హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కనుంది. ఇక గతేడాది ప్రియుడి గురించి సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి తెగ చక్కర్లు కొడుతున్నారు. డిన్నర్ డేట్‌లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు.
తాజాగా ఈ లవ్‌బర్డ్స్ ప్రేమకు ప్రతిరూపమైన పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌ను సందర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. “దే దే ప్యార్ దే” దర్శకుడు లవ్ రంజన్ వివాహానికి హాజరయ్యేందుకు ఈ జంట ఆగ్రాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment