Vinay Katiyar
-
హీరోయిన్‌పై విరుచుకుపడ్డ బీజేపీ నేత
లక్నో : రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం..‘రోహింగ్యాల నిజ స్వరూపం ప్రియాంక వంటి వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె అసలు వాళ్లను కలవడానికి వెళ్లాల్సింది కాదు. రోహింగ్యా ముస్లింలకు ఇక్కడ(భారత్‌లో) చోటు లేదు. అలాగే వాళ్లకు సానుకూలంగా మాట్లాడే వారికి కూడా ఇక్కడ స్థానం లేదు. రోహింగ్యాల పట్ల సానుభూతి చూపడానికి ఢాకా వెళ్లిన ప్రియాంక, ఆమె లాంటి మరెవరైనా ఈ దేశాన్ని(భారత్) విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ’ వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు. యూనిసెఫ్ బాలల హక్కుల రాయబారిగా పనిచేస్తున్న ప్రియాంక.. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి ఉండవద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్ పెట్టారు. అయితే ప్రియాంక చేసిన పనిని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ముస్లింలను పరామర్శించడమేమిటని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. -
కతియార్‌కు షాకిచ్చిన ‘కమలం’
లక్నో: ‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. వారు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌కు వెళ్లిపోవాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ వినయ్ కతియార్‌కు అధిష్ఠానం షాక్ ఇచ్చింది. వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాలో ఆయనకు చోటు కల్పించలేదు. కతియార్‌కు మొండిచూపిన పార్టీ పెద్దలు సమాజ్‌వాదీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన అశోక్ బాజ్‌పేయి, హరనాథ్ సింగ్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. పార్టీలోని సీనియర్ నేతలైన సుధాంశు త్రివేది, లక్ష్మీకాంత్ బాజ్‌పేయిలను పక్కకు పెట్టి మరీ అశోక్ బాజ్‌పేయిని అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వివాదాల కారణంగానే...? ‘ముస్లింలకు భారత్‌లో చోటు లేదు. జనాభా ఆధారంగా దేశాన్ని విభజించినపుడు వారికి ఇంకా ఇక్కడ ఏం పని’ అంటూ ఐదు రోజుల క్రితం కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. రామునికి చెందిన భూభాగంలో కచ్చితంగా రామమందిరం నిర్మించి తీరతామ’ని గతంలోనూ వ్యాఖ్యానించారు. తేజో మందిరాన్ని విధ్వంసం చేసి తాజ్ మహల్ నిర్మించారంటూ వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆయనకు సీటు నిరాకరించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తా: కతియార్ ‘ప్రస్తుతం ఈ అంశంపై స్పందించాలనుకోవడం లేదు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, మూడుసార్లు లోక్‌సభ సభ్యునిగా అవకాశం ఇచ్చిన పార్టీ ఆదేశాలను పాటిస్తాను. ఇప్పుడైతే రాజకీయపరమైన అంశాలపై చర్చించాలనుకోవడం లేద’ ని వినయ్ కతియార్ మీడియాకు తెలిపారు ఉపరాష్ట్రపతికి ఫిర్యాదు.. పలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కతియార్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ రాజ్యసభ చైర్మన్‌కు పలువురు సామాజిక కార్యకర్తలు లేఖ రాశారు. -
దేశం ఏమైనా కటియార్ అబ్బ సొత్తా?
-
ఈ దేశం నీ అబ్బ సొత్తా?
న్యూఢిల్లీ: ముస్లింలు భారత్‌లో ఉండకూడదంటూ బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ‘కటియార్ సాబ్ రోజువారీగా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లింలు దేశం విడిచిపోవాలని ఆయన రోజు పేర్కొంటున్నారు. దేశం ఏమైనా కటియార్ అబ్బ సొత్తా? భారత్ నా దేశం.. నీ దేశం.. మనందరి దేశం’ అని ఫరూక్ పేర్కొన్నారు. దేశంలో విద్వేషాలను పెంచేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మతం విద్వేషాలను బోధించదని, ఏ మతం అయినా ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, గౌరవాలు చూపాలని మాత్రమే బోధిస్తుందని ఆయన తెలిపారు. జనాభా ఆధారంగా ముస్లింలు దేశాన్ని విభజించారని, వారు దేశంలో ఉండకూడదని బీజేపీ వినయ్ కటియార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. -
తాజ్‌మహల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఆగ్రా: గత కొన్నిరోజులుగా ఎలాంటి ప్రకటనలు, వ్యాఖ్యలు లేకపోవడంతో ముగిసిందనుకున్న తాజ్‌మహల్ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తేజో మహల్‌గా ప్రసిద్ది చెందిన శివాలయాన్ని కూల్చేసి మొగల్ చక్రవర్తి షాజహాన్ తాజ్‌మహల్‌ను నిర్మించాడని గతేడాది వ్యాఖ్యలు చేసిన కతియార్ తాజాగా ఆ అంశంపై మళ్లీ స్పందించారు. తాజ్‌మహల్‌ను తాజ్ మందిర్‌గా మారుస్తామని చెప్పారు. కాగా, తాజ్‌మహల్‌ను హిందువులే నిర్మించారని అందుకే తాజ్మందిర్ అని పేరు మారుస్తామని ఎంపీ కతియార్ పేర్కొన్నారు. మరోవైపు తాజ్మహోత్సవ్-2018పై వివాదం మొదలైంది. ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా రామ్‌లీల నాటకం ప్రదర్శించాలని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తీరును విపక్షాలు తప్పుపడుతున్నాయి. తాజ్‌మహల్ ప్రతిష్టను యోగి సర్కార్ దెబ్బతీస్తుందని విపక్ష నేతలు ఆరోపించారు. భారత పర్యాటకులపై పరిమితి ఈనెల 20 నుంచి తాజ్‌మహల్‌ను రోజుకు కేవలం 40 వేల మంది భారత పర్యాటకులే సందర్శించనున్నారు. విదేశీ పర్యాటకులపై ఎలాంటి ఆంక్షలు లేదు. రోజుకు నిర్ణీత టోకన్లు ఇవ్వనున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. తాజ్‌మహల్ పరిరక్షణ గురించి పారా మిలటరీ, ఏఎస్ఐ, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర పర్యాటక శాఖ చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘తేజో మహల్’ను ధ్వంసం చేసి తాజ్‌మహల్ కట్టారు! -
ఆయన మానసిక పరిస్థితి బాలేదు? ఆస్పత్రిలో చేర్పించాలి!
దేశంలో ’హిందూ ఉగ్రవాదం’ ఉందంటూ సంచలన వ్యాసం రాసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై బీజేపీ విరుచుకుపడింది. కమల్ మానసిక పరిస్థితి బాలేదని, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. హిందూ ఉగ్రవాదం అంటూ పేర్కొన్న కమల్ కమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ’కమల్ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి. రాజకీయాలు ఇంతగా దిగజారడం మంచిది కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రకటనలు చేస్తున్నారు’ అని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ విమర్శించారు. తాజా వివాదం నేపథ్యంలో కమల్‌పై పరువునష్టం దావా వేసే అవకాశాన్ని తమిళనాడు బీజేపీ పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు. దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ కమల్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు దుమారం రేపుతోంది. ‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అని కమల్ తన వ్యాసంలో పేర్కొన్నారు. -
‘అద్వానీపై కుట్రేనేమో’ కతియార్ సంచలనం
న్యూఢిల్లీ: బీజేపీ నేత వినయ్ కతియార్ సంచలన వ్యాఖ్య చేశారు. బాబ్రీ కేసు విషయంలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీపై నిజంగానే కుట్ర జరిగి ఉండొచ్చని అన్నారు. ఆయనను రాష్ట్రపతి రేసులో నుంచి తప్పించేందుకు ఇప్పుడు ఈ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పరోక్షంగా అంగీకరించారు. రాష్ట్రపతి రేసులో లేకుండా చేసేందుకు అద్వానీపై ప్రధాని నరేంద్రమోదీ కుట్ర చేశారని లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై కతియార్‌ను మీడియా ప్రశ్నించగా ‘ఏమో అతడు(లాలూ ప్రసాద్ యాదవ్) చెప్పినదాంట్లో నిజం ఉండొచ్చేమో. నాకు తెలియదు’ అని అన్నారు. బజరంగ్దళ్ వ్యవస్థాపకుల్లో కతియార్ ఒకరిగా ఉండటమే కాకుండా మంచి సీనియర్ నాయకుడు. ఈయనపై కూడా బాబ్రీ కేసుకు సంబంధించి ఆరోపణలు మొదలయ్యాయి. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు అద్వానీ ఉమా భారతి, మురళీ మనోహర్ జోష సహా 16మందిని బాబ్రీ మసీదు కూల్చివేత కుట్రదారులుగా తేల్చిన ఉన్నత న్యాయస్థానం, విచారణకు ఆదేశించింది. అద్వానీతోపాటు అభియోగాలు ఎదుర్కొంటున్నవారిపై విచారణ ఉపసంహరణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 25 ఏళ్ల క్రితం నాటి ఈ కేసులో 13 మంది బీజేపీ సీనియర్ నేతలు అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. -
‘వాళ్లు మాకు ఓటెయ్యరు.. సీట్లెందుకివ్వాలి?’
ఫైజాబాద్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో ఓ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తమకు ఓటే వెయ్యరని, అలాంటప్పుడు తాము వారికి సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. తమ పార్టీ గెలవాలని ముస్లింలు కోరుకోరని, అలాంటి వారికి తామెందుకు సీట్లు ఇస్తామంటూ కఠిన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ తప్పు చేసిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఉమా భారతి అన్నారు. ముస్లింలకు బీజేపీ టికెట్లు కేటాయించివుంటే బాగుండేదని ఆమె అభిప్రాయపడ్డారు. ముస్లింలకు టికెట్లు కేటాయించాల్సిందని తమ పార్టీ నేత, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు సబబనని అన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత వినయ్ ఖతియార్ స్పందిస్తూ అసలు తాము వారికి సీట్లు ఎందుకివ్వాలని నిలదీశారు. ‘ముస్లింలు వారి ఓటును మాకు ఏనాడు ఓటెయ్యన్నప్పుడు మేమెందుకు వారికి పార్టీ టిక్కెట్లు ఇవ్వాలంటూ పార్టీని వెనుకేసుకొచ్చారు. ఐదు దశ ఎన్నికల్లో ఏ ఒక్క ముస్లిం అభ్యర్థి గెలవబోరని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బీజేపీకి పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉమాభారతీ వ్యాఖ్యలు చేయగా అందుకు వినయ్ ఖతియార్ సమాధానం ఇచ్చారు. మరిన్ని వార్తా కథనాలకై చదవండి.. బీజేపీ తప్పుచేసింది: కేంద్ర మంత్రి -
ప్రియాంకపై అలాంటి మాటలు సరికాదు: వెంకయ్య
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వినయ్ కతియార్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అలాంటి మాటలు అస్సలు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో చెప్పారు. అలాగే, ఓటును ఆడబిడ్డతో పోల్చడమే కాకుండా, ఓటు కూతురు పరువుకంటే గొప్పదన్న వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు విమర్శించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ స్టార్ క్యాంపెయినర్ అని తాను అస్సలు అనుకోవడం లేదని, ఆమెకంటే అందమైన వాళ్లు ఎంతో మంది ప్రచారానికి ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధుమారం రేగింది. అతడి మాటలు బీజేపీ ఆలోచన విధానాన్ని తెలియజేస్తోందంటూ ప్రియాంక అన్నారు. రాబర్ట్ వాద్రా వినయ్‌ను క్షమాపణలు కోరినప్పటికీ ఆయన మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో అసలే ఎన్నికల హడావుడిలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుందని ఆలోచించిన బీజేపీ వినయ్‌కు దూరంగా జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, ఇవి ఆమోదయోగ్యంకానీ మాటలని చెప్పారు. -
ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు
-
ఎంపీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రియాంక
లక్నో: తనపై బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ స్పందించారు. కతియార్ వ్యాఖ్యలు బీజేపీ నేతల మైండ్ సెట్ ను తెలియజేస్తున్నారని అన్నారు. మహిళలపై కమలం నాయకుల వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని పేర్కొన్నారు. ప్రియాంక కంటే అందమైన స్టార్ క్యాంపెయినర్లు తమ పార్టీలో ఉన్నారంటూ కతియార్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీలో స్మృతి ఇరానీ ఉన్నారు. ప్రియాంక కంటే ఆమె చాలా అందమైన మహిళ. స్మృతి ఎక్కడకు వెళ్లితే అక్కడకు ప్రజలు వస్తుంటారు. ప్రియాంక కంటే స్మృతి బాటా మాట్లాడతార’ని కతియార్ పేర్కొన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘాల నాయకురాళ్లు తప్పుబడుతున్నారు. -
ప్రియాంక గాంధీ అందంపై ఎంపీ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: బాలికలను అవమానించే విధంగా జేడీ(యూ) అగ్ర నాయకుడు శరద్ యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం సద్దుమణకముందే బీజేపీ ఎంపీ వినయ్ కతియార్ మరో వివాదాన్ని రాజేశారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక కంటే అందమైన మహిళలు చాలా మంది ఉన్నారని.. ఆమె కంటే యాక్టర్లు, ఆర్టిస్టులు అందంగా ఉంటారని నోటికొచ్చినట్టు మాట్లాడారు. తమ పార్టీలో అందమైన స్టార్ క్యాంపెయినర్లు చాలా మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన స్టార్ క్యాంపెయినర్లు జాబితాలో ప్రియాంక గాంధీతో పాటు పలువురు సినిమా తారల పేర్లు ఉన్న సంగతి తెలిసిందే. కాగా, అభ్యంతకర వ్యాఖ్యల చేసిన శరద్ యాదవ్ కు అవసరమైతే నోటీసులు ఇస్తామని కేంద్ర మహిళా సంఘం అధ్యక్షురాలు లలితా కుమారమంగళం తెలిపారు.