
లక్నో : ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విమర్శల పాలయింది. తాజాగా విడుదల చేసిన పర్యాటక ప్రాంతాల వివరాల విషయంలో వివాదం నెలకొంది. ఆ రాష్ట్రం విడుదల చేసిన టూరిస్టు ప్రాంతాల్లో తాజ్‌మహల్‌ను పేర్కొనలేదు. దేశంలోని పలు ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా పేర్కొని , తాజ్ మహల్‌ను మాత్రం టూరిజం ప్రాంతంగా పేర్కొనకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజ్‌మహల్ భారత్‌కు ఎంతటి ముఖ్య పర్యాటక ప్రాంతమో అందరికీ తెలిసిందే. పైగా ప్రపంచ వింతల్లో తాజ్‌మహల్ ఒకటి కూడా. అంతటి ప్రసిద్ధిగల తాజ్‌మహల్‌ను టూరిజం స్పాట్‌గా పేర్కొనకపోవడంపై సర్వత్వా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.