home construction
-
భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..?
ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం ఇచ్చి ఇంటికి పంపించకుండా వారికి మౌలికసదుపాయాలు కల్పించడంపై ప్రముఖ కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ తన ఉద్యోగులకు ఏకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈమేరకు ఇండస్ట్రీయల్ హౌజింగ్ మోడల్స్ పేరుతో ఇప్పటికే చైనా, వియత్నాం వంటి దేశాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో ఇండియాలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. వీరికి ఇళ్లు నిర్మించేలా కంపెనీ చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు చెప్పారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, సాల్కాంప్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కోసం గృహాలను నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘యాపిల్ ఆవాస్ యోజన’ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వార్తాకథనాల ద్వారా తెలిసింది. ఈ పథకం కింద దాదాపు 78,000 యూనిట్లు ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో గరిష్ఠంగా తమిళనాడులోనే 58,000 యూనిట్ల ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయి. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్కాట్) సహకారంతో ఆ రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. టాటా గ్రూప్‌తోపాటు ఎస్పీఆర్ ఇండియా నుంచి ఈ పథకానికి సహకారం అందనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 10-15% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్నాయి. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించనున్నట్లు తెలిసింది. మార్చి 31, 2025లోపు గృహాల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంతో ముఖ్యంగా మహిళలకు అధికంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం అద్దె గృహాల్లో నివసిస్తున్నారు. వారు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి చాలాసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీ ఉత్పాదకతతోపాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. భారత్‌లో ప్రధాన ఐఫోన్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన 41,000 మంది ఉద్యోగుల కోసం 35,000 ఇళ్లను నిర్మించనుంది. వీరిలో 75శాతం మహిళలే ఉండడం గమనార్హం. టాటా ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగుల కోసం హోసూర్ ఫెసిలిటీలో 11,500 ఇళ్లను నిర్మిస్తుంది. యాపిల్ కోసం పవర్ అడాప్టర్లు, ఎన్క్లోజర్లను ఉత్పత్తి చేసే సాల్కాంప్ 3,969 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇదీ చదవండి: పుష్పరాజ్.. బ్రాండింగ్‌లో తగ్గేదేలే.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా స్థానిక కంపెనీలతో కలిసి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఉత్పత్తులను భారత్‌లో తయారుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. -
గృహ రుణం కావాలా..? ప్రాసెసింగ్ ఫీజు లేదు.. వడ్డీ తక్కువే..
ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఇంటి రుణాలపై వడ్డీని తగ్గించింది. 8.45 శాతంగా ఉన్న వడ్డీ రేటులో 15 పాయింట్లు కట్ చేసింది. తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణలపై 8.3 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభం అవుతుందని బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సదరు రుణానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేస్తున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇది పరిమితకాలపు ఆఫర్ అని, ఈ నెలాఖరు వరకు (మార్చి 31) మాత్రమే అందుబాటులో ఉంటుందని బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. గృహ రుణాల జారీలో ముందు వరుసలో ఉన్న ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.4 శాతం నుంచి ప్రారంభం అవుతున్నాయి. తమ బ్యాంక్ మాత్రం అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తోందని బ్యాంక్ పేర్కొంది. ఈ వడ్డీ రేటుకు 30 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే రూ.లక్షకు రూ.755 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని బ్యాంక్ తెలిపింది. రుణ ప్యాకేజీలో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందిస్తున్నామని చెప్పింది. సోలార్ ప్యానెల్స్‌కు.. సంప్రదాయ గృహ రుణాలతో పాటు రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌కు సైతం రుణాలు అందిస్తున్నామని బ్యాంక్ తెలిపింది. 7 శాతం వడ్డీకే ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజూ లేకుండా ఈ తరహా రుణాలు అందిస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. గరిష్ఠంగా 120 నెలలకు గానూ ప్రాజెక్ట్ వ్యయంలో 95 శాతంగా రుణం పొందొచ్చని బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రభుత్వం నుంచి రూ.78 వేలు సబ్సిడీ సైతం పొందొచ్చని వివరించింది. గమనిక: ప్రభుత్వ లావాదేవీలు నిర్వహించేందుకు వీలుగా సంబంధిత బ్యాంకు శాఖలు మార్చి 30, 31న పనిచేసేలా చూడాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇప్పటికే బ్యాంకులకు సూచించింది. ఇదీ చదవండి: శని, ఆదివారాల్లో ఎల్ఐసీ ఆఫీసులు ఓపెన్.. కారణం.. -
2024లో హైదరాబాద్‌లో పూర్తికానున్న ఇళ్లు ఎన్నంటే..
రియల్ఎస్టేట్ రంగం రోజురోజుకు ఎంతలా వృద్ధి చెందుతోందో తెలియనిది కాదు. దానికితోడు మారుతున్న జీవనప్రమాణాలకు అనుగుణంగా సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఏటా ఇళ్ల నిర్మాణం అధికమవుతోంది. 2023లో ఏమేరకు ఇంటి నిర్మాణాలు పూర్తి చేశారో.. 2024లో ఈ ట్రెండ్ ఎలా ఉండబోతుందో అనరాక్ రిసెర్చ్ బృందంం నివేదిక విడుదల చేసింది. దేశంలో కిందటేడాది ప్రముఖ ఏడు నగరాల్లో 4.35 లక్షల ఇళ్లను అభివృద్ధి చేసినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ నివేదికలో పేర్కొంది. పూర్తయిన ఇళ్లలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. 2022లో 4.02 లక్షల యూనిట్లు పూర్తయ్యాయి. ఫస్ట్ సేల్ ట్రాన్సాక్షన్ల డేటా ఆధారంగా ఈ రిపోర్ట్‌ను అనరాక్ తయారు చేసినట్లు తెలిసింది. ఈ నివేదిక ప్రకారం.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో కిందటేడాది 1,43,500 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంతకుముందు ఏడాదిలో పూర్తయిన 1,26,720 ఇళ్లతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. దిల్లీ-ఎన్సీఆర్లో పూర్తయిన ఇళ్లు 86,300 యూనిట్ల నుంచి 32 శాతం పెరిగి 1,14,280 యూనిట్లకు చేరింది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై మూడు సిటీల్లో కలిపి కిందటేడాది 87,190 ఇళ్లు పూర్తయ్యాయి. 2022లో ఈ సంఖ్య 81,580గా నమోదైంది. పుణెలో కిందటేడాది పూర్తయిన ఇళ్లు 84,200 యూనిట్లకు పెరిగింది. ఏడాది ప్రాతిపదికన 23 శాతం వృద్ధి నమోదు చేసింది. కోల్‌కతాలో 25,075 ఇళ్లు కిందటేడాది పూర్తయ్యాయి. ఇదీ చదవండి: కదిలే ఇళ్లు.. సకల సౌకర్యాలు! టాప్ ఏడు నగరాల్లో 2024లో పూర్తి చేయడానికి సుమారు 5.31 లక్షల యూనిట్లు సిద్ధంగా ఉన్నాయని నివేదికలో తేలింది. ఈఏడాది ఎంఎంఆర్‌లో 1.61లక్షల యూనిట్లు పూర్తి కావాల్సి ఉండగా దిల్లీ-ఎన్సీఆర్లో 1.44లక్షల యూనిట్లు, పుణెలో 97,000 యూనిట్లు, హైదరాబాద్‌లో దాదాపు 34,770 యూనిట్లు, కోల్‌కతాలో 25,220 యూనిట్లు, చెన్నైలో 17,580 యూనిట్లు పూర్తవుతాయని నివేదిక పేర్కొంది. -
చరిత్ర ఎరుగని సాహసం..
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసించని రీతిలో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మకు రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ రూ.46.90 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులైన 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించాం. వాటికి సంబంధించి తొలి దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింద ఇవాళ సుమారు రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు 5,43,140 మందికి దాదాపు రూ.54 కోట్లు విడుదల చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ పావలా వడ్డీకే రూ.35 వేలు రుణం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగవంతం చేస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి పొందిన రుణాలను 9 నుంచి 11 శాతం వరకు వడ్డీతో తిరిగి చెల్లించే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు సక్రమంగా చేయాలి. అది వారి బాధ్యత. అలా అక్కచెల్లెమ్మలు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వారికి అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ క్రమంలో అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35 వేలపై పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. విలువైన స్థిరాస్తి.. రాష్ట్రంలో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా చేపడుతున్నాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకి రుణాలను అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రూ.15 వేలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్ లాంటి వివిధ రకాల నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువకు సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40 వేల దాకా ప్రయోజనం చేకూరుస్తున్నాం. మనం ఇచ్చిన ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో రూ.15 లక్షల పైచిలుకు ఉంది. ఈ విలువ మీద ఇళ్లు, మౌలిక సదుపాయాల విలువలను కలిపితే ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆస్తిని తోబుట్టువుగా సమకూరుస్తున్నాం. ► కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ షర్మిలారెడ్డి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ.దీవాన్ మైదిన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ లక్ష్మీ షా, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటిమంది.. జయహో జగనన్నా పిల్లాపాపలతో కలిపి సుమారు కోటిమంది అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా కల్పిస్తున్న గొప్ప యజ్ఞం జగనన్న ఇళ్ల నిర్మాణం. ఒక గ్రామం ఏర్పడాలంటే సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రెండున్నర ఏళ్లలో 17 వేల జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లను నిర్మించడం ఇదే ప్రథమం. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం జగన్‌కు మినహా మరెవరికీ ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తై నిరుపేద మహిళలు పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నారు. కోటిమంది జయహో జగనన్నా అని నినదిస్తున్నారు. పేదలకు పక్కా గూడు కల్పించే ఈ మహా యజ్ఞం ఎంత మంది మారీచులు అడ్డుపడినా ఆగదు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఓ ఆడబిడ్డకు ఇంకేం కావాలి? ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం తిరిగి తిరిగి అలిసిపోయా. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం మంజూరైంది. వెంటనే పట్టా ఇచ్చారు. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఈ రోజు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్ధలాన్ని, ఇంటిని కూడా అందించారు. ఇదంతా నమ్మలేకపోతున్నా. మాకిచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. బ్యాంకు ద్వారా పొందిన రుణానికి వడ్డీ కూడా మీరే కడుతున్నారు. కాలనీలో రోడ్లు, కరెంట్, నీళ్లు అన్నీ ఇచ్చారు. ఒక ఆడపిల్లకు అన్నగా మీరు (సీఎం జగన్) చేయాల్సిందంతా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. నేను పొదుపు సంఘం ద్వారా లబ్ధి పొందా. కరోనా సమయంలో ఎంతో ఆందుకున్నారు. మళ్లీ మీరే మాకు సీఎంగా రావాలి. – హైమావతి, లబ్ధిదారు, విశాఖపట్నం ద్వారకను తలపించేలా కాలనీలు మేం తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డాం. గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీలో నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. దానికి తోడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ (సీఎం జగన్) రుణం తీర్చుకోలేం. కాలనీలో కరెంటు, రోడ్లు, వాటర్ అన్ని సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇచ్చారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. మా కాలనీలో లైటింగ్, ఆర్చ్ గేట్ కట్టారు. లైటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అప్పట్లో శ్రీకృష్ణుడు ద్వారక కట్టిస్తే అన్ని కులాలు కలిసి బతికేవారట. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా ద్వారక లాంటివే. తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు జీవితమిచ్చారు. మీలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లలను స్కూల్‌కు పంపితే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని గర్వంగా చెబుతున్నా. మా ఇంట్లో రేషన్ బియ్యం తింటాం. రేషన్ బండి ఇంటి ముందుకే వస్తోంది. ఏ ప్రయాస లేకుండా సరుకులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటాం జగనన్నా. – పగడాల స్వర్ణ సింధూర, లబ్ధిదారు, గుంటూరు మీ సంకల్పం గట్టిది పదేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం. కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు తెచ్చిన సచివాలయాల వ్యవస్థతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి స్థలం ఇచ్చారు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ.35 వేలు బ్యాంకు రుణం అందించారు. ఆ వడ్డీ భారం మాపై పడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. నా ఇంటి స్థలం ఇప్పుడు రూ. 5 లక్షలు ఉంది. భవిష్యత్‌లో రూ.10 లక్షలు కూడా కావచ్చు. ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది. ఏ పథకం కావాలన్నా సులభంగా అందుతోంది. మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. మా అత్తయ్య చేయూత డబ్బులతో చీరల వ్యాపారం చేస్తోంది. మామకు వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. గతంలో పింఛన్ కోసం ఎంతో ప్రయాసలు పడ్డాం. పేద మహిళ లక్షాధికారి కావాలన్న మీ (సీఎం జగన్) సంకల్పం గొప్పది. మీ ద్వారా నా కుటుంబం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లబ్ధి పొందింది. – వహిదా ఖానం, లబ్ధిదారు, కడప -
ఇంటి నిర్మాణంలో ఇవి పాటిస్తే కరెంట్ బిల్లు ఆదా!
ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్‌తోపాటు బయటకు కనిపించే వాటికిసైతం ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయిస్తుంటారు. వంటగది ఎక్కడ రావాలి? పడక గదులు ఎన్ని ఉండాలి? మెట్లు ఏవైపు ఉండాలి? ఎలివేషన్ ఎలా ఉంటే బావుంటుందనే విషయాలకే ఎక్కువ పట్టింపు ఉంటుంది. ఇంటిలో స్థలాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ఆధునిక భవన డిజైన్లలో కీలకం. అయితే చాలా మంది జీవితకాలంలో గణనీయ ప్రభావాన్ని చూపే ఇలాంటి అంతర్గత విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా భవనాల డిజైన్‌లో ఈ అంశాలను కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లాంటి నగరంలో కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా ఇంటి విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. అలాగని సమర్థంగా వినియోగిస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. ఇంట్లో చాలా గదులు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పెరిగిన ఇంటి విస్తీర్ణంతో దాని ధర కూడా పెరుగుతుంది. అందరూ అధిక ధరలను భరించలేరు. వీటిని గమనించిన ఆర్కిటెక్చర్లు ఇంటిలోపల స్థలాన్ని సమర్థంగా వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. ఉదాహరణకు 200 చదరపు అడుగుల స్థలాన్ని లివింగ్ రూంకు వదిలిపెడుతుంటారు. అందుకు బదులుగా కొంత అదనంగా మరో 100 చదరపు అడుగుల స్థలాన్ని కలిపి భోజన ప్రదేశంగా, వంటగది వంటి బహుళ అవసరాలకు వినియోగించవచ్చు. అవసరాల్లో రాజీ పడకుండా ఖర్చులను తగ్గించుకోవాలనుకుంటే ‘ఎఫెక్టివ్ మల్టిపుల్’ అధికంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సగటున కొన్ని సర్వేల ప్రకారం వంటగది, హాల్, కిచెన్.. వంటి గదుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలాన్ని సమర్థంగా వినియోగిస్తే ఎఫెక్టివ్ మల్టిపుల్ బావుంటుంది. ఎఫెక్టివ్ మల్టిపుల్ విలువ 1 కంటే ఎక్కువ ఉన్నట్లయితే ఇంట్లోని స్థలాన్ని ప్రభావవంతంగా వాడుతున్నట్లు. ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత! ఇంట్లో పడక గదిలో కంటే లివింగ్ రూంలో ఎక్కువ సమయం గడిపేవారికి.. పడక గది విస్తీర్ణం తగ్గించుకుని లివింగ్ రూం విస్తీర్ణం పెంచుకోవాలి. ఇంటిని సమర్థంగా వాడుకోవానుకున్నా, విశాలంగా కనిపించాలన్నా సహజంగా వెలుతురు వచ్చేలా ఇంటిని డిజైన్ చేసుకోవాలి. ఇందుకోసం పెద్ద కిటికీలు క్రాస్ వెంటిలేషన్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి. దాంతో కొంతమేర కరెంట్ బిల్లు కూడా ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. -
ఏడాది చివరికి పూర్తి ‘ఆవాస్’..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించే లక్ష్యంతో చేపట్టిన ప్రధాని మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకాన్ని ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని కేంద్ర లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి ఆదేశాలిచ్చింది. పీఎంఏవై(అర్బన్) కింద పట్టణ ప్రాంతాల్లో మొత్తం రూ.2 లక్షల కోట్లతో 1.18 కోట్ల గృహాలు నిర్మించాలని కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇందులో ఇప్పటికే 76 లక్షల గృహాలు పూర్తయినట్లు కేంద్రం వెల్లడించింది. మరో 42 లక్షల గృహాల నిర్మాణాలను ఈ ఏడాది డిసెంబర్ నాటికే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం తెలంగాణలో 2.50 లక్షల గృహాలకు మంజూరులివ్వగా, ఇందులో 2.23 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటికే కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన రూ.4,475 కోట్లకు గాను ఇప్పటివరకు రూ.3,314 కోట్లు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 21.32 లక్షల గృహాలకు మంజూరునివ్వగా, ఇందులో 7.95 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తయ్యాయి. దీనికై కేంద్రం తన వాటాగా రూ.32,499 కోట్లకు గాను రూ.20,045 కోట్లు విడుదల చేసింది. ఇక పీఎంఏవై(గ్రామీణ్) కింద కేంద్రం మొత్తంగా 2.93 కోట్ల గృహాల నిర్మాణాలను మంజూరులివ్వగా, అందులో 2.40 కోట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 53 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తికావాల్సి ఉంది. -
మహిళలకే గృహలక్ష్మి అవకాశం... రూ. 3 లక్షల వరకు సాయం
మోర్తాడ్(బాల్కొండ) : సొంతంగా జాగా ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే వారికి వందశాతం రాయితీపై రూ. 3 లక్షల సాయం అందించడానికి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ‘గృహలక్ష్మి’ పథకం కింద మహిళా లబ్ధిదారులకే అవకాశం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం కేటాయింపులను తక్కువ సంఖ్యలో కొనసాగిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఇళ్లను నిర్మించుకునే పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి రూ. 1.50 లక్షల వరకు సాయం అందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత గృహ నిర్మాణ సంస్థను ప్రభుత్వం ఎత్తివేసింది. హౌసింగ్ కార్పొరేషన్లో పనిచేసిన ఉద్యోగులను వివిధ శాఖల్లో విలీనం చేశారు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలోనే డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంను కొనసాగించారు. తాజాగా ఇంటి నిర్మాణానికి ఆర్థికసాయం అందించే పథకం తొమ్మిదేళ్ల తర్వాత పునరుద్ధరణకు నోచుకుంది. ప్రతి నియోజకవర్గం పరిధిలో మొదటి విడతలో 3 వేల చొప్పున ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం అందించనున్నారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి రూ. 30 కోట్ల నిధులు అవసరం కానున్నాయి. జిల్లాలో ఐదు నియోజకవర్గాలతో పాటు బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు ఉన్నాయి. అంటే జిల్లాకు గృహలక్ష్మి పథకం కింద రూ.165 కోట్ల వరకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇంటి నిర్మాణానికి సాయం కోసం దరఖాస్తు చేసుకునేవారు స్థానికులై ఉండటమే కాకుండా తెల్ల రేషన్‌కార్డును కలిగి ఉండటంతో పాటు ఓటరై ఉండాలనే నిబంధన విధించారు. ఓటరు కార్డును దరఖాస్తు ఫారంతో జత చేయాల్సి ఉంది. ఓటరు కాని వారికి గృహలక్ష్మి పథకం వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. వరం కాదు భారమే.. గృహలక్ష్మి పథకం కింద అందే సాయం తక్కువగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇనుము, ఇటుకలు, ఇసుక ఇతరత్రా సామగ్రి ధరలు విపరీతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి నిర్మాణం పేదలకు భారం అవుతుంది. రూ. మూడు లక్షలతో ఇంటిని నిర్మించుకోవడం కష్టమని అందువల్ల సాయం విలువను పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. రెండు గదులు, బాత్రూం, టాయ్లెట్లను నిర్మించాలంటే కనీసం రూ. 8 లక్షల వరకు ఖర్చవుతుందని నిపుణులు చెబుతున్నారు. -
స్థలం కొనుగోలుకు రుణం.. ఇల్లు కట్టుకునే వారికి ప్లాట్ రుణాలు
ఆకర్షణీయమైన ధరకు ప్లాట్ (స్థలం) విక్రయానికి ఉందని తెలిసినప్పుడు.. అందుబాటులో డబ్బు ఉండకపోవచ్చు. అటువంటి అవకాశం మళ్లీ రాదనుకుంటే, కొనుగోలుకు అప్పు తీసుకోవడం ఒక్కటే మార్గం. తెలిసిన వారి దగ్గర బదులు తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆశ్రయించాలా? లేక బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్బీఎఫ్సీ) తలుపు తట్టాలా? అసలు స్థలం కొనుగోలుకు రుణం లభిస్తుందా? ఎన్నో సందేహాలు వస్తాయి. ప్లాట్ కొనుగోలు చేసి ఇల్లు కడదామనుకునే వారు.. పెట్టుబడి కోణంలోనూ ప్లాట్‌ను కొనుగోలు చేసేవారూ ఉన్నారు. వీరి కల సాకారం కోసం అందుబాటులో ఉన్న మార్గాలేమిటో తెలియజేసే కథనమే ఇది. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ప్లాట్ కొనుగోలుకు రుణాలను (ప్లాట్ లోన్స్) ఆఫర్ చేస్తున్నాయి. కానీ, ఆ ప్లాట్ ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తున్నదై ఉండాలి. పెట్టుబడి కోణంలో ప్లాట్ కోసం రుణం తీసుకోవాలంటే వేరే మార్గాలను వెతుక్కోవాల్సిందే. ఇంటి కొనుగోలు కోసమే ప్లాట్‌ను సమకూర్చుకునే వారికి రుణం సులభంగానే లభిస్తుంది. నివాస యోగ్యమైన ప్లాట్‌ను రుణంపై కొనుగోలు చేసుకుంటే.. ఆ తర్వాత రుణ ఒప్పందం మేరకు 1–3 ఏళ్లలోపు ఇంటిని నిర్మించాల్సి ఉంటుంది. వీటినే ప్లాట్ లోన్స్గా చెబుతారు. రుణం తీసుకుని నివాస యోగ్యమైన ప్లాట్‌పై ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత ఇల్లు కట్టలేదనుకోండి. కావాలని ఇల్లు కట్టకుండా వదిలేసే వారు ఉంటారు. పలు రకాల కారణాల వల్ల ఇల్లు కట్టడానికి వీలు పడని పరిస్థితులూ ఉండొచ్చు. నిజానికి ప్లాట్ లోన్ తక్కువ వడ్డీ రేటుపై లభిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేస్తుండడమే ఇందుకు కారణం. రుణ ఒప్పందంలో పేర్కొన్న కాల వ్యవధిలోపు ఇంటిని నిర్మించి, పూర్తయినట్టు సర్టిఫికెట్ బ్యాంకుకు సమర్పించకపోతే.. అప్పుడు ఆ రుణం సాధారణ రుణంగా మారుతుంది. బ్యాంకులు అదనపు వడ్డీరేటును వసూలు చేస్తాయి. ఒప్పందం చేసుకున్న నాటి నుంచి రుణంపై 2–3 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటును అమలు చేసే స్వేచ్ఛ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు ఉంటుంది. దీనివల్ల అదనపు వడ్డీ భారం పడుతుందని అర్థం చేసుకోవాలి. ఒప్పందంలో పేర్కొన్న కాలవ్యవధి ముగిసిన తర్వాత కూడా రుణ గ్రహీత బ్యాంకులను సంప్రదించని పరిస్థితుల్లో.. బ్యాంకులే కస్టమర్లకు సందేశం పంపిస్తాయి. అప్పటికీ స్పందించకపోతే అప్పుడు సాధారణ రుణంగా వర్గీకరించి ఆ మేరకు చర్యలు తీసుకుంటాయి. అదనపు వడ్డీ భారాన్ని భరించేందుకు సిద్ధంగా ఉంటేనే ప్లాట్‌లో ఇంటిని నిర్మించకుండా ఉండొచ్చన్నది దృష్టిలో పెట్టుకోవాలి. ప్లాట్ లోన్ అర్హతలు 18–70 ఏళ్ల వారు ప్లాట్ లోన్‌కు అర్హులు. సిబిల్ స్కోరు కనీసం 650కు పైన ఉండాలి. గరిష్టంగా 15 ఏళ్ల కాల వ్యవధిలో చెల్లించే విధంగా ప్లాట్ లోన్ మంజూరవుతుంది. రుణం ఇచ్చే ముందు.. ఆ ప్లాట్ కొనుగోలు ప్రదేశం, ఎందుకోసం కొనుగోలు చేస్తున్నారు, తిరిగి చెల్లించే సామర్థ్యం, గత రుణాల చెల్లింపుల చరిత్ర ఇలా ఎన్నో అంశాలను బ్యాంకులు చూస్తాయి. లోన్ టు వ్యాల్యూ లోన్ టు వ్యాల్యూ అన్నది ప్రాపర్టీ విలువలో లభించే రుణంగా అర్థం చేసుకోవాలి. ఇంటి నిర్మాణానికి అయ్యే వ్యయంలో గరిష్టంగా 85–90 శాతం వరకు రుణాన్ని (లోన్ టు వ్యాల్యూ/ఎల్టీవీ) బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అదే ప్లాట్ కోసం అయితే ఎల్టీవీ 60–70 శాతం మధ్యే ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని కొనుగోలుదారులు స్వయంగా సమకూర్చుకోవాలి. సేల్‌డీడ్‌లో పేర్కొన్న విలువను ప్లాట్ విలువగా బ్యాంకులు పరిగణిస్తాయి. కొన్ని ప్రైవేటు బ్యాంకులు మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుని రుణం ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయి. రుణం తీసుకునే ముందు విచారిస్తే ఈ విషయంపై స్పష్టత లభిస్తుంది. పైగా కొన్ని బ్యాంకులు సేల్డీల్ వ్యాల్యూ లేదా మార్కెట్ వ్యాల్యూలో రుణాన్ని 60 శాతానికే పరిమితం చేస్తున్నాయి. సమాచార లోపం కొన్ని సందర్భాల్లో మధ్యవర్తులు తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వొచ్చు. ప్లాట్ రుణం తీసుకుని, అందులో ఇల్లు కట్టకపోయినా ఫర్వాలేదు? అన్న మాట వినిపిస్తే అది నిజం కాదని గుర్తించాలి. వారు తమ స్వప్రయోజనాల కోసమే అలా చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. అంతకీ అనుమానం ఉంటే లోన్ డాక్యుమెంట్‌ను ఒక్కసారి సమగ్రంగా చదవాలి. ప్రతి ఒక్కరికీ ఆవాసం కల్పించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యం. అందులో భాగంగానే తక్కువ రేటుపై ప్లాట్ రుణాలను బ్యాంకులు మంజూరు చేస్తుంటాయి. అలాకాకుండా రుణం తీసుకుని కొనే ప్లాట్.. భవిష్యత్తులో లాభం కోసం విక్రయించేది అయితే అందుకు తక్కువ వడ్డీ రేటుపై రుణాలను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదని తెలుసుకోవాలి. ఇంటిని నిర్మించేట్టయితే బ్యాంకులకు రుణం చెల్లింపులపై భరోసా లభించడం కూడా తక్కువ రేటుకు ఇవ్వడానికి ఒక కారణం. పైగా ఇంటి నిర్మాణం చేస్తే దానిపై ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది. లేదంటే అందులో నివాసం ఉంటే రుణ గ్రహీత ఇంటి అద్దె రూపంలో కొంత ఆదా చేసుకోవచ్చు. ఆ మొత్తాన్ని రుణ ఈఎంఐల చెల్లింపునకు వెసులుబాటుగా బ్యాంకులు చూస్తాయి. ఒక్కటే రుణం? కొన్ని బ్యాంకులు ప్లాట్ కొనుగోలుకు, తర్వాత అందులో ఇంటి నిర్మాణానికీ రుణం ఇస్తున్నాయి. ఎస్బీఐ అయితే ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు చేసిన 2–3 ఏళ్ల తర్వాత గృహ రుణాన్ని జారీ చేస్తోంది. కానీ, ఈ రెండు రుణాలకు వేర్వేరు ఖాతాలు ఉంటాయి. వడ్డీ రేటులోనూ స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ, కొన్ని బ్యాంకులు ఒక్కటే రుణం ఇచ్చేందుకూ ముందుకు వస్తున్నాయి. ఒప్పందంలో ఇందుకు సంబంధించి వివరాలు ఉంటాయి. మంజూరు చేసే రుణంలో ప్లాట్‌కు ఎంత, ఇంటి నిర్మాణానికి ఎంతన్న వివరాలు కూడా ఉంటాయి. పన్ను ప్రయోజనాలు ప్లాట్ కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులపై ఎటువంటి పన్ను ప్రయోజనాలు లే వు. పన్ను ప్రయోజనం కావాలనుకుంటే ఒక్కటే రుణంగా (ప్లాట్, ఇల్లు) తీసుకుని వెంటనే ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక్కటే మార్గం. అప్పుడు అసలు, వడ్డీ చెల్లింపులపై ఒక ఏడాదిలో రూ.3.5 లక్షల వరకు పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. వీటిని గుర్తుంచుకోవాలి.. ► ప్లాట్‌లో ఇంటిని నిర్మించేట్టు అయితేనే రుణం తీసుకోవాలి. ► ప్లాట్, ఇంటి నిర్మాణానికి కలిపి ఒక్కటే రుణం మంజూరు చేస్తుంటే.. ముందు ప్లాట్ కోసం ఒక పర్యాయం, ఇంటి నిర్మాణ సమయంలో మిగిలిన భాగాన్ని బ్యాంకులు ఇస్తాయి. ఇంటి నిర్మాణానికి కూడా ముందుగానే రుణం తీసుకుంటే వడ్డీ భారం ఎక్కువ అవుతుంది. ► ఒకవేళ రుణంపై ప్లాట్‌ను కొనుగోలు చేసిన ఏడాది లేదా రెండేళ్లకు ఇల్లు కట్టకుండానే విక్రయించారనుకోండి. అప్పుడు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయో విచారించాలి. అటువంటప్పుడు వాటిని సాధారణ/పర్సనల్ లోన్‌గా పరిగణించి అదనపు వడ్డీ, చార్జీలు వసూలు చేయవచ్చు. ► ప్లాట్ లొకేషన్ కూడా కీలకం. మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే కొనుగోలు చేస్తున్న ప్లాట్ ఉండాలి. గ్రామాల్లో ప్లాట్ కొనుగోలుకు రుణం మంజూరు కాదు. ► అలాగే, పారిశ్రామిక ప్రాంతంలోని ప్లాట్‌కు, వ్యవసాయానికి వినియోగించే ప్లాట్‌కు కూడా రుణం మంజూరు కాదు. ► ఇంటి కోసం రుణాన్ని 30 ఏళ్ల కాలవ్యవధిపైనా తీసుకోవచ్చు. అదే ప్లాట్ రుణం 15–20 ఏళ్లకే పరిమితం అవుతుంది. ► ప్లాట్ రుణానికి గరిష్ట పరిమితి కూడా ఉంది. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు బ్యాంకులు పరిమితులు విధిస్తున్నాయి. ► రుణాన్ని ముందుగా చెల్లిస్తే అదనపు చార్జీలు చెల్లించాలేమో విచారించుకోవాలి. ఈ చార్జీలపై అధికారులను అడిగి తెలుసుకోవాలి. ► కొనుగోలు చేస్తున్న ప్లాట్‌కు రుణం వస్తుందా? లేదా? ముందే స్పష్టం చేసుకోవాలి. పెట్టుబడి కోసం అయితే..? ఇంటి నిర్మాణానికి కాకుండా పెట్టుబడి కోణంలో ప్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుంటే.. అందుకు ప్రత్యామ్నాయాలను చూడాల్సి ఉంటుంది. అప్పటికే మీకు ఏదైనా ప్రాపర్టీ ఉంటే.. లోన్ ఎగైనెస్ట్ ప్రాపర్టీ (ఎల్ఏపీ)ని తీసుకోవచ్చు. నివాస, వాణిజ్య ప్రాపర్టీలను బ్యాంకులకు హామీగా ఉంచితే, రుణం లభిస్తుంది. ఇలా తీసుకునే రుణా న్ని ఏ అవసరం కోసమైనా వినియోగించుకునే స్వేచ్ఛ రుణగ్రహీతకు ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధిపై ఈ రుణం లభిస్తుంది. ప్రాపర్టీ ఏమీ లేని వారు.. బంగారం ఉంటే దాన్ని తనఖా ఉంచి రుణాలను తీసుకోవచ్చు. బ్యాం కులు బంగారం రుణాలను 7.2–7.8శాతానికే ఆఫర్ చేస్తున్నా యి. వీటి కాల వ్యవ« ది 1–3 ఏళ్లే ఉంటుంది. కాల వ్యవధి తర్వాత చెల్లించే వెసు లుబా టు లేకపోతే రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ మార్గం లేకపోతే, ప్లాట్ చౌకగా వస్తుంటే చివరిగా వ్యక్తిగత రుణం కూడా ఒక ఆప్షన్ అవుతుంది. కాకపోతే 10–12శాతం వరకు వడ్డీ రేటు భరించాల్సి ఉంటుంది. -
ఓరి నీ ప్రేమ ‘తాజ్‌మహల్’ కాను!
తాజ్ మహల్.. దేశంలోనే ఓ అద్భుతమైన కట్టడం! మొగల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధంగా నిర్మించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ వ్యక్తి తన భార్య కోసం ఏకంగా తాజ్‌మహల్‌ను నిర్మించాడు! ఒరిజనల్ తామ్మహల్ కట్టాడా? అని ఆశ్చర్యపోకండి. అచ్చం తాజ్‌మహల్ రేంజ్ ఆకృతిలో ఓ ఇంటిని నిర్మించాడు. వివరాల్లోకి వెళ్లితే.. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్‌కు చెందిన ఆనంద్ ప్రకాష్ చౌక్సే అనే ఓ విద్యావేత్త తన భార్య మంజుషా చౌక్సేకు గిఫ్ట్‌గా అచ్చం తాజ్‌మహల్‌ను పోలిన ఇంటిని నిర్మించాడు. ఇందులో నాలుగు బెడ్ రూంలను ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఈ జంట ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను సందర్శించారు. అయితే తాజ్‌మహల్ అందానికి ముగ్దులైన ఈ జంట.. దాని ఆర్కిటెక్షర్‌ను, నిర్మాణ విషయాలను అక్కడి ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అయితే ముందుగా ఆనంద్ ప్రకాష్ చౌక్సే.. తన ఇంటిని సుమారు 80 ఫీట్ల ఎత్తులో నిర్మించాలని భావించారు. కానీ, 80 ఫీట్ల ఎత్తులో ఇంటిని కట్టడానికి అక్కడి అధికారులు అనుమతించలేదు. దీంతో తక్కువ ఎత్తులో ఉన్నా తాజ్‌మహల్‌లో ఆకృతిలో తన ఇంటిని కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు. అద్భుతమైన ఇంటిని నిర్మించడానికి ఇంజనీర్లకు సుమారు మూడేళ్ల సమయం పట్టింది. ఇంజనీర్లు ఈ నిర్మాణాన్ని 3D ఇమేజ్ పద్దతిలో రూపొందించారు. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంటిని నిర్మించిన ఇంజనీర్ ప్రవీణ్ చౌక్సే స్పందిస్తూ.. ‘మొత్తం 90 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఈ ఇల్లు ఉండగా.. ప్రధానమైన తాజ్‌మహల్ ఆకృతి 60 స్క్వేర్ మీటర్ల పరిధిలో విస్తరించింది. డోమ్ 29 ఫీట్ల ఎత్తులో ఉండగా.. రెండు బెడ్ రూంలతో రెండు ఫోర్లు ఉన్నాయి. ఈ ఇంటిలో వంటగది, లైబ్రరీ, ధ్యానంరూంలు కూడా ఉన్నాయి. అయితే ఇంటిని నిర్మించే ముందు ఆగ్రా తాజ్‌మహల్‌ను సందర్శించాను’ అని తెలిపారు. -
ఇన్‌స్టంట్‌గా ఇంటికి అనుమతి
సాక్షి, హైదరాబాద్ : భవన, లేఅవుట్ల అనుమతుల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకోనున్నాయి. జాప్యానికి, అవినీతికి అడ్డుకట్ట పడనుంది. భవన నిర్మాణ అనుమతులను ఇంట్లో కూర్చొని ఇన్స్టంట్(తక్షణం)గా పొందవచ్చు. భవనాలు, లే అవుట్ల అనుమతుల జారీలో అవినీతి నిర్మూలన, సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతుల జారీ నిమిత్తం కొత్త పాలసీ అమలులోకి రానుంది. పరిశ్రమల స్థాపనకు సత్వర అనుమతులిచ్చేందుకు ఆరేళ్ల కింద తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ పాలసీ స్ఫూర్తిగా రూపకల్పన చేసిన టీఎస్–బీపాస్ విధానాన్ని బుధవారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ పాలసీకి చట్టబద్ధత కల్పించేందుకు ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో దీనిని అమలు చేయనుంది. 75 చదరపు గజాల ఇళ్లకు అనుమతి అక్కర్లేదు.. ఏడు మీటర్ల ఎత్తుతో 75 చదరపు గజాల ప్లాట్‌లో భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. భవనం నిర్మించడానికి దరఖాస్తుదారులు ఆన్లైన్లో రిజిస్ట్రర్ చేసుకుని టోకెన్ ఫీజుగా రూ.1 చెల్లిస్తే సరిపోనుంది. (టోకెన్ ఫీజుతోపాటు తొలి ఆస్తిపన్నుగా రూ.100 చెల్లించడం ఐచ్ఛికం). ప్లాటు సైటు, ఫ్లోర్ల సంఖ్యను తెలపడంతోపాటు సదరు స్థలం ప్రభుత్వ స్థలం/చెరువులు/ఇతర నిషేధిత భూమికాదని స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది. స్వీయ ధ్రువీకరణతో తక్షణ అనుమతి 75 నుంచి 600 చదరపు గజాల వరకు (500 చదరపు మీటర్లు) ప్లాట్లలో 10 మీటర్ల ఎత్తు వరకు భవన నిర్మాణానికి స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు నిర్దేశిత ఫీజులు చెల్లిస్తే ఆన్లైన్లో తక్షణ అనుమతులు(ఇన్స్టంట్ పర్మిషన్æ) జారీ కానున్నాయి. జీహెచ్ఎంసీలో జోనల్ కమిషనర్, జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ కమిటీ స్వీయ ధ్రువీకరణ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించనుంది. ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు పొందినట్టు తేలితే సదరు అనుమతులను అధికారులు ఉపసంహరించుకుంటారు. స్వీయ ధ్రువీకరణ ద్వారా జారీ చేసిన అన్ని అనుమతులను టీఎస్–బీపాస్ వెబ్సైట్లో ప్రదర్శన కోసం ఉంచనున్నారు. వీటిపై ఎవరైనా 21 రోజుల్లోగా అభ్యంతరం తెలియజేయడానికి అవకాశం కల్పించనున్నారు. భారీ భవనాలకు 21 రోజుల్లో అనుమతులు 600 చదరపు గజాల(500 చదరపు మీటర్ల) పైన ఉన్న స్థలంలో నివాస భవనాలు, 10 మీటర్లకుపైగా ఎత్తైన నివాస భవనాలు, అన్ని నాన్ రెసిడెన్షియల్ భవనాలు, లేఅవుట్లకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులను సింగిల్ విండో విధానంలో జారీ చేయనున్నారు. ఇంటి అనుమతుల కోసం వచ్చే దరఖాస్తుల్లో 95 శాతం 600 చదరపు గజాలలోపు స్థలాలకు సంబంధించినవే ఉంటాయి. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పిస్తే సరిపోనుంది. అనుమతుల కోసం ఏ ప్రభుత్వ శాఖనూ సంప్రదించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పరిశీలన అనంతరం 21 రోజుల్లో అనుమతి జారీ చేయాలి. లేని పక్షంలో 22వ రోజు ఆన్లైన్లో ఆటోమెటిక్‌గా పర్మిషన్ జనరేట్ కానుంది. ఇలా ఆటోమెటిక్‌గా జారీ చేసిన అనుమతుల కోసం తప్పుడు సమాచారం ఇవ్వడం/ భవన నియమాళిని ఉల్లంఘించడం/ మాస్టర్ ప్లాన్ భూవినియోగం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్టు తేలితే అనుమతుల జారీ తేదీ నుంచి 21 రోజుల్లోగా వాటిని ఉపసంహరించుకునే అధికారం సంబంధిత అధికారులు కలిగి ఉంటారు. కలెక్టర్లు, గ్రేటర్ కమిషనర్‌కు కీలక బాధ్యతలు – టీఎస్–బీపాస్ ద్వారా వచ్చే భవన, లేఅవుట్ దరఖాస్తులకు సకాలంలో అనుమతులు జారీ అయ్యేలా జిల్లా స్థాయిలో కలెక్టర్, జీహెచ్ఎంసీలో కమిషనర్ నేతృత్వంలోని జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షించనుంది. – రిజిస్ట్రేషన్/స్వీయ ధ్రువీకరణ కేటగిరీల భవనాలకు అనుమతుల మేరకే నిర్మిస్తున్నారా? లేదా అని ఆకస్మిక తనిఖీలు జరిపేందుకు ఈ కమిటీ బృందాలను ఏర్పాటు చేయనుంది. – అన్ని నడుస్తున్న ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించనుంది. – అక్రమ/అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చిన 48 గంటల్లోగా తనిఖీలు జరిపించనుంది. – ఏవైనా ఉల్లంఘనలు ఉంటే కూల్చివేతలు/ సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకుంది. తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు తప్పుడు సమాచారం/నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్, స్వీయ ధ్రువీకరణ కేటగిరీలో అనుమతులు పొందినట్టు రుజువైతే సంబంధిత నిర్మాణాలను నోటీసు లేకుండా కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి ఉండనుంది. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులపై జరిమానాలు, చర్యలు ఉండనున్నాయి. -
మోదీ ‘రియల్’ బూస్ట్!
న్యూఢిల్లీ: ఆర్థిక మందగమనం, నిధుల లభ్యత తగినంత అందుబాటులో లేక నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుల పూర్తికి ఒక పరిష్కారంతో కేంద్రంలోని మోదీ సర్కారు ముందుకు వచ్చింది. రూ.25,000 కోట్లతో ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధి (ఏఐఎఫ్)ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. నిలిచిన 1,600 ఇళ్ల ప్రాజెక్టులు (అందుబాటు ధరల ప్రాజెక్టులు, మధ్య, తక్కువ ఆదాయ వర్గాల కోసం ఉద్దేశించిన ప్రాజెక్టులు) పూర్తి అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొంది. మొండి బకాయిలు (ఎన్పీఏలు), దివాలా చర్యల కోసం దాఖలైన ప్రాజెక్టులూ ఈ నిధిని పొందేందుకు అర్హమైనవిగా తాజాగా నిర్ణయించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరాలు వెల్లడించారు. రూ.25,000 కోట్ల ఏఐఎఫ్ నిధిలో కేంద్రం తన వాటా కింద రూ.10,000 కోట్లు సమకూరుస్తుందని, మిగిలిన మొత్తాన్ని ఎల్ఐసీ, ఎస్బీఐ అందిస్తాయని తెలిపారు. నిలిచిపోయిన మొత్తం 4.58 లక్షల ఇళ్ల యూనిట్లను పూర్తి చేసే లక్ష్యంతోపాటు, ఉపాధి కల్పన, సిమెంట్, ఐరన్, స్టీల్ రంగాల్లో డిమాండ్ పున రుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ పథకం గురించి సెప్టెంబర్ 14నే ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. అయితే, రుణాలు చెల్లించలేక ఎన్పీఏలుగా మారిన ప్రాజెక్టులు, ఎన్సీఎల్టీ వద్దకు వెళ్లిన ప్రాజెక్టులను నాడు మినహాయించారు. తాజాగా వీటికీ ఏఐఎఫ్ ద్వారా నిధులివ్వాలని నిర్ణయించారు. సవరించిన ఈ పథకానికి ప్రధాని మోదీ అధ్యక్షతన గల కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు సీతారామన్ తెలిపారు. కాకపోతే రెరా రిజిస్ట్రేషన్ ఉండి, సానుకూల నికర విలువ ఉ న్న ప్రాజెక్టులకే నిధుల సాయం ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సౌర్వభౌమ, పెన్షన్ ఫండ్స్ భాగస్వామ్యంతో ఈ నిధి మొత్తాన్ని పెంచే అవకాశం కూడా ఉందన్నారు. రుణం తీసుకుని ఇంటిని కొనుగోలు చేసి, అవి స్వాధీనం కాకుండా ఈఎంఐలు చెల్లించే వారి సమస్యను పరిష్కరించినట్టు చెప్పారు. కొనుగోలుదారులకు ఉపశమనం ప్రభుత్వ నిర్ణయం ఇళ్ల కొనుగోలుదారుల (డబ్బులు చెల్లించి ఇళ్లను పొందలేనివారు)కు ఉపశమనం కల్పిస్తుంది. డిమాండ్ పడిపోయిన రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్‌కు ఊతం ఇస్తుంది. – అనుజ్‌పూరి, ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ అన్‌రాక్ చైర్మన్ సమస్యకు పరిష్కారం ఇళ్ల కొనుగోలుదారుల దీర్ఘకాలిక సమస్యకు ఇది పరిష్కారం తో పాటు ప్రయోజనం కూడా చేకూరుస్తుంది. తొలుత ప్రకటన(సెప్టెంబర్ 14)లో చేసిన మార్పు ఆహ్వాననీయం. ఇప్పుడు నిధుల సాయం పొందేందుకు నిర్దేశించిన ఏకైక అర్హత సానుకూల నికర విలువ కలిగి ఉండడమే... ఎన్పీఏ లేదా ఎన్సీఎల్టీ ముందున్న ప్రాజెక్టు అయినా సరే, నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయించడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు భరోసా ఇస్తోంది. – జక్సయ్ షా, క్రెడాయ్ చైర్మన్ -
పేరు ఒకరది.. ఇల్లు మరొకరికి
జలదంకి: పేదల కోసం ప్రభుత్వం మంజూరుచేసే గృహాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. జలదంకి అరుంధతీయ కాలనీకి చెందిన సూరిపోగు అంజయ్య కుమారుడు మాల్యాద్రికి అధికారులు ఇల్లు మంజూరు చేశారు. కాలనీలో నిర్మాణాలను టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్‌గా మారి చేపట్టాడు. ఇల్లు మంజూరైన మాల్యాద్రికి నిర్మించకుండా కాలనీలో అదే పేరుతో ఉన్న మరొక వ్యక్తికి నిర్మించారు. మంజూరైన వ్యక్తి అకౌంట్లో రెండు దఫాలుగా రూ.1.20 లక్షలు జమచేశారు. దీంతో అధికారులు, కాంట్రాక్టర్ మాల్యాద్రిని రూ.70 వేలు పెద్దమనుషుల వద్ద పెట్టి న్యాయం చేస్తామని చెప్పడంతో నగదు ఇచ్చాడు. తిరిగి మరో బిల్లు రూ.50 వేలు అకౌంట్లో పడటంతో ఆ నగదును కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే మరో మాల్యాద్రి మాత్రం తనకు ఇల్లు మంజూరైనట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఇప్పుడు నగదును మొత్తం మీరు తీసుకుంటే తనకు ఎప్పటికీ ఇల్లు వచ్చే అవకాశంలేదని, నేను పూరి గుడిసెలో ఉన్నానని రూ.50 వేలు ఇవ్వనని చెప్పాడు. దీంతో అతనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మాల్యాద్రి పోలీసుల వద్ద విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం అడుగుతానని తెలిపాడు. జలదంకి మండలంలో హౌసింగ్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని, 7, 8 సంవత్సరాల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. -
శ్రీ దుర్ముఖి నామ సంవత్సర రాశి ఫలాలు
మేషం (ఆదాయం -2, వ్యయం-8, రాజపూజ్యం-1, అవమానం-7) వీరికి ఆగస్టు 11 వరకు గురుడు పంచమ స్థానంలోనూ, తదుపరి షష్ఠమంలోనూ, శని జనవరి 26వరకు అష్టమంలోనూ, తదుపరి భాగ్యస్థానంలోనూ, రాహుకేతువులు ఈ ఏడాదంతా పంచమ, లాభస్థానాలలో సంచారం. కుజుడు జూలై 12 నుంచి సెప్టెంబర్ 18వరకు అష్టమ స్థానమైన వృశ్చికంలో సంచారం. ఈరీత్యా పరిశీలిస్తే వీరిపై అష్టమ శని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ఆగస్టు వరకు గురుబలం కొంత తోడ్పడుతుంది. తదుపరి గురుడు కూడా దోషకారి. మొత్తం మీద వీరు చేపట్టిన కార్యక్రమాలు ఆగస్టు వరకు చకచకా సాగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. అయితే ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. ఇతరుల చేత మాటపడాల్సిన సమయం. కుటుంబ సమస్యలు సవాలుగా మారతాయి. ఓర్పు,నేర్పుతో వ్యవహరించడం మంచిది. అలాగే, జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో కుజుని అష్టమస్థితి అంత అనుకూలం కాదు. ప్రథమార్ధంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు, వివాహయత్నాలు ఫలిస్తాయి. వాహన, ఆస్తి లాభ సూచనలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. ఆగస్టు నుంచి అన్ని విషయాల్లోనూ అప్రమత్తత అవసరం. ముఖ్యంగా ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. జలుబు వంటి రుగ్మతలు బాధించవచ్చు. వ్యాపార వర్గాలకు లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకోని బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు ఎంతగా కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి. నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యవసాయదారులకు మొదటి పంట లాభిస్తుంది. విద్యార్థులకు శ్రమానంతరం అనుకూల ఫలితాలు దక్కే అవకాశం. కళాకారులకు ప్రారంభంలో అనూహ్యమైన విజయాలు, తదుపరి నిరాశ తప్పకపోవచ్చు. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆశించిన పదవులు కష్టమే. వీరు శనికి తైలాభిషేకాలు, ఆగస్టు తర్వాత గురునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. చైత్రం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. మిగతావి సామాన్యంగా ఉంటాయి. అదృష్టసంఖ్య-9, పగడం ధరించవచ్చు. ఎరుపు, గులాబీ రంగులు అనుకూలం.వృషభం (ఆదాయం -11, వ్యయం-14, రాజపూజ్యం-4, అవమానం-7) వీరికి ఆగస్టు 11వరకు గురుడు అర్ధాష్టమమైన సింహంలోనూ తదుపరి పంచమమైన కన్యారాశిలో సంచారం. శని జనవరి 26వరకు సప్తమమైన వృశ్చికంలోనూ, తదుపరి అష్టమమైన ధనుస్సు రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు ఈఏడాదంతా అర్ధాష్టమైన సింహం, దశమమమైన కుంభరాశిలో సంచారం. వీరికి ఈ ఏడాది ఆగస్టు నుంచి జనవరి వరకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆగస్టు వరకు అర్ధాష్టమంలోని రాహువుతో గురుని చేరిక వల్ల కొన్ని ఇక్కట్లు తప్పకపోవచ్చు. ముఖ్యంగా చేపట్టిన పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆప్తులు సైతం మీ మంచితనాన్ని తేలిగ్గా తీసుకుని సమస్యలు సృష్టించవచ్చు.ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం తగదు. ముఖ్యంగా నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడ వచ్చు. తరచూ ప్రయాణాలు చేయాల్సివస్తుంది. మిత్రులు, జీవిత భాగస్వామితో విభేదాలు నెలకొంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆగస్టు నుంచి గురుసంచారం అనుకూలమైనందున ఆకస్మిక ధనలబ్ధి. గృహ, వాహనయోగాలు ఉండవచ్చు. సంతానరీత్యా మంచి గుర్తింపు పొందుతారు. కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వివాహాది శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. అయితే ఏడాది చివరిలో ఆకస్మిక బదిలీలు జరిగే అవకాశం. పారిశ్రామిక, వాణిజ్యవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు, ప్రభుత్వపరంగా ఆహ్వానాలు కూడా అందుతాయి. రాజకీయవర్గాలకు ద్వితీయార్ధంలో పదవీయోగం. వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. నిరుద్యోగులు ప్రభుత్వ ప్రకటనలతో ఊరట చెందుతారు. కళాకారులు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో శని,కుజులు సప్తమంలో కలయిక అంత అనుకూలం కాదు. దీని కారణంగా భార్యాభర్తల మధ్య కలహాలు, ఉష్ణసంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. చైత్రం, వైశాఖం, శ్రావణం, పుష్యం, మాఘమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. రాహువు, శనికి పరిహారాలు చేయించుకోవాలి. అలాగే, జూలై, సెప్టెంబర్ మధ్యకాలంలో సుబ్రహ్మణాష్టక పఠనంతో పాటు, మంగళవార ం నియమం పాటించడం మంచిది. అదృష్టసంఖ్య-6, వజ్రం ధరించాలి. ఆకుపచ్చ, బంగారు రంగులు అనుకూలం.మిథునం (ఆదాయం -14, వ్యయం-11, రాజపూజ్యం-4, అవమానం-7) ఈ రాశి వారికి గురుడు ఆగస్టు 11వరకు తృతీయమైన సింహం, తదుపరి చతుర్థమైన కన్యారాశిలో సంచారం. అలాగే, శని జనవరి 26వరకు షష్ఠమమైన వృశ్చికంలోనూ తదుపరి సప్తమైన ధనుస్సు రాశిలో సంచారం. రాహుకేతువులు ఈ ఏడాదంతా తృతీయమైన సింహం, భాగ్యస్థానమైన కుంభరాశిలో సంచారం. ఈరాశి వారికి గతం కంటే మెరుగైన కాలమమనే చెప్పవచ్చు. ఆదాయానికి లోటు ఉండదు. శుభకార్యాల నిర్వహణలో బిజీగా గడుపుతారు. ఇతరులకు సహాయం అందించడం ద్వారా దాతృత్వాన్ని చాటుకుంటారు. ఆగస్టు నుంచి గురుని అనుకూల సంచారంతో అదనపు రాబడి పొందుతారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వాహన, గృహయోగాలు సంభవం. స్థిరాస్తి వివాదాలు, కొన్నికోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశం. అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాల సందర్శనం. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలున్నాయి. ఆగస్టు వరకు కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. నరాలు, ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో షష్ఠమస్థానంలో కుజ, శనుల కలయిక కొంత దోషకారకం. ఈకాలంలో వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ప్రత్యర్థుల పట్ల మెలకువగా ఉండండి. వ్యాపారస్తులు ద్వితీయార్ధంలో లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కే అవకాశం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపుతో పాటు, పదవులు దక్కే అవకాశం. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగార్థుల కృషి ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి. కళాకారుల ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. ద్వితీయార్ధంలో అవార్డులు పొందవచ్చు. చైత్రం, వైశాఖం, భాద్రపదం, ఆశ్వయుజం, ఫాల్గుణమాసాలు అనుకూలం. మిగతావి సామాన్యం. వీరు జూలై-సెప్టెంబర్ నెలల్లో కుజ,శనులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.అదృష్టసంఖ్య 5, పచ్చరాయి ధరించాలి. లేత ఎరుపు, పసుపు రంగులు అనుకూలం. కర్కాటకం (ఆదాయం -8, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-3) వీరికి గురుడు ఆగస్టు 11వరకు ద్వితీయమైన సింహంలోనూ, తదుపరి తృతీయమైన కన్యారాశిలో, శని జనవరి 26వరకు అర్థాష్టమైన వృశ్చికంలో, తదుపరి పంచమమైన ధనుస్సు రాశిలో సంచారం. ఇక రాహుకేతువులు ఈ ఏడాదంతా ద్వితీయమైన సింహం, అష్టమమైన కుంభరాశిలో సంచారం. -
66 వేలకే సొంతిల్లు!
ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు.. అన్నారు పెద్దలు. సామాన్య మధ్యత రగతి కుటుంబాలకు ఆర్థికంగా అత్యంత భారమైన పనులివి. సాంకేతిక అభివృద్ధి చాలా రకాల సేవలను తక్కువ ధరకు, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్న వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నా, ఇంటి నిర్మాణంలో సౌకర్యాల అభివృద్ధి జరుగుతోంది కానీ ఖర్చు విషయంలో మాత్రం తగ్గుదల లేదింత వరకూ. సిమెంటు, ఇసుక, ఇటుక, ఇనుము.. ఇలా ప్రతీదీ ఖరీదే. ఇలాంటి పరిస్థితుల మధ్య వియత్నాం పరిశోధకులు సరికొత్త గృహ నమూనాను ఆవిష్కరించారు. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదించిన ఈ ‘ఎస్ హౌస్’ నిర్మాణానికి సంబంధించి తాజాగా నమూనాను ప్రదర్శించారు. కేవలం వెయ్యి డాలర్ల (భారత ద్ర వ్యమానంలో దాదాపు రూ.66 వేలు) ఖర్చుతో పూర్తి నిర్మాణం పూర్తయ్యే ఈ ఇంటి విశే షాలు ఆసక్తికరంగా ఉన్నాయి. - సాక్షి సెంట్రల్‌డెస్క్ ప్రస్తుతం ఈ ఇల్లు ప్రీ మార్కెట్ దశలో ఉంది. త్వరలోనే భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం.. ఆ తర్వాత అమ్మకానికి పెట్టడం అంతే! ఇల్లేమిటి ఉత్పత్తి చేయడం ఏమిటి? అంటే... ఈ ఇంటి విషయంలో అంతే. కాంక్రీట్ ఫౌండేషన్, వుడెన్ ఫ్లోర్, స్టీల్ ఫ్రేమ్, స్టీల్ షీట్ రూఫ్, ఒక స్టీల్ డ్రైనేజ్‌గటర్... వీటిని వేరువేరుగా తయారు చేస్తారు. అన్నింటినీ కలిపి ఒక చోట అమర్చుకుంటే చాలు ఇంటి నిర్మాణం పూర్తి అవుతుంది. మూడు గంటల్లో నిర్మాణం.. 30 ఏళ్ల జీవితం... పై సరంజామాతో ‘ఎస్ హౌస్’ను అమర్చడానికి మూడు గంటల సమయం పడుతుందని రూపకర్తలు చెబుతున్నారు. కనీసం ముప్పై సంవత్సరాల పాటు ఈ ఇంటిలో దర్జాగా నివ సించవచ్చని హామీ ఇస్తున్నారు. ఆ తర్వాత కూడా ఇల్లు చెక్కుచెదరదని అంటున్నారు. 340 చదరపు అడుగుల ఇల్లు ఫార్ములా ప్రకారం వెయ్యి డాలర్ల వ్యయం తో 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటిని నిర్మించుకోవచ్చు. అదనంగా వెచ్చించి ఇంతకంటే విశాలంగా కావాలన్నా నిర్మించుకోవచ్చు, ఒకటికి మించిన స్థాయిలో ఇళ్లను జాయింట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సిమెంట్, ఇసుక అవసరం లేదు ఈ ఫార్ములాలో పేర్కొన్న సరంజామా తప్ప నిర్మాణంలో అదనంగా ఎలాంటి అవసరాలూ ఉండ వు. అక్రమ రవాణా పాలవుతూ ధర విషయంలో కొండెక్కిన ఇసుక కానీ, సిమెంట్ కానీ, ప్రత్యేకంగా ఇనుము కానీ కొనాల్సిన అవసరం ఉండదు. తుప్పుపట్టదు, చెదలు దరిచేరవు ఈ నిర్మాణంలో ఉపయోగించే వుడ్‌కు, స్టీల్‌కు చెద, తుప్పు భయాలుండవని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ముప్పై సంవత్సరాలు గడిచినా కూడా అవి చెక్కుచెదరవని చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలనూ ఎదుర్కొనగలదు.. రాళ్లతో కట్టిన పునాదులేమీ లేకపోయినా, భారీగా ఖర్చు పెట్టకపోయినా... టైపూన్లు, హరికేన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలను కూడా తట్టుకుని నిలబడే స్థాయిలో ఈ నిర్మాణం ఉంటుంది. ప్రస్తుతానికి వియత్నాంలో.. అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల్లోని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో నాలుగేళ్ల క్రితం ‘ఎస్ హౌస్’ ప్రణాళికను ప్రారంభించారు. ఇప్పుడు ఇది ప్రొటోటైప్ దశ వరకూ వచ్చింది. అతి త్వరలోనే వియత్నాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆఫ్రికా, ఆసియా, దక్షిణ అమెరికా ఖండాల పరిధిలోని దేశాల్లోని పేదలందరికీ ఇలాంటి ఇళ్ల నిర్మాణానికి వనరులను సమకూర్చే లక్ష్యం ఉంది రూపకర్తలకు. మరి వారి లక్ష్యం సిద్ధించి... మనదేశంలోని గుడిసెలకు ఇది ప్రత్యామ్నాయంగా మారుతుందని ఆశిద్దాం. -
ఇంటి నిర్మాణం.. ఆలస్యమైతే అమృతం హుళక్కి!
- పెరిగే ధరల భారాన్ని భరించక తప్పదు - జాప్యంతో పన్ను మినహాయింపుల్లోనూ కోత ఆలస్యం.. ఆలస్యం.. ఈ పదాన్ని నిత్యం వింటూనే ఉంటాం. అనుకోని కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది. కొన్ని విషయాల్లో ఆలస్యం వల్లలాభం కలిగితే, మరికొన్ని పనుల్లో ఆలస్యం వల్ల నష్టం తప్పదు. మరి ఇంటి నిర్మాణ పనుల్లో జాప్యం జరిగితే..? ఆ ఇంటి కొనుగోలుదారుడిపై ఈ జాప్యం ప్రభావం ఏ మేర ఉంటుంది? ఎందుకంటే ఇళ్ల నిర్మాణంలో ఇలాంటి జాప్యాలు కొత్త కాదు. కొనుగోలుదారులు వీటిని కూడా దృష్టిలో ఉంచుకోకతప్పదు. అవినాశ్ ఓ ప్రభుత్వోద్యోగి. 2011లో హైదరాబాద్ శివార్లలో ఒక ఇల్లు కొనాలనుకున్నాడు. కొందరు బిల్డర్లతో మాట్లాడాడు. వారిలో ఒక బిల్డర్ 2014 నాటికి (మూడేళ్ల కాలం) ఇంటిని కట్టిస్తామని హామీ ఇచ్చాడు. ఈ మేరకు ఒప్పందం కూడా చేసుకున్నారు. అంతా బాగానే ఉన్నా... మూడే ళ్ల కాలం గడిచిపోయాక కూడా ఇల్లు పూర్తికాలేదు. ఇదేంటని బిల్డర్‌ను ప్రశ్నించాడు అవినాశ్. దీంతో అతనిచ్చిన అడ్వాన్సును తిరిగి ఇచ్చేశాడు బిల్డర్. హమ్మయ్య! అనుకున్నాడు అవినాష్. కానీ అతనికిక్కడ కనిపించని తీవ్రమైన నష్టం జరిగింది. ఎందుకంటే అవినాశ్ అడ్వాన్స్ ఇచ్చినపుడు ఆ ఫ్లాట్ ధర రూ.42 లక్షలు. కానీ మూడేళ్లు గడిచి అడ్వాన్సు వెనక్కి తీసుకునే నాటికి దాని ధర రూ.57 లక్షలకు పెరిగింది. అంటే ఇప్పుడు అవినాశ్ కొత్తగా ఇంటిని కొనాలంటే అదనంగా రూ.15 లక్షలు భరించాలి. నిజానికి ఈ పరిస్థితి ఒక్క అవినాశ్‌దే కాదు. చాలా మంది ఇలాగే ఇబ్బందులు పడుతున్నారు. ప్రాపర్టీ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో బిల్డర్లు వారి డబ్బులను వెనక్కివ్వటం జరుగుతోంది. ఎందుకంటే పాత ధరలకిస్తే లాభాలు తగ్గుతాయని!!. ఈఎంఐలపై కూడా ఇదే నష్టం... ఒక వ్యక్తి ఇంటి కోసం ఫైనాన్స్ కంపెనీ వద్ద 9.7 శాతం వడ్డీరేటుతో 20 ఏళ్ల కాలపరిమితితో రూ.50 లక్షల రుణాన్ని తీసుకున్నాడు. అప్పుడు అతను చెల్లించే ఈఎంఐ నెలకు దాదాపుగా రూ.47,262గా ఉంటుంది. అనుకున్న సమయంలో అతను కొత్త ఇంట్లోకి చేరితే పర్వాలేదు. అలా జరగకపోతే.. అతను అప్పటికే నెలకు రూ.15,000-20,000 వరకు అద్దె చెల్లిస్తూ ఉంటాడు కదా... అప్పుడు అతను ఇటు ఈఎంఐ, అటు అద్దె చెల్లించటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆర్థికంగా పరిస్థితులు తలకిందులైపోతాయి కూడా. పన్ను ప్రయోజనాలూ పోతాయి... ఇంటిపై రుణం తీసుకున్న వారు అనుకున్న సమయానికి ఇల్లు పూర్తికాకపోతే పన్ను తగ్గింపు ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదమూ ఉంది. సాధారణంగా ఇంటి రుణం తీసుకున్న వారు ఆ మొత్తంపై కొంత వరకు (సెక్షన్ 80సీ ప్రకారం... ఏడాదికి రూ.1.5 లక్షల వరకు) పన్ను తగ్గింపును క్లెయిమ్ చేసుకోవడానికి నిబంధనలు అనుమతిస్తున్నాయి. అలాగే వడ్డీ రూపంలో మొత్తంగా రూ.2 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది కూడా రుణం తీసుకున్న ఆర్థిక సంవత్సరం ముగిశాక... మూడేళ్ల లోపు ప్రాపర్టీని స్వాధీనం చేసుకుంటేనే. ఇలాకాని పక్షంలో వడ్డీ మొత్తంలో రూ.30,000 వరకు మాత్రమే పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మాణ దశలో ఉన్నప్పుడు మాత్రం ఎలాంటి పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కానీ ఇంటి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత క్లెయిమ్ పొందవచ్చు. ఈ మొత్తాన్ని ఇంటి నిర్మాణం పూర్తయిన సంవత్సరం నుంచి... ఐదు ఈఎంఐలలో పొందాల్సి ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ఆర్థిక భారాన్ని భరించాలి లేదా నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయించాలి. చేసేదేమీ లేక చాలా మంది నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయిస్తున్నారు. ‘ఢిల్లీ వంటి పట్టణాల్లో డబ్బు రికవరీ కోసం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి’. అని నైట్ ఫ్రాంక్ ఇండియా రెసిడెన్షియల్ ఏజెన్సీ నేషనల్ డెరైక్టర్ ముదసిర్ జైదీ తెలిపారు. ‘భవిష్యత్తులో నిర్మాణ పనుల్లో జాప్యాల వల్ల తలెత్తే సమస్యలు, నష్టాల నుంచి రక్షణ లభించే విధంగా డెవలపర్లు ఒక ఒప్పందాన్ని రూపొందించాలి’ అని యాస్పైర్ హోమ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ అనిల్ సచిదానంద్ పేర్కొన్నారు. -
‘స్వచ్ఛ'...ఇక నిత్యం!
నెలలో ఒక రోజు అధికారులు వస్తారు {పజల సమస్యలు తెలుసుకుంటారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన మండుటెండలో పర్యటన ముగిసిన ‘స్వచ్ఛ హైదరాబాద్’ సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో రెండు లక్షల మంది నిరుపేదలకు డ బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.. లక్ష మందికి ఇళ్ల పట్టాల మంజూరు..చెత్తపై యుద్ధం... పరిశుభ్రతపై మహోద్యమం.... మార్కెట్లు.. బస్తీలు.. మురికివాడల అభివృద్ధికి హామీలు.. ఇవీ చివరి రోజైన బుధవారం ‘స్వచ్ఛ హైదరాబాద్’ విశేషాలు. మండుటెండను సైతం లెక్క చేయకుండా సీఎం కేసీఆర్ నగరంలో ఏకంగా పదికి పైగా ప్రాంతాలను సందర్శించారు. ప్రజలతో మమేకమయ్యారు. స్థానికుల సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. పేదలకు గృహాలను నిర్మించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ నాలుగు రోజులతోనే అయిపోదని.. నెలలో ఒక రోజు అధికారులే ప్రజల వద్దకు వచ్చి వారి సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి... వాటిని పరిష్కరిస్తారని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలపై మేథోమథనం చేసి... సమస్య మూలాలకు వెళ్లి... పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాత నగరం సహా శివార్లలోని ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, మల్కాజ్గిరి నియోజకవర్గాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. -
బిల్లులు అందక ఇందిరమ్మ ఇళ్ల తాకట్టు
ఇప్పటికే పలు ఇళ్ల అమ్మకాలు పలమనేరు డివిజన్లో పెండింగ్ బిల్లులు రూ.1.5 కోట్లు ఇక బిల్లులొచ్చేది అనుమానమే పలమనేరు: పక్కా ఇల్లు పేదవాని కల. అది కలగానే మిగి లింది. అప్పోసప్పో చేసి కట్టిన ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు అందివ్వలేదు. ఫలితంగా ఇంటి నిర్మాణాలకు చేసిన అప్పులకు వడ్డీ మొదలు పెరిగి అదే ఇళ్లను అమ్ముకోవడం, లేదా తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో నిరుపేదల గూళ్లు కళ్లముందే పరులపాలవుతున్నాయి. ఇది పలమనేరు నియోజకవర్గంలో బిల్లులందని ఇందిరమ్మ లబ్ధిదారుల గోడు. పలమనేరు హౌసింగ్ డివిజన్ పరిధిలోనే రూ.1.5 కోట్ల బిల్లులు పెండింగ్ పడ్డాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇళ్ల నిర్మాణాల కోసం ప్రభుత్వం అందజేస్తోన్న రుణం ఏ మూలకూ చాలక చేసిన వడ్డీ తడిసి మోపెడయింది. ఫలి తంగా అసలు, వడ్డీ కట్టలేక అరాకొర నిర్మాణాలను కొందరు తాకట్టు పెడుతున్నారు. మరికొందరు ఇళ్లనే విక్రయించేస్తున్నారు. పలమనేరు హౌసింగ్ డివిజన్లో ఇందిరమ్మ పథకం ద్వారా 2006 నుండి 2014 వరకు దాదాపు 32వేల ఇళ్లు మంజూరయ్యాయి. మున్సిపల్ పరిధిలోని లబ్ధిదారులకు హౌసింగ్ శాఖ రూ.44వేలను (ఎస్సీ, ఎస్టీలకు కాకుండా ఇతరులకు) రుణంగా అందించింది. అదే విధంగా రూరల్‌లో ఇంటి నిర్మాణానికి రూ.33 వేలను రుణంగా ఇచ్చింది. అయితే ఈ డబ్బు ఇంటి నిర్మాణానికి ఏమాత్రం చాలలేదు. భారీగా పెరిగిన నిర్మాణ వ్యయం ప్రభుత్వ నిబంధనల మేరకు ఓ ఇందిరమ్మ ఇంటిని నిర్మించాలంటే రూ.లక్షకు పైగా ఖర్చవుతోంది. దీని నిర్మాణానికి 6వేల ఇటుకలకు రూ.25వేలు, రూ.265 చొప్పున 70 బస్తాల సిమెంట్‌కు రూ.19వేలు, ఇనుముకు రూ.6వేలు, ఇసుక లోడు రూ.1000 చొప్పున ఐదు లోడ్లకు రూ.5వేలు, పునాది రాళ్లు లోడు రూ.1500 చొప్పున 4 లోడ్లకు రూ.6వేలు, ట్యాంకర్లతో నీటిని తెచ్చుకోడానికి రూ.5వేలు, మేస్త్రీ, కూలీలు, తలుపులు, ద్వారబంధనం తదితరాలు, పెయింటింగ్, వైరింగ్ తదితరాలకు మరో రూ.40వేలు అంతా కలిపి దాదాపు లక్ష రూపాయలకు పైగా దాటింది. దీంతో సామాన్యులు ప్రభుత్వం ఇచ్చే రుణంతో ఇందిరమ్మ ఇంటిని కట్టుకొనే పరిస్థితి లేదు. అప్పోసప్పో చేసుకొని ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గత డాది మార్చిలో ఆగిన బిల్లులు గత డాది మార్చి 23నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారులకు బిల్లులు అందలేదు. అప్పట్లో రాష్ట్ర విభజన కారణంగా హౌసింగ్ ఆన్లైన్ వ్యవస్థను ఆపేశారు. దాం తో ఇంటి నిర్మాణాలు సైతం వివిధ దశల్లో ఆగిపోయాయి. కొందరు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. ఇప్పటివరకు వీరికి అందాల్సిన బకాయిలు రూ.1.5 కోట్లు ఇంతవరకు రాలేదు. ఇన్నాళ్లుగా ఎదురుచూసినా ఫలితం లేకుండా పోయింది. కట్టిన ఇళ్లు తాకట్టుకు జమ సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో నూటికి రూ.10తో లబ్ధిదారులు ఎడాపెడా అప్పులు చేశారు. ఆ అప్పులు పెరిగి గుదిబండగా మారాయి. సంవత్సరాలుగా తిరుగుతున్నా బిల్లులేమో చేతికి రాలేదు. దీంతో అప్పు ఇచ్చిన వారు లబ్ధిదారులను వేధింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు కొందరు లబ్ధిదారులు ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టి వాటిని విడిపించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. బిల్లులు వచ్చినప్పుడు వడ్డీ మొదలు వసూలు చేసుకోవచ్చని భా వించి అప్పు ఇచ్చినవారు బిల్లులు రాకపోయే సరికి డబ్బులు చెల్లించండి లేదా ఆ ఇళ్లనే తాకట్టు పెట్టాల ని ఒత్తిడి చేస్తున్నారు. మరికొందరైతే లబ్ధిదారుల వ ర్క్ ఆర్డర్లను సైతం లాగేసుకున్నారు. దీంతోదాదాపు 900 దాకా వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను విక్రయించేశారని తెలుస్తోంది. మరికొందరు ఇదే ఇంది రమ్మ ఇళ్లను స్టాంప్ పేపర్లలో అగ్రిమెంట్లు సైతం చేసేసుకున్నారు. అటు ఇందిరమ్మ ఇంటికి నోచుకోక, చేసిన అప్పులు కట్టలేక బాధతో ఆ ఇళ్లను అమ్మేస్తున్నారు. అధికారులు స్పందించి ఇందిరమ్మ బిల్లులను అందజేయాల్సిన అవసరముంది. ఈవిషయమై హౌ సింగ్ డీఈ అశోకచక్రవర్తిని వివరణ కోరగా రూ.1.5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నమాట నిజమేనన్నారు. అయితే అవి వచ్చే నమ్మకాలు లేవన్నారు. -
గడువు తొమ్మిది రోజులే
ముకరంపుర: ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీ స్థలాలకు సంబంధం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న పేద వారికే ఈ అవకాశం పరిమితం చేసింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం జీవో నెం.58, 59ల జారీ ద్వారా అవకాశం కల్పించింది. జీవోలను డిసెంబర్ 30 న విడుదల చేసినప్పటికీ రెండు రోజుల క్రితమే మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లాలో ఇంతవ రకూ ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. ఈ నెల 19 వరకు తుది గడువుండగా ఆక్రమణలపై.. నిర్మాణాలపై ఎవరూ ముందుకు రాలేదు. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఆక్రమిత నిర్మాణాలున్నప్పటికీ ఇప్పటికీ వరకు స్పందన లేకపోవడంపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్. మీనా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాలని ఆదేశించారు. దరఖాస్తు ఫారాలను అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్బన్ ప్రాంతాలే కీలకం.. పేదల ఆక్రమిత నివాస స్థలాల్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌లో అర్బన్ ప్రాంతాలే కీలకం కానున్నాయి. జిల్లాలోని 11 పట్టణ ప్రాంతాల్లోనే రెగ్యులరైజేషన్‌కు దరకాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఆక్రమిత భూముల వివరాలు ప్రజలు దరఖాస్తు ద్వారానే తెలుసుకునే పరిస్థితి రావడం జిల్లా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది. అయితే ఆక్రమిత నిర్మాణం చేసి తప్పు చేసిన భావనతోనే దరఖాస్తులకు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. రెగ్యులరైజేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించదని జీవో స్పష్టం చేస్తోంది. క్రమబద్ధీకరణకు ఆర్డీవోలు, తహశీల్దార్లనే బాధ్యులు చేశారు. దరఖాస్తులు చేసుకున్న 90 రోజుల్లో ఆ ఇంటికి సంబంధించి మహిళ పేరున పట్టాజారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, శిఖం, నాలాలు, కుంటలు, చెరువులు, పూర్తి నీటి మట్టం పరిధిలోనివి, నీటి ట్యాంకులు, నీటి శుద్ధి ప్రాంతాలు, శ్మశానాలు, మోడల్ టౌన్షిప్లకు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలు, కాలిబాటలు, అత్యంత విలువైన స్థలాలు, నీటి శుద్ధిప్లాంట్లు, గ్రీన్‌బెల్ట్ స్థలాలు, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలను మినహాయించారు. చారిత్రాత్మక వారసత్వ భవనాలు, కట్టడాలు ఉన్న ప్రాంతాల్లోని వాటిని క్రమబద్ధీకరించడం జరిగిందని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టంగా పేరొన్నారు. ఇదీ టారిఫ్.. 125 గజాల స్థలం వరకు ఉచితంగా, 250 గజాలలోపు ఉన్న స్థలానికి బేసిక్ వాల్యూ ప్రకారం 50 శాతం కట్టించుకుని క్రమబద్ధీకరించనున్నారు. 500 గజాల స్థలం వరకు నిబంధనల 75 శాతం డీడీ తీసి దరఖాస్తుతో పాటు జతపర్చాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2వ తేదీ 2014 వరకు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉన్న వారికే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే పట్టణాల్లో రూ.2 లక్షలు, పల్లెల్లో రూ.1.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇంకా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటుబిల్లు, నల్లా బిల్లు, ఇంటి పర్మిషన్ పత్రం వీటిలో ఏదో ఒకటి జతచేసి తహశీల్దార్ కార్యాలయంలో అందించాల్సి వుంటుంది. గడువు పెంచండి.. ఆక్రమిత నివాసస్థలాలోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు మరింత పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్మీనాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మిగిలిన కలెక్టర్లు కూడా ఇదే సమస్యను విన్నవించారు. ఈ నెల 19 లోపు సెలవులు అధికంగా ఉన్నాయని.. మరింత గడువు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని సింగరేణి తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నివాసం ఉంటున్న వారి క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. -
రాజీవ్ స్వగృహను అమ్మేశారు..!
నల్లగొండ, న్యూస్‌లైన్, మధ్య తరగతి కుటుంబాల ఆర్థిక స్థోమతకు అనుగుణంగా సకల సౌకర్యాలతో వివిధ మోడళ్లలో ఇళ్లు నిర్మించి ఇస్తామంటూ.. 2008 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకేంద్రం శివారు పోలీస్ బెటాలియన్ వద్ద ‘రాజీవ్ స్వగృహ’ పేరుతో స్కీంను ప్రారంభించింది. స్వగృహ ప్రారంభిం చిన నాటినుంచి అనేక సమస్యలు చుట్టుము ట్టాయి.నల్లగొండకు పది కిలోమీటర్ల దూరంలో ఉండడం, నిర్మాణంలో నాణ్యత లేకపోవడం వంటి అనుమానాలు అప్పట్లో లబ్ధిదారుల్లో తలెత్తాయి. దీంతో లబ్ధిదారుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో పాటు ప్రభుత్వమూ ఇళ్ల నిర్మాణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. నీరుగారిన లక్ష్యం... ఇంటి నిర్మాణం, స్థలాన్ని బట్టి ఒక్కో ఇల్లు రూ.8 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు ధర నిర్ణయించారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో 317 ఫ్లాట్స్ నిర్మాణం చేపట్టారు. స్వగృహ ప్రారంభ దశలో ఇళ్లు కొనేందుకు 1200 మంది దరఖాస్తు చేశారు. కానీ ఇంటి నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో మరుసటి ఏడాదికి వచ్చేసరికి దర ఖాస్తుదారులు 458 మందికి చేరారు. వీరంతా ఇళ్లు కావాలని కోరుతూ ఒక్కొక్కరు సభ్యత్వం కింద రూ.3 వేలు చెల్లించారు. అప్పటికీ ఇంటి నిర్మాణాలు పూర్తికాకపోవడం, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 155మంది తాము చెల్లించిన సభ్యత్వాన్ని తిరిగి చెల్లించాల్సిందిగా దరఖాస్తు చేశారు. కానీ ప్రభుత్వం నయాపైసా చెల్లించలేదు. మిగిలిన 304 మంది దరఖాస్తుదారులు ఇంటి నిర్మాణ వ్యయంలో 15నుంచి 25శాతం వరకు ముందుగానే సొమ్ము చెల్లించారు. అధికారుల లెక్కల ప్రకారం దరఖాస్తుదారులకు రూ.60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రభుత్వం లబ్ధిదారుల సొమ్ము తిరిగి చెల్లిస్తామని చెప్పింది కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. పరిస్థితి ఇదీ... ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్న సమయంలోనే విద్యుత్, తాగునీటి సరఫరాకు సంబంధించిన వసతులు కల్పించాల్సి ఉంది. ఆ మేరకు రాజీవ్ స్వగృహ వారు రూ.60 లక్షలు ఆయా శాఖలకు చెల్లించారు. కానీ వారు త్వరితగతిన పనులు చేపట్టలేదు. లబ్ధిదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో ప్రభుత్వం సొంత నిధులతో నిర్మాణాలు చేపట్టలేకపోయింది. ఆర్థికంగా నష్టాల ఊబిలో కూరుకుపోవడంతో రాజీవ్ స్వగృహ నిర్మాణం చేపట్టిన శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి (ఎస్వీఈసీ) మూడేళ్లకు పైగా ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా నిలిపేసింది. దీంతో మూడేళ్లనుంచి స్వగృహ ఎస్టేట్‌లో మొండిగోడలు దర్శనమిస్తున్నాయి. ఇలా అన్ని వైపులనుంచి సమస్యలు చుట్టుముట్టడంతో మరో గత్యం తరం లేక ప్రభుత్వం స్వగృహ ఆస్తులను అమ్మేసింది. చకాచకా నిర్ణయాలు... జిల్లాలో నల్లగొండతో పాటు, మిర్యాలగూడ, భువనగిరి, సూర్యాపేటలో కూడా రాజీవ్ స్వగృహ నిర్మాణాల కోసం భూములు సేకరించారు. అయితే సూర్యాపేటలో మినహా భువనగిరిలో 121 ఎకరాలు, మిర్యాలగూడ 60 ఎకరాల భూములు సేకరించారు. కానీ, సర్వేలు పూర్తికాలేదు. దీంతో రాష్ట్ర విభజన నేపథ్యంలో అధికారంలోకి వచ్చే కొత్త సర్కారు స్వగృహ ఆస్తులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటోదనన్న ఉద్దేశంతో.. సర్వే చేసిన భూములను వెంటనే రాజీవ్ స్వగృహ మీదకు మార్పిడి చేయమని ఆదేశిస్తూ రెండు రోజుల క్రితం జిల్లా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. రూ. 12లక్షలు చెల్లించాం : విజయలక్ష్మి, కొనుగోలుదారు స్వగృహలో రెండు ఇళ్ల కోసమని రూ.12 లక్షలు చెల్లించి మూడేళ్లైంది. డబ్బులు తిరిగి చెల్లించాలని అడిగితే ఇళ్లను రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత మళ్లీ అధికారులను సంప్రదిస్తే భూములను అమ్ముతున్నామని, వాటి అమ్మకం పూర్తిగానే డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు చెల్లించలేదు. కొత్త ప్రభుత్వంలో ఇళ్లు కట్టిస్తామని మరోమారు చెప్పారు. డబ్బుల కోసం వెళ్లినప్పుడల్లా ఏదో ఒక సాకుతో చెప్పి పంపిస్తున్నారు.