ఆగ్రా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అందమైన తాజ్ మహల్. ఈ ప్రేమ చిహ్నాన్ని చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి జనం ఆగ్రాకు తరలి వస్తుంటారు. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం ఈ తాజ్ మహల్ నిర్మించారు. అయితే ఆగ్రాలో మరో తాజ్ మహల్ కూడా ఉంది. దీని వెనుక కూడా ఒక ఓ ప్రేమకథ ఉంది. ఓ భార్య తన భర్త జ్ఞాపకార్థం రెడ్ తాజ్ మహల్ నిర్మించారు. ఈ తాజ్ మహల్ ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. ఇది తెల్లని తాజ్ మహల్‌ను పోలివుంటుంది. అయితే పరిమాణంలో తాజ్‌మహల్ కన్నా చిన్నదిగా ఉంటుంది.
ఈ ఎర్ర తాజ్ మహల్ ఆగ్రాలోని ఎంజీ రోడ్డులో గల రోమన్ క్యాథలిక్ స్మశానవాటికలో ఉంది. ప్రముఖ చరిత్రకారుడు రాజ్‌కిషోర్ శర్మ పుస్తకం ‘తవారిఖ్-ఎ-ఆగ్రా’లో రాసిన వివరాల ప్రకారం భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు, వారి సైన్యం దేశంలోని వివిధ ప్రాంతాల్లో విడిది చేసింది. అదే సమయంలో ఆగ్రా కోట భద్రత కోసం జాన్ విలియం హాసింగ్ అనే డచ్ అధికారిని ఇక్కడ నియమించారు. నాడు అతనితో పాటు అతని భార్య ఆలిస్ హాసింగ్ కూడా ఆగ్రాకు వచ్చారు. ఆ భార్యాభర్తల మధ్య ఎంతో ప్రేమ ఉండేది.
వారు తాజ్‌మహల్‌ను చూసి తెగ సంబరపడిపోయారు. దీంతో ఆ దంపతులు తమలో ఎవరు ముందుగా ఈ లోకాన్ని విడిచి వెళతారో వారి జ్ఞాపకార్థం మరొకరు తాజ్‌మహల్‌ను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. జాన్ హాసింగ్ 1803, జూలై 21న మృతి చెండారు. దీంతో అతని భార్య.. భర్త జ్ఞాపకార్థం ఆగ్రాలోని రోమన్ క్యాథలిక్ శ్మశానవాటికలో రెడ్ తాజ్ మహల్‌ను నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment