ప్రియాంకపై అలాంటి మాటలు సరికాదు: వెంకయ్య | BJP distances itself from Vinay Katiyar's remarks about Priyanka Gandhi | Sakshi
Sakshi News home page

ప్రియాంకపై అలాంటి మాటలు సరికాదు: వెంకయ్య

Published Wed, Jan 25 2017 7:21 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

ప్రియాంకపై అలాంటి మాటలు సరికాదు: వెంకయ్య

ప్రియాంకపై అలాంటి మాటలు సరికాదు: వెంకయ్య

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత వినయ్‌ కతియార్‌ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఖండించింది. అలాంటి మాటలు అస్సలు ఆమోద యోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మీడియాతో చెప్పారు. అలాగే, ఓటును ఆడబిడ్డతో పోల్చడమే కాకుండా, ఓటు కూతురు పరువుకంటే గొప్పదన్న వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ స్టార్‌ క్యాంపెయినర్‌ అని తాను అస్సలు అనుకోవడం లేదని, ఆమెకంటే అందమైన వాళ్లు ఎంతో మంది ప్రచారానికి ఉన్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధుమారం రేగింది. అతడి మాటలు బీజేపీ ఆలోచన విధానాన్ని తెలియజేస్తోందంటూ ప్రియాంక అన్నారు. రాబర్ట్‌ వాద్రా వినయ్‌ను క్షమాపణలు కోరినప్పటికీ ఆయన మాత్రం అందుకు నిరాకరించారు. దీంతో అసలే ఎన్నికల హడావుడిలో ఇలాంటి వ్యాఖ్యలు పార్టీని ఇబ్బందుల్లో పడేస్తుందని ఆలోచించిన బీజేపీ వినయ్‌కు దూరంగా జరిగింది. ఇలాంటి వ్యాఖ్యలు ఖండిస్తున్నామని, ఇవి ఆమోదయోగ్యంకానీ మాటలని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement