న్యూఢిల్లీ: ముస్లింలు భారత్‌లో ఉండకూడదంటూ బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
‘కటియార్ సాబ్ రోజువారీగా ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ముస్లింలు దేశం విడిచిపోవాలని ఆయన రోజు పేర్కొంటున్నారు. దేశం ఏమైనా కటియార్ అబ్బ సొత్తా? భారత్ నా దేశం.. నీ దేశం.. మనందరి దేశం’ అని ఫరూక్ పేర్కొన్నారు.
దేశంలో విద్వేషాలను పెంచేందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మతం విద్వేషాలను బోధించదని, ఏ మతం అయినా ప్రతి వ్యక్తి పట్ల ప్రేమ, గౌరవాలు చూపాలని మాత్రమే బోధిస్తుందని ఆయన తెలిపారు. జనాభా ఆధారంగా ముస్లింలు దేశాన్ని విభజించారని, వారు దేశంలో ఉండకూడదని బీజేపీ వినయ్ కటియార్ బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment