దేశంలో ’హిందూ ఉగ్రవాదం’ ఉందంటూ సంచలన వ్యాసం రాసిన ప్రముఖ నటుడు కమల్ హాసన్‌పై బీజేపీ విరుచుకుపడింది. కమల్ మానసిక పరిస్థితి బాలేదని, అందుకే ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడింది. హిందూ ఉగ్రవాదం అంటూ పేర్కొన్న కమల్ కమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
’కమల్ మానసిక పరిస్థితి బాగాలేదు. ఆయనను ఆస్పత్రిలో చేర్పించి.. చికిత్స అందించాలి. రాజకీయాలు ఇంతగా దిగజారడం మంచిది కాదు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన ప్రకటనలు చేస్తున్నారు’ అని బీజేపీ సీనియర్ నేత వినయ్ కటియార్ విమర్శించారు. తాజా వివాదం నేపథ్యంలో కమల్‌పై పరువునష్టం దావా వేసే అవకాశాన్ని తమిళనాడు బీజేపీ పరిశీలిస్తున్నదని ఆయన చెప్పారు.
దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోయిందంటూ కమల్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. హిందూ ఉగ్రవాదాన్ని అడ్డుకోవటంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. పాలిత రాష్ట్రాలైన యూపీ, గుజరాత్, రాజస్థాన్‌లలో ఈ పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆనంద వికటన్ పత్రికలో ఆయన రాసిన వ్యాసం ఇప్పుడు దుమారం రేపుతోంది. ‘గతంలో హిందూ సంఘాలు హింసకు పాల్పడేవి కావు. కేవలం మాటలతోనే ప్రత్యర్థులపై విరుచుకుపడేవి. కానీ, పరిస్థితులు ఇప్పుడు దారుణంగా మారాయి. భౌతిక దాడులకు పాల్పడే స్థాయికి చేరుకున్నారు. వారిని వెనకాల నుంచి కొందరు ప్రోత్సహిస్తున్నారు. అసలు హిందూ టెర్రరిజం లేదన్న కొందరి వాదన నిజం కాదు. అది ఉంది. ఇప్పుడు తారా స్థాయికి చేరింది ’’ అని కమల్ తన వ్యాసంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment