
తాజ్ మహల్... తీసుకెళ్లవచ్చు
బెంగళూరు : ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ గొప్పతనమే వేరు. పాలరాతితో నిర్మించిన ఈ ప్రేమ ప్రతిరూపాన్ని చూడగానే మనతో పాటు తీసుకెళ్తే బాగుండు అనిపిస్తుంది. కానీ అది సాధ్యమా? ..సాధ్యమే!! ఈ ఫొటోలోని తాజ్‌మహల్‌ను మీరు ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. బెంగళూరులోని ఆర్బీఏఎన్‌ఎమ్ స్కూల్ గ్రౌండ్‌లో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. దీన్ని మనం ఎంచక్కా మడతపెట్టి.. తీసుకెళ్లొచ్చట.