీవించాలని ఉంది, డెనియల్‌ నన్ను పెళ్లి చేసుకుంటావా’ ’  అని ప్రపోజ్ చేసినట్లు గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా తనకు కలిగే మూడో సంతానానికి  ‘‘తాజ్’’ అని పేరు పెడుతానని చెప్పాడు. ఇండియాపై ఉన్న ప్రేమతో జాంటీ రోడ్స్  తన కుమార్తెకు ‘ఇండియా’ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే. అయితే తన ప్రేమకు పునాది పడిన తాజ్ మహల్‌కు గుర్తుగా తన బిడ్డకు ‘‘తాజ్ డివిలియర్స్‌’’ అని నామకరణం చేస్తానని డివిలియర్స్ చెప్పాడు. ఇక డివిలియర్స్‌కు ఇద్దరు కుమారులున్నారు. ఏబీ డివిలియర్స్‌ జూనియర్‌ 2015లో జన్మించగా.. జాన్‌ రిచర్డ్‌ డివిలియర్స్‌ 2017 లో పుట్టాడు. అయితే మూడో సంతానానికి తాజ్‌ అనే పేరు మనసుకు దగ్గరగా ఉంటుందని తెలిపాడు.

చూడండి : ఏబీ సెన్సేషనల్‌ క్యాచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement