తాజ్ మహల్.. దేశంలోనే ఓ అద్భుతమైన కట్టడం! మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు! ఒరిజనల్ తామ్‌మహల్ కట్టాడా? అని ఆశ్చర్యపోకండి. అచ్చం తాజ్‌మహల్ రేంజ్ ఆకృతిలో ఓ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే ఓ విద్యావేత్త తన భార్య మంజుషా చౌక్సేకు గిఫ్ట్‌గా అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని నిర్మించాడు.
ఇందులో నాలుగు బెడ్ రూంలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ జంట ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్ అందానికి ముగ్దులైన ఈ జంట.. దాని ఆర్కిటెక్షర్‌ను, నిర్మాణ విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే ముందుగా ఆనంద్ ప్రకాష్ చౌక్సే.. తన ఇంటిని సుమారు 80 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని భావించారు. కానీ, 80 ఫీట్ల ఎత్తులో ఇంటిని కట్టడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో తక్కువ ఎత్తులో ఉన్నా తాజ్‌మహల్‌లో ఆకృతిలో తన ఇంటిని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.
అద్భుతమైన ఇంటిని నిర్మించడానికి ఇంజనీర్లకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని 3D ఇమేజ్ పద్దతిలో రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటిని నిర్మించిన ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే స్పందిస్తూ.. ‘మొత్తం 90 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉండగా.. ప్రధానమైన తాజ్‌మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉండగా.. రెండు బెడ్ రూంలతో రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇంటిలో వంటగది, లైబ్రరీ, ధ్యానంరూంలు కూడా ఉన్నాయి. అయితే ఇంటిని నిర్మించే ముందు ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శించాను’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment