కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తాజ్‌మహల్‌ను సందర్శించారు. భార్య, పిల్లలతో కలిసి తాజ్ మహల్ వద్ద సరదాగా ఫోటోలు దిగారు. భారత్‌లో ఏడు రోజుల అధికారిక పర్యటన కోసం శనివారం ఢిల్లీకి ట్రూడో చేరుకున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని జామా మసీదును ట్రూడో కుటుంబం సందర్శించే అవకాశముంది.