సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) సీనియర్ నేత అజాం ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్‌ను కూల్చేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. ఒకప్పుడు అది శివాలయమని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు తనకు చెప్పారన్న అజాం ఖాన్.. యోగి ఆ తాజ్‌మహల్‌ను కూల్చి మళ్లీ ఆలయం కట్టాలనుకుంటే తాను అందులో భాగస్వామిని అవుతానని వెల్లడించారు. యోగి తాజ్‌మహల్‌ను కూల్చుతానంటే.. తనతో పాటు మరో 10 నుంచి 20వేల మంది ముస్లింలను పలుగు, పారలతో తీసుకొస్తానని ఎస్పీ నేత తన ట్వీట్లో పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.