సాక్షి, ఆగ్రా: గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు లేకపోవడంతో ముగిసిందనుకున్న తాజ్‌మహల్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్‌గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొగల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడని గతేడాది వ్యాఖ్యలు చేసిన కతియార్ తాజాగా ఆ అంశంపై మళ్లీ స్పందించారు. తాజ్‌మహల్‌ను తాజ్ మందిర్‌గా మారుస్తామని చెప్పారు. కాగా, తాజ్‌మహల్‌ను హిందువులే నిర్మించారని అందుకే తాజ్‌మందిర్ అని పేరు మారుస్తామని ఎంపీ కతియార్ పేర్కొన్నారు.
మరోవైపు తాజ్‌మహోత్సవ్-2018పై వివాదం మొదలైంది. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రామ్‌లీల నాటకం ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజ్‌మహల్ ప్రతిష్టను యోగి సర్కార్ దెబ్బతీస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు.
భారత పర్యాటకులపై పరిమితి
ఈనెల 20 నుంచి తాజ్‌మహల్‌ను రోజుకు కేవలం 40 వేల మంది భారత పర్యాటకులే సందర్శించనున్నారు. విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేదు. రోజుకు నిర్ణీత టోకన్లు ఇవ్వనున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తాజ్‌మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్‌ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment