
శంషాబాద్:భార్య టికెట్‌పై ప్రియురాలిని తీసుకుని జాలీగా వెళ్లి తాజ్‌మహల్ చూసొద్దామనుకున్న ఆ వ్యక్తికి ఎయిర్‌పోర్టులో చుక్కెదురైంది. లింగసూర్‌కు చెందిన దౌల్‌సాబ్ అతడి పేరుతో పాటు భార్య ఫాతిమా పేరిట శంషాబాద్ ఎయి ర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్లడానికి రెండు టికెట్‌లు బుక్ చేశాడు. భార్య స్థానంలో ప్రియురాలుతో కలిసి ఈ నెల 16 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. తనిఖీలు నిర్వహిస్తున్న సిబ్బంది సదరు మహిళను పేరు చెప్పమని అడగడంతో ఫాతిమా చోట మరో పేరు చెప్పడంతో సిబ్బంది అవాక్కయ్యారు. పూర్తిగా ఆరాతీయడంతో టికెట్‌కు సంబంధం లేని మహిళ ప్రయాణించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. వెంటనే సీఐఎస్‌ఎఫ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఎయిర్‌లైన్స్‌తో పాటు ఎయిర్‌పోర్టు అధికారులను మోసం చేయడానికి యత్నించినందుకు గాను వారిపైకేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment